యశవంతపుర: బస్సును కారు వెనుక నుంచి ఢీకొన్న ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పర్యాటకులు గాయపడ్డారు. ఈ ఘటన చిక్కమగళూరు జిల్లా కళస తాలూకా కళస–హొరనాడు మార్గలో జరిగింది. ముందు వెళుతున్న కేఎస్ ఆర్టీసీ బస్సును వెనుక వస్తున్న కారు అదుపుతప్పి ఢీకొట్టింది. నలుగురు పర్యాటకులు కారులో హొరనాడు అక్కపూర్ణేశ్వరి దేవస్థానానికి వెళుతున్నట్లు తెలిసింది. కారు బస్సులోకి చిక్కుకుపోయింది, కారులోని వారికి తీవ్ర గాయాలయ్యాయి. కళస పోలీసులు, స్థానికులు కలిసి కారును బయటకు తీశారు. క్షతగాత్రుల వివరాలు తెలియవలసి ఉంది. కళస ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి చికిత్సలు అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment