Auto Overturns
-
ఆటో బోల్తా: వ్యక్తి మృతి, ఆరుగురికి గాయాలు
గుత్తి (అనంతపురం): వేగంగా వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన అనంతపురం జిల్లా గుత్తి చెరువు కట్ట వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆటో బోల్తా: ఐదుగురికి గాయాలు
కొమరోలు (ప్రకాశం) : వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అల్లీనగరం వద్ద సోమవారం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో అల్లీనగరం శివారులో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
ఆటో బోల్తా: 9 మంది విద్యార్థులకు గాయాలు
రామాయంపేట (మెదక్) : ఇంటర్ పరీక్ష రాసి ఆటోలో ఇళ్లకు వెళుతున్న విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు. మెదక్ జిల్లా రామాయంపేట శివారులో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుల కధనం మేరకు... మండలంలోని కల్వకుంట గ్రామానికి చెందిన కొందరు విద్యార్థినీ విద్యార్థులు రామాయంపేటలోని సాయికృప, స్నేహ కళాశాలల్లో చదువుకుంటున్నారు. వారంతా మంగళవారం పరీక్ష రాసి మధ్యాహ్నం తిరిగి ఆటోలో బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న ఆటో రామాయంపేట శివారులో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు బాలికలు, ఇద్దరు బాలురు గాయపడ్డారు. ప్రమాద సమయంలో ఒక విద్యార్థి ఆటో నడుపుతున్నట్లు సమాచారం. క్షతగాత్రులను రామాయంపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
ఆటో బోల్తా: ఇద్దరికి తీవ్రగాయాలు
ఖానాపూర్ (ఆదిలాబాద్ జిల్లా): ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం మందపెల్లి వద్ద ఆదివారం మధ్యాహ్నం ఆటో బోల్తాపడి ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వెళుతున్న ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ సంఘటనలో రమేష్, భీమ్రావు అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వారిని ఖానాపూర్ ఆస్పత్రికి తరలించారు. -
ఆటో బోల్తా: నలుగురికి తీవ్రగాయాలు
మంత్రాలయం (కర్నూలు) : టైర్ పంక్చరై ఆటో బోల్తాపడిన ఘటన మంత్రాలయం మండలంలోని చిలకలదోన గ్రామ శివారులో గురువారం సాయంత్రం ఐదు గంటలకు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఎమ్మిగనూరు నుంచి మంత్రాలయం వైపు వెళ్తున్న ఆటో టైర్ పంక్చర్ కావడంతో బోల్తా పడింది. డ్రైవర్ వీరేంద్ర,ప్రయాణీకులు భీమేశ్, నాగరాజు, హనుమంతు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఆటో బోల్తా: మహిళ మృతి
మల్యాల (కరీంనగర్ జిల్లా) : కరీంనగర్ జిల్లా మాల్యాల మండల సమీపంలోని కొండగట్టు ఘాట్ రోడ్డులో శనివారం ఆటో బోల్తా పడటంతో ఓ మహిళ మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి. మృతురాలు వరంగల్ జిల్లా కరీమాబాద్ మండలం హెచ్ఆర్ కోటకు చెందిన లచ్చమ్మ(50)గా గుర్తించారు. గాయపడినవారిని సమీప ఆసుపత్రికి తరలించారు. -
ఆటో బోల్తా: ఎనిమిదిమందికి తీవ్రగాయాలు
శివ్వంపేట (మెదక్) : ఆటో బోల్తాపడిన ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలైన సంఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం నానుతండా శివారులో గురువారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని పిల్లుట్ల గ్రామానికి చెందిన దాసరి బాలనర్సయ్య కూతురు శ్రీమంతానికి పదిమంది కుటుంబ సభ్యులు ఆటోలో జిన్నారం మండలం అన్నారం గ్రామానికి బయలుదేరారు. అయితే నానుతండా శివారులోని మూలమలుపు వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టడంతో.. ఆటోలో ఉన్న బాలనర్సయ్య, సాలమ్మ, లక్ష్మమ్మ, బాలనర్సయ్యతోపాటు ఐదు సంవత్సరాల బాలుడు జగన్ కు తీవ్ర గాయాలయ్యాయి. పలువురికి తలకు గాయాలు కావడంతోపాటు కాళ్ళు,చేతులు విరిగాయి. క్షతగాత్రులను 108 అంబులెన్సులో స్థానిక ప్రభుత్వాసుపత్రికి.. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
వెల్దుర్తి (గుంటూరు) : చిన్న నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఆటో నడుపుతూ గుట్కా తినడానికి ప్రయత్నించిన యువకుడు ఆటో బోల్తా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం మండాది గ్రామ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. మాచర్ల మండలం తేరాలకు చెందిన సాయికృష్ణ(22) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆటోలో స్వగ్రామం నుంచి మాచర్ల వెళ్తుండగా.. మండాది గ్రామ సమీపంలోకి చేరుకోగానే గుట్కా తినడానికి ప్రయత్నించాడు. దీంతో ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఆ సమయంలో ఆటోలో ఉన్న ఓ ప్రయాణికుడు ఆటోలో నుంచి దూకి తన ప్రాణాలు రక్షించుకోగా.. సాయికృష్ణ మాత్రం అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రత్యక్ష సాక్షి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటో బోల్తా: మహిళ మృతి
కంచికచర్ల (కృష్ణా జిల్లా) : కంచికచర్ల మండలం బత్తినపాడు వద్ద సోమవారం ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కంచికచర్ల మండల కేంద్రం హనుమాన్పేటకు చెందిన సి.నాగమణి(48) అనే మహిళ మృతిచెందింది. ఆటో చెవిటికల్లు నుంచి కంచికచర్ల వెళ్తుండగా ముందు వెళ్తున్న బైక్ను తప్పించబోయి బోల్తా కొట్టింది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటో బోల్తా: ఐదుగురికి గాయాలు
హాలియ (నల్లగొండ) : బొడ్రాయి పండుగకు వెళ్లి వస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టడంతో.. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా హాలియ మండలం జానీరెడ్డి కాలనీలో సోమవారం చోటుచేసుకుంది. పెద్దవూర మండలం పూలగూడెం గ్రామంలో బొడ్రాయి మహోత్సవానికి వెళ్లి వస్తున్న సమయంలో ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఐదుగురూ గాయపడ్డారు. ఇది గుర్తించిన స్థానికులు వారిని నాగార్జున సాగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. -
కాలువలో పడ్డ ఆటో: ముగ్గురికి తీవ్రగాయాలు
తిర్యాని (ఆదిలాబాద్) : వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పంట కాలువలో పడింది. దీంతో ఆటోలో ఉన్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా తిర్యాని మండలం రాంపల్లి శివారులో సోమవారం చోటుచేసుకుంది. రాంపల్లి నుంచి తిర్యాని వెళ్తున్న ప్రయాణికుల ఆటో రోడ్డు పక్కన ఉన్న ఎన్టీఆర్ సాగర్ ప్రాజెక్ట్ కాలువలో పడటంతో ఆటోలో ఉన్న ముగ్గురు వ్యక్తులకు తీవ్రంగా గాయపడ్డారు. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను తిర్యాని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఆటో బోల్తా : ఒకరు మృతి
మర్రిగూడ : నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం ఖుదాభక్షిపల్లి వద్ద ఆటో బోల్తా పడి ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం సాయంత్రం హైదరాబాద్ వైపు నుంచి ఓ ఆటో వెళ్తుండగా...మరో వాహనం అడ్డు వచ్చేసరికి ఆటో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో ఆటో అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న రమావత్ ఖేరి (55) అనే మహిళ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. జాను, దాలి, దత్తు అనే వారికి తీవ్ర గాయాలు కావడంతో మర్రిగూడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వారిని నల్లగొండకు రిఫర్ చేశారు. -
ఆటో బోల్తా : మహిళ మృతి
ఇంద్రవెల్లి (ఆదిలాబాద్) : వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ప్రమాదంలో ఒక మహిళ మృతిచెందగా.. మరో ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం రాంపూర్ గ్రామ శివారులో ఆదివారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన పత్తికూలీలు ఆటోలో వెళ్తున్న సమయంలో మూల మలుపు వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న జానకాబాయి(45) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటో బోల్తా : ఒకరు మృతి
పుట్లూరు : అనంతపురం జిల్లా పుట్లూరు మండలం జంగంరెడ్డిపేట - మద్దిపల్లి మార్గ మధ్యంలో ప్రయాణికుల ఆటో బోల్తా పడడంతో ఒకరు మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం సాయంత్రం ఆటో జంగంరెడ్డిపేట నుంచి మద్దిపల్లికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న సుబ్బరాయుడు (45)కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం నార్పల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
పెళ్లి ఆటో బోల్తా : 20 మందికి గాయాలు
భోగాపురం (విజయనగరం) : పెళ్లి కొడుకుతో పాటు పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో పెళ్లి కొడుకు సహా 20 మందికి గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా, వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో.. విజయనగరం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా భోగాపురం మండలం అగ్నివరం గ్రామ సమీపంలోని 43వ జాతీయ రహదారిపై గురువారం జరిగింది. విశాఖ జిల్లా భీమిలి మండలం టి. నగరపాలెంకు చెందిన బాలసుబ్రహ్మణ్యం వివాహం విజయనగరం జిల్లా పూసపాటిరాగ మండలానికి చెందిన స్వాతితో జరుగనుండటంతో పెళ్లి బృందం ఆటోలో బయలుదేరింది. ఈ క్రమంలో ఆటో అగ్నివరం సమీపానికి చేరుకోగానే ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న 25 మందిలో 20 మందికి గాయాలయ్యాయి. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని విజయనగరం జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
ఆటో బోల్తా : మహిళ మృతి
ఆత్మకూరు (నల్గొండ జిల్లా) : నల్గొండ జిల్లా ఆత్మకూరు-తిమ్మాపూర్ మధ్య జాతీయ రహదారిలో ఆదివారం ఉదయం ఆటో బోల్తా పడి ఒక మహిళ మృతిచెందింది. 15మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వేములకొండకు చెందిన కూలీలు పత్తి తీసేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వేములకొండ గ్రామానికి చెందిన పద్మ(45) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా ఆటో డ్రైవర్ సహా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదాన్ని చూసిన స్థానికులు 108కు సమాచారం అందించారు. క్షతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటో బోల్తా : పదిమందికి గాయాలు
పుంగనూరు : చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం కందికుంట చెరువు వద్ద ఆదివారం ఓ ఆటో బోల్తా పడడంతో పది మందికి గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. బోయకొండ గంగమ్మ దేవాలయానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చౌడేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆటో బోల్తా : ఒకరు మృతి
మహబూబ్నగర్ (ఇటిక్యాల) : ఇటిక్యాల మండలం వేముల శివారులో శుక్రవారం అదుపు తప్పి ఓ ఆటో బోల్తాపడింది. ఈ ఘటనలో ప్రవీణ్ కుమార్(38) అనే వ్యక్తి మరణించగా.. 22 మందికి తీవ్రగాయాలయ్యాయి. డిండి ప్రాజెక్టులో వినాయకుడిని నిమజ్జనం చేసి ఆలంపూర్లోని జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకుని వస్తుండగా 44వ జాతీయరహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులు నల్గొండ జిల్లా చింతపల్లి మండలం పోలేపల్లి వాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటో బోల్తా : ఒకరి మృతి
నిమ్మనపల్లి (చిత్తూరు) : వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలం కొండసాలు వారు పల్లి గ్రామ శివారులో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామం నుంచి ప్రయాణికులతో కూడిన ఆటో నిమ్మనపల్లికి వెళ్తున్న సమయంలో గ్రామ శివారులోకి వెళ్లగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతొ ఆటోలో ఉన్న యశోదమ్మ(67) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
ఆటో బోల్తా : మహిళకు తీవ్రగాయాలు
ఇల్లందు (ఖమ్మం) : వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం కొత్తలింగాల సమీపంలో శనివారం జరిగింది. వివరాల ప్రకారం.. గోవిందరాల నుంచి ప్రయాణికులతో కొత్తలింగాల వెళ్తున్న ఆటో కొత్తలింగాల శివారులోకి చేరుకోగానే ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న కొత్త లింగాలకు చెందిన మహిళకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను 108 సాయంతో ఆస్పత్రికి తరలించారు. -
ఆటో బోల్తా : వ్యక్తి మృతి
గార (శ్రీకాకుళం) : శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన జిల్లాలోని గార వద్ద సోమవారం సాయంత్రం జరిగింది. దుమ్ము అప్పన్న(22) అనే వ్యక్తి గారలో బ్యాంకు పని పూర్తి చేసుకుని ఆటోలో ఇంటికి వెళుతుండగా ఆటో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో అప్పన్న అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో మృతుడి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. -
ఆటో బోల్తా : 8 మందికి గాయాలు
పీటీఎమ్ (చిత్తూరు) : ప్రయాణికులతో వెళ్తున్న ఆటో ముందుకి అకస్మాత్తుగా మేకల మంద దూసుకురావడంతో.. అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 8 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పెద్ద తిప్ప సముద్రం(పీటీఎమ్) మండలం టి.సదుమ్ క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం జరిగింది. పీటీఎమ్ నుంచి జి. కొత్తకోటకు వెళ్తున్న ప్రయాణికుల ఆటో టి. సదుమ్ క్రాస్ రోడ్డు వద్ద గల అడవి సమీపంలోకి రాగానే.. ఒక్కసారిగా మేకల మంద రోడ్డుపైకి దూసుకురావడంతో వాటిని తప్పించబోయి ఆటో అదుపు తప్పి బోల్తాకొట్టింది. దీంతో ఆటో నుజ్జునుజ్జై డ్రైవర్ సహా ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. -
ఆటో బోల్తా : 14 మందికి గాయాలు
కళ్యాణదుర్గం (అనంతపురం) : వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ప్రమాదంలో 14 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గరుడాపురం చెరువుకట్టపై శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కళ్యాణదుర్గం నుంచి కుర్లపల్లికి వెళ్తున్న ప్యాసింజర్ ఆటో గరుడాపురం చెరువుకట్ట సమీపంలోకి చేరుకోగానే ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న 14 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఆస్పత్రికి తరలించారు. -
ఆటో బోల్తా : నలుగురికి గాయాలు
మహబూబ్నగర్ : వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఆటో వెనుకనే వస్తున్న జేసీబీ డ్రైవర్ ఇది గమనించి ఆటోను సరిచేయడానికి ప్రయత్నించాడు. దీంతో జేసీబీ క్రేన్ బలంగా తగిలి ఆటోలో ఉన్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా బిజ్నేపల్లి మండలం వట్టెం గ్రామ సమీపంలో శనివారం జరిగింది. తెల్కపల్లి మండలం రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అలివేలమ్మ(54) ఆటోలో తెల్కపల్లి మీదుగా హైదరాబాద్ వస్తోంది. ఈ క్రమంలో ఆటో వట్టెం గ్రామ సమీపంలో బోల్తా కొట్టింది. దీంతో ఆటో వెనుకనే వస్తున్న జేసీబీ డ్రైవర్ ఆటోను తిరిగి నిలబెట్టడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆటోలోని అలివేలమ్మకు జేసీబీ క్రేన్ బలంగా ఢీకొనడంతో ఆమె చేయి నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.