కొప్పళవాసుల కోపావేశం
హొసపేటె: కొప్పళ జిల్లా కేంద్రమైన కొప్పళ నగరం సోమవారం నిరసనలతో దద్దరిల్లింది. ఈ పరిశ్రమ మాకొద్దు అని వేలాది మంది ప్రజానీకం ఆందోళన బాట పట్టారు. కొప్పళ జిల్లా బచావ్ ఆందోళన సమితి పిలుపుతో నగరంలో అందరూ బంద్‌ను పాటించారు. కొప్పళ నగర శివార్లలో బల్డోటా పారిశ్రామిక కుటుంబం ఓ ఉక్కు తయారీ కర్మాగారాన్ని స్థాపించి దాదాపు ఏడాది కావస్తోంది. 100 ఎకరాలలో ఫ్యాక్టరీ ఉంది. ఈ పరిశ్రమ వల్ల ప్రయోజనాల కంటే కష్ట నష్టాలే ఎక్కువగా ఉన్నాయని, చుట్టు గ్రామాల పరిధిలో వాయుకాలుష్యం ఏర్పడుతోందని, అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
900 ఎకరాలకు విస్తరణ?
ఇదిలా ఉంటే రూ. 54 వేల కోట్ల పెట్టుబడితో ఆ ఫ్యాక్టరీని 900 ఎకరాల్లో విస్తరించాలని అనుకోవడం జిల్లా ప్రజల జీవితాలను పాడు చేయడమేనని ఆందోళనకారులు దుయ్యబట్టారు. సంస్థ విస్తరణను అడ్డుకోవాలని జిల్లాలో పార్టీలకతీతంగా నాయకులు, కార్యకర్తలు బంద్‌కు మద్దతు తెలిపారు. ఈ పోరాటంలో అన్ని పార్టీల నాయకులు, మఠాధిపతులతో పాటు అభ్యుదయ సంఘాల నాయకులు పాల్గొనాలని కోరారు. నగర వీధుల్లో బ్యానర్లు కట్టి బృహత్ ప్రదర్శనగా సాగారు. ఉదయం నుంచి అంగళ్లు, ఆఫీసులు మూతపడ్డాయి. తాలూకాలోని పాఠశాలలు, కళాశాలకు సెలవు ప్రకటించారు.
ఉక్కు ఫ్యాక్టరీ విస్తరణపై ఆగ్రహజ్వాల
రైతు, ప్రజాసంఘాల నిరసన ర్యాలీ
కొప్పళవాసుల కోపావేశం
కొప్పళవాసుల కోపావేశం
కొప్పళవాసుల కోపావేశం
Comments
Please login to add a commentAdd a comment