మహబూబ్‌నగర్ : వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఆటో వెనుకనే వస్తున్న జేసీబీ డ్రైవర్ ఇది గమనించి ఆటోను సరిచేయడానికి ప్రయత్నించాడు. దీంతో జేసీబీ క్రేన్ బలంగా తగిలి ఆటోలో ఉన్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా బిజ్నేపల్లి మండలం వట్టెం గ్రామ సమీపంలో శనివారం జరిగింది.
తెల్కపల్లి మండలం రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అలివేలమ్మ(54) ఆటోలో తెల్కపల్లి మీదుగా హైదరాబాద్ వస్తోంది. ఈ క్రమంలో ఆటో వట్టెం గ్రామ సమీపంలో బోల్తా కొట్టింది. దీంతో ఆటో వెనుకనే వస్తున్న జేసీబీ డ్రైవర్ ఆటోను తిరిగి నిలబెట్టడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆటోలోని అలివేలమ్మకు జేసీబీ క్రేన్ బలంగా ఢీకొనడంతో ఆమె చేయి నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఆటో బోల్తా : నలుగురికి గాయాలు
Published Sat, Jul 11 2015 4:51 PM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement