వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
నిమ్మనపల్లి (చిత్తూరు) : వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలం కొండసాలు వారు పల్లి గ్రామ శివారులో సోమవారం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. గ్రామం నుంచి ప్రయాణికులతో కూడిన ఆటో నిమ్మనపల్లికి వెళ్తున్న సమయంలో గ్రామ శివారులోకి వెళ్లగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతొ ఆటోలో ఉన్న యశోదమ్మ(67) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.