ఎన్ని పాలికెలు అనేది సర్కారు ఇష్టం
శివాజీనగర: బెంగళూరు కార్పొరేషన్ ఒక్కటే ఉండగా, దానిని పరిపాలనా సౌలభ్యం కోసం విభజించి 7 మహానగర పాలికెలుగా ఏర్పాటు చేయాలని గ్రేటర్ బెంగళూరు ప్రాధికార ఏర్పాటు కోసం నియమించిన శాసనసభా కమిటీ సిఫార్సు చేసింది. దీంతో బీబీఎంపీ విభజన, గ్రేటర్ బెంగళూరు ప్రక్రియ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. కమిటీ అధ్యక్షుడు, శివాజీనగర ఎమ్మెల్యే రిజ్వాన్ హర్షద్, సభ్యులు కలిసి సోమవారం విధానసభ స్పీకర్ యూ.టీ.ఖాదర్‌కు నివేదికను సమర్పించారు. బెంగళూరు పాలికెను అభివృద్ధి, పరిపాలనా దృష్టితో విభజించి 7 చిన్న చిన్న పాలికెలుగా చేయాలని నివేదికలో స్పష్టం చేయడం గమనార్హం.
బీబీఎంపీని విడగొట్టాలి
సీఎం అధ్యక్షతన గ్రేటర్ బెంగళూరు అథారిటీ ఉండాలి
అప్పుడే సమర్థ పాలన, అభివృద్ధి
అసెంబ్లీ కమిటీ నివేదిక
ఒక్కో పాలికెలో 100 వార్డులు
7 నగర పాలికెలుగా విభజించాలి. ఒక్కో పాలికెలో 100 నుంచి 125 వార్డులు ఉండాలి. మేయర్ పదవీకాలం 30 నెలలు ఉండాలి అని సూచించారు.
బీబీఎంపీ విభజన జరిగితే ఏర్పాటయ్యే పాలికెలు ఏవంటే.. బెంగళూరు సెంట్రల్, బెంగళూరు దక్షిణ, బెంగళూరు తూర్పు, బెంగళూరు పడమర, బెంగళూరు ఉత్తర తదితర పేర్లు పెట్టాలి.
ఎక్కువ పాలికెలు ఉండడం వల్ల అభివృద్ధి సాధ్యపడుతుంది. బెంగళూరు సమగ్ర ప్రగతికి గ్రేటర్ బెంగళూరు ప్రాధికార ఏర్పాటు కావాలి
ఇప్పుడున్న బీబీఎంపీకి ఎన్నికలు ఆగస్టులో జరపాలి. జూన్ 30లోగా వార్డులను నిర్ధారించాలని నివేదికలో సూచించారు.
తరువాత విలేకరులతో మాట్లాడిన ఎమ్మెల్యే రిజ్వాన్ హర్షద్, బీబీఎంపీని 7 చిన్న చిన్న పాలికెలుగా చేయాలని సూచించామన్నారు. ఎన్ని భాగాలు చేస్తుందన్నది ప్రభుత్వం ఇష్టమన్నారు. ఇది బెంగళూరును విభజించడం కాదన్నారు. ఇక గ్రేటర్ బెంగళూరు ప్రాఽధికారకు ముఖ్యమంత్రి అధ్యక్షునిగా ఉంటారు. బెంగళూరు ఇన్‌చార్జి మంత్రి ఉపాధ్యక్షుడు, గ్రేటర్ ఏర్పాటైతే బీడీఏ, బెస్కాం, జలమండలి మధ్య సమన్వయం సాధ్యపడుతుందని అని చెప్పారు. గ్రేటర్ బెంగళూరు సమావేశాలను ప్రతి 2 నెలలకు ఒకసారి నిర్వహించాలన్నారు. బీబీఎంపీని ఏమీ మార్చడం లేదని, వేరే ప్రాంతాలను కలపడం లేదని తెలిపారు. పాలికెను ఆనుకుని ఉన్న గ్రామాలను చేర్చేందుకు సిఫార్సు చేశామన్నారు. కమిటీ గత 5 నెలల నుంచి పలు సమావేశాలు జరిపి ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి నివేదికను తయారు చేసినట్లు తెలిపారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేల సలహాలను తీసుకున్నామన్నారు. బీబీఎంపీ పరిపాలనలో పారదర్శకతను తీసుకురావటానికి, అభివృద్ధికి చిన్న పాలికెలే అనుకూలమని చెప్పారు. భావనాత్మక ఆలోచనలతో బెంగళూరు అభివృద్ధిని అడ్డుకోరాదన్నారు. అందువల్ల బెంగళూరుకు కొత్త స్వరూపం తీసుకొచ్చేందుకు నివేదికను రూపొందించినట్లు తెలిపారు. స్పీకర్ ఖాదర్ మాట్లాడుతూ ఈ నివేదికను అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి చర్చిస్తామని హామీ ఇచ్చారు.
ఎన్ని పాలికెలు అనేది సర్కారు ఇష్టం
ఎన్ని పాలికెలు అనేది సర్కారు ఇష్టం
ఎన్ని పాలికెలు అనేది సర్కారు ఇష్టం
ఎన్ని పాలికెలు అనేది సర్కారు ఇష్టం
ఎన్ని పాలికెలు అనేది సర్కారు ఇష్టం
Comments
Please login to add a commentAdd a comment