వేగంగా వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
గుత్తి (అనంతపురం): వేగంగా వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన అనంతపురం జిల్లా గుత్తి చెరువు కట్ట వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.
ప్రయాణికులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది.