చెరువులో ఇద్దరు బాలల జలసమాధి
దొడ్డబళ్లాపురం: చెరువులో ఈతకొట్టడానికి వెళ్లిన ఇద్దరు బాలురు నీటమునిగిన సంఘటన హావేరి జిల్లా శిగ్గాంవి తాలూకా అత్తిగేరి గ్రామంలో చోటుచేసుకుంది. ప్రజ్వల్ (15), భూసరెడ్డి(14) మృతులు. ఆదివారం సెలవు కావడంతో సైకిల్‌పై ఇద్దరూ కలిసి చెరువు వద్దకు వచ్చారు. సైకిల్, చెప్పులు, బట్టలు విడిచి ఈత కొట్టడానికి చెరువులో దిగారు. అయితే సరిగా ఈత రానందున నీటమునిగి మరణించారు. చెరువు గట్టుమీద సైకిల్, దుస్తులను గమనించిన స్థానికులు ఏదో జరిగిందని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది గాలించి మృతదేహాలను వెలికితీశారు.
భక్తులను ఢీకొన్న బైకిస్టు
● ఒకరు మృతి
మైసూరు: చామరాజనగరజిల్లాలోని హనూరు తాలూకాలోని మహాదేశ్వర బెట్టకు శివరాత్రి సందర్భంగా పాదయాత్రగా వెళుతున్న భక్తులను ఓ బైకిస్టు ఢీకొన్నాడు, ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా నలుగురు గాయాల పాలయ్యారు. కొళ్లేగాళ తాలూకాలోని మదువనహళ్లి వద్ద జరిగింది. మైసూరుకు చెందిన భక్తులు పాదయాత్రగా వెళుతున్నారు. బెంగళూరులోని మారతహళ్లికి చెందిన టాటా బిర్లా, ఈ.ప్రజ్వల్ అనే యువకులు బైక్‌లో మలె మహాదేశ్వర బెట్టకు వెళ్తున్నారు. నిర్లక్ష్యంగా నడుపుతూ భక్తుల మీదకు పోనిచ్చారు. మైసూరుకు చెందిన స్వామి (37) అనే భక్తుడు చనిపోయాడు, భక్తులు చిక్కమాదు, మరిగోపాలి, అలాగే బైకిస్టులు గాయాల పాలయ్యారు.
గట్టిగా లాగు హైలెస్సా
బొమ్మనహళ్లి: మంగళూరులో జరిగిన కరావళి మైదానంలో కోటె చిన్మయ తాడు లాగే పోటీలు ఉత్సాహంగా జరిగాయి. యువతులు, మహిళలు పాల్గొని సత్తా చాటుకున్నారు. ఫ్లడ్ లైట్ల వెలుతురులో పోటీలు జరిపారు. గడినాడు కుంజత్తూరుకు చెందిన మహాలింగేస్వర మహిళల జట్టు, ఉడుపి జట్టును ఓడించి ట్రోఫీని సాధించింది. మొదటి రౌండులో మూడే సెకన్లలో గెలిచిన కుంజత్తూరు వనితలు అలాగే దూకుడును కొనసాగించారు. అర్ధరాత్రి వరకూ తాడు లాగే పోటీలు కొనసాగాయి. ఓవైపు భారీ స్క్రీన్ మీద భారత్– పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌ను చూస్తూనే, తాడు పోటీల్లో నిమగ్నమయ్యారు.
అమ్మవారికి మాఘ పూజలు
బనశంకరి: మాఘమాసం సందర్భంగా భక్తుల మొక్కులు తీర్చే కల్పవల్లి బనశంకరీదేవి భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చింది. సోమవారం వేకువజామున సుప్రభాత సేవ, ప్రత్యేక అభిషేకం, అర్చన గావించారు. భక్తులు బనశంకరీదేవికి నిమ్మకాయల ప్రమిదలతో దీపారాధన చేసి మొక్కుకున్నారు.
అపరిచితుని కాల్స్,
ఉద్యోగిని ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: అపరిచిత వ్యక్తి వేధింపులను భరించలేక బీబీఎంపీలో పనిచేసే మహిళా ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరు చామరాజపేటలో చోటుచేసుకుంది. నందిని (32) మృతురాలు. ఆమెకు 8 ఏళ్ల క్రితం సూర్య అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇటీవల నందిని మొబైల్‌ఫోన్ అపరిచిత వ్యక్తి నిరంతరం కాల్ చేయడం, మేసేజ్‌లు పెట్టడం చేస్తున్నాడు. ఈ విషయంలో నందిని భర్త సూర్య అనుమానంతో గొడవపడేవాడు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన నందిని ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చామరాజపేట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
చెరువులో ఇద్దరు బాలల జలసమాధి
చెరువులో ఇద్దరు బాలల జలసమాధి
చెరువులో ఇద్దరు బాలల జలసమాధి
Comments
Please login to add a commentAdd a comment