రాష్ట్రమంతటా హత్యలు, అత్యాచారాలు
మైసూరు: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా శాంతి భద్రతలకు రక్షణ ఉండదు, ఠాణాలపై దాడులు వంటివి జరుగుతూనే ఉంటాయని, ప్రభుత్వం కనీసం పట్టించుకోదని బీజేపీ పక్ష నాయకుడు ఆర్.అశోక్ ఆరోపించారు. సోమవారం మైసూరులో బీజేపీ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. ఉదయగిరి పోలీస్‌స్టేషన్‌పై దాడి ఘటన చుట్టూ చర్చ సాగింది. తరువాత అశోక్ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే చాలు, ఎక్కడ చూసినా హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు వంటి అనేక అక్రమాలు జరుగుతుంటాయని అన్నారు. ఇలాంటివాటిని ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పట్టించుకోవడం లేదని, ఇది వారికి అలవాటుగా మారిందని హేళన చేశారు. ఉదయగిరి ఠాణా మీదకు వేలమంది వచ్చి రాళ్లతో పోలీసుల వాహనాలను ధ్వంసం చేసినా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదన్నారు. ఇలాగైతే సామాన్య ప్రజలకు రాష్ట్రంలో రక్షణ ఎలా ఉంటుందని మండిపడ్డారు. దీని వల్ల హత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయని అన్నారు.
కేసులతో వేధింపులు: ప్రతాపసింహ
నా పైన వరుసగా కేసులు, ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తూ ఆత్మస్థైరాన్ని దెబ్బతీసే పని చేస్తున్నారు. ఇంటి నుంచి బయటికి రాకుండా ఉండాలని కుట్రలు పన్నుతున్నారు అని సిద్దరామయ్య సర్కారుపై బీజేపీ నేత, మాజీ ఎంపీ ప్రతాపసింహ మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర, ఆర్.అశోక్‌లను కలిసిన తరువాత మీడియాతో మాట్లాడారు. ఉదయగిరి ఠాణా, పోలీసులపై ఒక వర్గంవారు దాడులకు పాల్పడ్డారని, పోలీసులకు ధైర్యం చెప్పడానికి వెళ్లిన తనపైన విమర్శలు చేశారని ఆరోపించారు. ఏ తప్పు చేయకున్నా సిద్దరామయ్య ప్రభుత్వం నాపై వరుసగా కేసులు పెడుతూ వేధించే పనిలో ఉందని అన్నారు.
పోలీసులపై దాడి చేస్తే పట్టదా
బీజేపీ పక్ష నేత అశోక్ ధ్వజం
Comments
Please login to add a commentAdd a comment