
చింతామణి: పట్టణంలోని ప్రముఖ సర్కిల్‌లో ఉన్న రెండు ఏటీఎంలలో గుర్తుతెలియని దుండగులు సుమారు రూ.35 లక్షల నగదును దోచుకెళ్లిన ఘటన బుధవారం వెలుగుచూసింది. వివరాలు.. మంగళవారం అర్ధరాత్రి పట్టణంలోని దొడ్డపేటలోని ఎస్‌బీఐ ఏటీఎంలోకి చొరబడిన దుండగులు మిషన్‌ను గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి అందులోని సుమారు రూ.20 లక్షల నగదును, అలాగే ఆర్టీసీ బస్టాండ్ పక్కన వున్న భోవి కాలనీ రోడ్డులో ఉన్న యాక్సిస్ బ్యాంకు ఏటీఎంను పగలగొట్టి రూ.15 లక్షల నగదు దోచుకొని పారిపోయారు. తమ చిత్రాలు రికార్డు కాకుండా సీసీ కెమెరాలు, సైరన్ వైర్లను ధ్వంసం చేశారు.
ఉదయం ఆ ప్రాంతవాసులు గమనించి బ్యాంకు సిబ్బందికి చెప్పగా వారు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ, ఏఎస్పీ తదితరులు పరిశీలించారు. వేలి ముద్రల నిపుణులు ఆధారాలను సేకరించారు. ఏటీఎంల దోపిడీతో పట్టణంలో ఆందోళన నెలకొంది.

Comments
Please login to add a commentAdd a comment