
పరకల్ని ఆశించి.. నరకంలో పడింది..
గోకవరం : ఆవును పూజిస్తే వచ్చే పుణ్యం.. మరణానంతరం వైతరిణి అనే కశ్మలపూరితమైన నదిని దాటించి, నరకాన్ని తప్పిస్తుందని పురాణాలు చెపుతారుు. దాని మాటేమో గానీ, పాపం.. ఓ ఆవు బతికుండగానే వైతరిణి లాంటి లెట్రిన్ ట్యాంక్‌లో చిక్కుకుని నాలుగు గంటలు నరకయూతన అనుభవించింది. చివరికి జనం దానికి ఆ కశ్మలకూపం నుంచి విముక్తి కలిగించారు. మంగరౌతు రామకృష్ణ అనే వ్యక్తి సాకుతున్న ఆవు సోమవారం ఉదయం అరుుదుగంటల సమయంలో మేతకు తిరుగాడుతూ గోకవరం, కొత్తపల్లి గ్రామాల మధ్య ఓ పామాయిల్ తోటలో చొరబడింది.
తోట మకాంలోని లెట్రిన్ సెప్టిక్ ట్యాంక్ మీంచి వెళుతుండగా దాని మీదున్న మూతతో సహా బావిలోకి పడిపోరుుంది. ఎటూ కదలడానికి లేకుండా ఆ కశ్మలకూపంలో ఇరుక్కుపోరుుంది. ఉదయం ఏడు గంటలకు విషయం తెలుసుకున్న రామకృష్ణ.. నున్నం నూకరాజు తదితరులు ట్యాంక్ పక్కన వాలుగా గాడి తవ్వి, జేసీబీ సహాయంతో రెండు గంటలు శ్రమించి ఆవును బయటకు తీసి, చికిత్స చేరుుంచారు.