శివ్వంపేట (మెదక్) : ఆటో బోల్తాపడిన ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలైన సంఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం నానుతండా శివారులో గురువారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని పిల్లుట్ల గ్రామానికి చెందిన దాసరి బాలనర్సయ్య కూతురు శ్రీమంతానికి పదిమంది కుటుంబ సభ్యులు ఆటోలో జిన్నారం మండలం అన్నారం గ్రామానికి బయలుదేరారు.
అయితే నానుతండా శివారులోని మూలమలుపు వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టడంతో.. ఆటోలో ఉన్న బాలనర్సయ్య, సాలమ్మ, లక్ష్మమ్మ, బాలనర్సయ్యతోపాటు ఐదు సంవత్సరాల బాలుడు జగన్ కు తీవ్ర గాయాలయ్యాయి. పలువురికి తలకు గాయాలు కావడంతోపాటు కాళ్ళు,చేతులు విరిగాయి. క్షతగాత్రులను 108 అంబులెన్సులో స్థానిక ప్రభుత్వాసుపత్రికి.. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఆటో బోల్తా: ఎనిమిదిమందికి తీవ్రగాయాలు
Published Thu, Jan 28 2016 5:28 PM | Last Updated on Sun, Sep 3 2017 4:29 PM
Advertisement
Advertisement