ఘటనాస్థలిలో పరిశీలిస్తున్న పోలీసులు
శివమొగ్గ: అర్ధరాత్రి.. నగరంలో రోడ్లన్నీ నిర్మానుష్యం. పెద్ద ప్రొక్లెయినర్‌తో కొందరు వచ్చారు. వెంటనే ఏటీఎం ముందు నిలిపి నగదు యంత్రాన్ని పెకలించడంలో నిమగ్నమయ్యారు. ఇది సినిమా షూటింగ్ కాదు.. నిజంగా జరిగినదే. జేసీబీ సాయంతో ఏటీఎం యంత్రాన్ని తొలగించి డబ్బులు దొంగిలించేందుకు దొంగలు విశ్వప్రయత్నాలు చేశారు. ఈ వినూత్న సంఘటన శివమొగ్గ నగరంలోని వినోబా నగరలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది.
నకిలీ తాళాలతో జేసీబీ స్టార్ట్ చేసి
వివరాలు.. 100 అడుగుల రోడ్డు శివాలయం ఎదురుగా ఉన్న యాక్సిస్ బ్యాంకు ఏటీఎం సెంటర్ ఉంది. సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద గత కొన్ని రోజుల నుంచి ఒక జేసీబీ వాహనం మరమ్మతుల వల్ల నిలిచి ఉంది. దొంగలు నకిలీ తాళాలను ఉపయోగించి ఈ జేసీబీని స్టార్ట్ చేశారు. తరువాత ఏటీఎం వద్దకెళ్లి దానిని పెకలించే పనిలో పడ్డారు. ఇంతలో అదే రోడ్డులో ట్రాఫిక్ సీఐ సంతోష్ కుమార్‌తో కూడిన గస్తీ వాహనం వచ్చింది.
జేసీబీతో ఏటీఎం వద్ద ఏం చేస్తున్నారని దుండగులను సీఐ ప్రశ్నించారు. దీంతో దుండగులు జేసీబీని వదిలి పారిపోయారు. వినోబనగర పోలీసులు వచ్చి పరిశీలించారు. ఏటీఎం పైభాగం పూర్తి ధ్వంసమైంది. అక్కడి సీసీ కెమెరాల్లో దొంగతనం దృశ్యాలు రికార్డయ్యాయి. దొంగల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment