Septic tank
-
అప్పటి దాకా ఆడి పాడి.. అంతలోనే మృత్యు ఒడికి
హైదరాబాద్: అప్పటి దాకా పెళ్లి వేడుకలో ఆడి పాడిన ఓ చిన్నారి అంతలోనే మృత్యు ఒడికి చేరాడు. ఈ దారుణ సంఘటన బుధవారం రాత్రి శంషాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని మే ఫేర్ ఫంక్షన్ హాలులో జరిగిన పెళ్లి వేడుకలకు నందిగామ గ్రామానికి చెందిన శ్రీకాంత్‌రెడ్డి, మౌనిక దంపతుల కుమారుడు అభిజిత్‌రెడ్డి (5) తల్లి సోదరితో కలిసి వచ్చాడు. పెళ్లిలో మ్యూజిక్కు అనుగుణంగా ఉత్సాహంగా నృత్యాలు కూడా చేశాడు. సాంయంత్రం నాలుగు గంటల నుంచి చిన్నారి కనిపించకపోవడంతో తల్లి మౌనికతో పాటు బంధువులు చుట్టుపక్కల వెతికారు. రాత్రి 6 గంటల వరకు కూడా కనిపించకపోవడంతో ఆర్జీఐఏ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఫంక్షన్ హాలులో పరిశీలించడంతో వెనకాలే ఉన్న ఓ సంపు వద్ద బాలుడి చెప్పులు కనిపించాయి. సంపులోకి దిగి వెతకడంతో బాలుడి మృతదేహం బయటపడింది. అప్పటి వరకు అందరి మధ్యలో ఉత్సాహంగా ఆడిపాడిన చిన్నారి మృతదేహం బయటపడడంతో పెళ్లి వేడుకలో విషాదం నెలకొంది. ఫంక్షన్ హాలు యజమాన్యం నిర్లక్ష్యం కారణంగా చిన్నారి మృతిచెందాడని వారి కుటుంబసభ్యులు జాతీయ రహదారిపై ధర్నా చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తమ ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎంత గొప్ప ఐడియా అయినా సరే, కష్టంతోనే సాకారం..
ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది... అంటారు. చాలామంది ఐడియాను మాత్రమే నమ్ముకొని కష్టాన్ని మరిచిపోతారు. ‘ఎంత గొప్ప ఐడియా అయినా సరే, కష్టంతోనే సాకారం అవుతుంది’ అని నమ్మే దివాన్షు కుమార్ దివ్యమైన ఆవిష్కరణకు తొలి బీజం వేశాడు... అవసరాల నుంచి మాత్రమే కాదు విషాదాల నుంచి కూడా ఆవిష్కరణలు పుట్టుకొస్తాయి. ‘హోమో సెప్’ రెండో కోవకు చెందిన ఆవిష్కరణ. మనదేశంలో ప్రతిసంవత్సరం సెప్టిక్ ట్యాంకులను శుభ్రపరిచే క్రమంలో అందులోని విషపూరితాల వల్ల ఎంతోమంది చనిపోయారు. చనిపోతున్నారు. అనేక రంగాలలో రోబోలను విజయవంతంగా ఉపయోగిస్తున్నారు, సెప్టిక్ ట్యాంకులను శుభ్రపరచడంలో ఎందుకు ఉపయోగించకూడదు! అని ఆలోచించాడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్ విద్యార్థి దివాన్షు కుమార్. ఫైనల్ ఇయర్ మాస్టర్స్ ప్రాజెక్ట్‌లో భాగంగా సెప్టిక్ ట్యాంకులను శుభ్రపరిచే మానవరహిత రోబోకు రూపకల్పన చేశాడు. దీనికి ప్రొ.ప్రభురాజగోపాల్ మార్గదర్శకం వహించారు. రోబోను మరింత అభివృద్ధి పరిచే క్రమంలో ఒక డైనమిక్ టీమ్ తయారైంది. ఈ టీమ్ రాత్రనకా పగలనకా ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టింది. ఎన్నో మాక్–అప్ ట్రయల్స్ చేసింది. అనుకున్నది సాధించింది. ఈ ప్రాజెక్ట్‌కు ఎంతోమంది సీఎస్ఆర్ డోనర్స్ అండగా నిలిచారు. దివాన్షు ఆలోచనలో నుంచి పుట్టిన రోబోకు ‘హోమో సెప్’ అని నామకరణం చేశారు. తొలిసారిగా ఈ రోబోలు తమిళనాడులో పనిలోకి దిగబోతున్నాయి. ఒక ఐడియా రాగానే ‘ఆహా! ఎంత గొప్పగా ఉంది’ అనుకుంటాం. ఉద్వేగంలో ఒక నిర్ణయానికి రాకుండా, అది ఏ రకంగా గొప్పదో ఒకటికి పదిసార్లు ఆలోచించుకున్నప్పుడే, అందులో గొప్పదనం ఎంతో తెలుస్తుంది. అందుకే ‘ఐడియాలు గొప్పవే అయినప్పటికీ, ఉత్తుత్తి ఐడియాలు, సాధారణ ఐడియాలపై శ్రమ వృథా చేయవద్దు’ అనే మంచిమాటను నమ్ముతున్న దివాన్షు నుంచి భవిష్యత్‌లో మరిన్ని ఆవిష్కరణలు జరగాలని ఆశించవచ్చు. (క్లిక్: పురుషులకు అండగా స్త్రీ గొంతుక) -
సెప్టిక్ ట్యాంకులు, మ్యాన్‌హోళ్లతో ప్రాణాలు పోతున్నాయ్.. అయినా!
సాక్షి, హైదరాబాద్: మహానగరంలో సెప్టిక్ ట్యాంకులు, మురుగు నీటిపైపులైన్లపై ఉన్న మ్యాన్‌హోళ్లు కార్మికుల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. నైపుణ్య శిక్షణ లేని కార్మికులను కొందరు ప్రైవేటు యజమానులు, కాంట్రాక్టర్లు వీటిల్లోకి దించి వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నా.. సంబంధిత యంత్రాంగాలు చోద్యం చూస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో తరచూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటుండడంతో అమాయకుల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారుతున్నాయి. తాజాగా గచ్చిబౌలిలో జరిగిన దుర్ఘటన ఇదే విషయాన్ని రుజువు చేస్తోంది. ఈ నేపథ్యంలో నగరంలోని ఇంజినీరింగ్ స్టాఫ్‌కాలేజీ ఆఫ్ ఇండియా.. జలమండలి సౌజన్యంతో పారిశుద్ధ్య కార్మికుల ప్రాణాలకు భద్రతను కల్పిస్తూ.. వారిలో అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించింది. పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టేవారు విధిగా ఈ శిక్షణ పొందాల్సి ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కార్మికులకు ప్రాణ సంకటం.. మహానగరం పరిధిలో సుమారు ఏడువేల కిలోమీటర్ల పరిధిలో మురుగునీటి పారుదల వ్యవస్థ అందుబాటులో ఉంది. వీటిపై 2.5 లక్షల మ్యాన్‌హోళ్లున్నాయి. వీటితోపాటు శివారు ప్రాంతాల్లో డ్రైనేజీ నెట్వర్క్ లేకపోవడంతో లక్షలాది గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల్లో సెప్టిక్ ట్యాంకులను నిర్మించుకున్నారు. మురుగు సమస్యలు తలెత్తిన ప్రతిసారీ వీటిని శుద్ధి చేయడం, ఖాళీ చేసే పనుల్లో పాలుపంచుకుంటున్న కార్మికులు మృత్యువాత పడుతున్నారు. ట్యాంకులు, మ్యాన్‌హోళ్లలో ప్రమాదకరమైన మీథేన్ విషవాయువు పేరుకుపోవడంతో అందులోకి దిగినవారు ఊపిరాడక మరణిస్తున్నారు. మానవ ప్రమేయం లేకుండా సాంకేతికత ఆధారంగా వీటి శుద్ధికి ప్రాధాన్యమివ్వాలని గతంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసిన విషయం విదితమే. చదవండి: ‘కేంద్రం’ కొనదట..కొనుగోలు కేంద్రాలుండవ్ శిక్షణలో ముఖ్యాంశాలు.. ► జలమండలి నుంచి లైసెన్సు పొందిన కాంట్రాక్టర్లు మాత్రమే నైపుణ్య శిక్షణ పొందిన కార్మికుల ఆధ్వర్యంలో సెప్టిక్ ట్యాంకులను శుద్ధి చేయాలి. వీటిలోకి దిగే కార్మికులకు సంబంధింత కాంట్రాక్టరు.. భద్రత ఉపకరణాలు ఎయిర్ కంప్రెసర్లు, ఎయిర్‌లైన్ బ్రీతింగ్ పరికరాలు, గ్యాస్ మాస్క్, ఆక్సిజన్ సిలిండర్ విధిగా ఉండాలి. ► అత్యవసర మెడికల్ ఆక్సిజన్ కిట్ అందుబాటులో ఉంచాలి. నైలాన్ రోప్ ల్యాడర్, రిఫ్లెక్టింగ్ జాకెట్, నైలాన్ సేఫ్టీ బెల్ట్, సేఫ్టీ హ్యామ్స్, సేఫ్టీ ట్రైపాడ్ సెట్, సెర్చ్‌లైట్, సేఫ్టీ టార్చ్, పోర్టబుల్ ఆక్సిజన్ కిట్లను అందజేయాలి. ►ఫస్ట్‌ఎయిడ్ కిట్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. సెప్టిక్ ట్యాంకులు, మ్యాన్‌హోళ్లలో పేరుకుపోయిన ప్రమాదకర వాయువులను గుర్తించే గ్యాస్ మానిటర్ వినియోగించాలి. దీంతో ఏ స్థాయిలో వాయువులున్నాయో తెలుసుకోవచ్చు. క్లోరిన్ మాస్కులు అందుబాటులో ఉంచాలి. సెప్టిక్ ట్యాంకులను జలమండలి కాల్‌సెంటర్ 155313/14420కు కాల్చేసి శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేయించుకోవాలి. ప్రతి మూడేళ్లకోసారి సెప్టిక్ ట్యాంకును శుభ్రం చేసుకోవడం తప్పనిసరి. చదవండి: ఊపిరి పణంగా.. ఉద్యమం ఉధృతంగా.. -
గచ్చిబౌలిలో విషాదం: సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా ఊపిరాడక..
సాక్షి, హైదరాబాద్: సెప్టిక్‌ట్యాంక్‌ను శుభ్రపరిచేందుకు లోపలికి దిగిన ఇద్దరు కార్మికులు మృతువాత పడ్డారు. మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ దుర్ఘటన కొండాపూర్‌లోని గౌతమి ఎన్‌క్లేవ్‌లోని హేమదుర్గా ప్రెస్టీజ్ అపార్ట్మెంట్లో ఆదివారం జరిగింది. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ జి.సురేష్, మృతుల కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు.. కొండాపూర్ గౌతమి ఎన్‌క్లేవ్‌లోని హేమదుర్గా ప్రెస్టీజ్ అపార్ట్మెంట్లోని సెప్టిక్‌ట్యాంక్ శుభ్రం చేయడానికి ప్రైవేటు సెప్టిక్ ట్యాంకర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ట్యాంకర్ డ్రైవర్, యజమాని అయిన స్వామి, హెల్పర్ జాన్ కలిసి క్లీనింగ్ చేయడానికి ఒప్పుకొన్నారు. చంపాపేట్ సింగరేణి కాలనీ ఆదర్శనగర్‌కు చెందిన శ్రీనివాస్ (38) అలియాస్ శ్రీను, ఈ ప్రాంతానికే చెందిన ఆంజనేయులు (25)ను సెíప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసే పనులకు రావాలని చెప్పారు. వీరిద్దరూ సరే అనడంతో ఆదివారం ఉదయం 8 గంటలకు గౌతమి ఎన్‌క్లేవ్‌లోని హేమదుర్గా ప్రెస్టీజ్ అపార్ట్‌మెంట్‌కు ట్యాంకర్‌తో పాటు చేరుకున్నారు. సెప్టిక్ ట్యాంక్ మూతలు తీసి పైపులతో కొంత నీటిని తొలగించారు. భద్రత చర్యలు నిల్.. సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేయాలంటే ముందుగా భద్రత చర్యలు చేపట్టాలి. కానీ.. హేమదుర్గా అపార్ట్మెంట్లో లోపలికి దిగిన ఆంజనేయులు, శ్రీనివా స్ ముఖానికి మాస్కులతో కూడిన యంత్రాలు వాడకపోవడం, అంతకుముందే ఎగ్జాస్టింగ్ ఫ్యాన్‌ను వాడకపోవడం, మూత తెరిచి కనీసం అందులోని విషవాయువులు బయటకు వెళ్లి పోయేంత వరకు వేచి ఉండక పోవడంతోనే ఇద్దరు మృత్యువాత పడినట్లు భావిస్తున్నారు. సెప్టిక్ ట్యాంకర్ జీహెచ్ఎంసీలో రిజిస్టర్ చేసుకున్నా వారి ద్వారా వచ్చిన కాల్ కాకుండా ప్రైవేటుగా వచ్చిన కాల్తోనే వారు వచ్చి శుభ్రం చేసే పనులను చేపట్టినట్లు తెలుస్తోంది. మిన్నంటిన రోదనలు.. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఘటన స్థలానికి చేరుకొని గుండెలవిసేలా రోదించారు. శ్రీనివాస్, ఆంజనేయులు కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. శ్రీనివాస్ స్వస్థలం నల్లగొండ జిల్లా దేవరకొండ మంజు తండా. కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి ఆటో నడపడంతో పాటు ఇతర కూలిపనులు చేస్తున్నాడు. ఆయనకు భార్య సుజాత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆంజనేయులుది నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట్‌లోని అక్కారం గ్రామం. భార్య పద్మ, అయిదేళ్ల కుమారుడు ఉన్నారు. సెప్టిక్ ట్యాంక్ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఇన్స్పెక్టర్ సురేష్ తెలిపారు. ఊపిరి ఆడకపోవడంతోనే.. శుభ్రపరిచేందుకు శ్రీనివాస్, ఆంజనేయులు సెప్టిక్ ట్యాంక్ లోపలికి దిగారు. అరగంట అయినా ఎలాంటి ఉలుకూ పలుకూ లేకపోవడంతో స్వామి, జాన్ కూడా లోపలికి దిగారు. ఇది గమనించిన వాచ్‌మన్ మరికొందరితో కలిసి స్వామిని, జాన్‌ను బయటికి లాగారు. వారు ఊపిరి తీయడం తీవ్ర ఇబ్బందిగా ఉండటంతో కొండాపూర్‌లోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. సెప్టిక్‌ట్యాంక్ లోపలే ఊపిరి ఆడక బయటకు రాలేకపోయిన శ్రీనివాస్, ఆంజనేయులును అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వెలికితీశారు. అప్పటికే వారిద్దరూ మృత్యువాత పడినట్లు గుర్తించారు. చదవండి: ఎన్టీఆర్ పార్కు ముందు బీభత్సం.. హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లిన కారు -
హైదరాబాద్‌లో విషాదం: గాలిపటం ఎగురవేస్తూ..
సాక్షి, హైదరాబాద్: నగరంలో విషాదం చోటుచేసుకుంది. గాలిపటం ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో పడి ఓ బాలుడు మృతిచెందాడు. ఈ సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపిరెడీ కాలనీలో చోటుచేసుకుంది. మంగళవారం నాడు అరవింద్(7) అనే చిన్నారి ఇంటి సమీపంలో గాలి పటం ఎగురవేస్తూ పక్కనే ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో పడి మృతి చెందాడు. అయితే కొద్దిసేపటికి బాలుడు కనిపించడం లేదని గుర్తించిన తల్లిదండ్రులు చుట్టుపక్కలా వెతికారు. అయినప్పటికి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: తొమ్మిది రోజులైనా కానరాని జాడ.. డానియెల్ ఎక్కడ? అయితే ఈ రోజు ఉదయం సెప్టిక్ ట్యాంక్‌లో పడి ఉన్న బాలుడిని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారిని బయటికి తీయగా అప్పటికే మృతి చెందాడు. దీంతో బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు మోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యర్థం.. ప్రయోజనమే
సిద్దిపేట జోన్: జాతీయ, రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛతలో గుర్తింపు పొందిన సిద్దిపేట మున్సిపాలిటీలో చేపట్టిన వినూత్న ప్రయోగం విజయమవంతమైంది. ఆరు నెలల క్రితం ప్రారంభమైన మానవ విసర్జితాల యూనిట్ నుంచి తొలి ఫలితం వచ్చింది. పట్టణంలో నివాస గృహాల సెప్టిక్ ట్యాంక్‌ల నుంచి సేకరించిన మానవ విసర్జితాలను శుద్ధీకరణ చేసి ఎరువు తయారు చేశారు. స్వచ్ఛ సిద్దిపేటలో భాగంగా గత ఫిబ్రవరిలో సుమారు రూ.2 కోట్లతో ఆర్థికమంత్రి హరీశ్‌రావు పట్టణ శివారులో ఎకరం స్థలంలో మానవ విసర్జితాల శుద్ధీకరణ యూనిట్ ఏర్పాటు చేశారు. పట్టణంలోని 35 వేల నివాస గృహాల నుంచి సెప్టిక్ ట్యాంక్‌లోని మానవ విసర్జితాల ఎఫ్ఎస్టీపీ (ఫికెల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్)కు తరలిస్తారు. అక్కడ అనారోబిక్ సేఫ్టీలైజేషన్ రియాక్టర్లో విసర్జితాలను మెథనైజేషన్ పద్ధతిలో శుద్ధి చేసి విసర్జితం, నీటిని వేరు చేస్తారు. నీటిని పాలిషింగ్ ఫండ్‌లో పాస్పరేట్, సల్ఫర్ ద్వారా శుద్ధిచేసి ప్యూరిఫైడ్ వాటర్‌గా మార్చుతారు. 18 రోజుల తర్వాత మలం ఎరువుగా మారుతుంది. ఈ ప్రక్రియ మొత్తం సాంకేతికతతో జరుగుతుంది. తొలి ఫలితం సిద్ధం: ఆరు నెలల క్రితం మొదలైన యూనిట్ తొలి ఫలితం నేడు సిద్ధమైంది. లక్షా 20 వేల లీటర్ల సామర్ధ్యం గల శుద్ధీకరణ ప్లాంట్‌లో ప్రతిరోజూ 20 వేల లీటర్ల విసర్జితాలు శుద్ధిచేసే అవకాశం ఉంది. గత ఆరు నెలల్లో 100కు పైగా వాహనాల ద్వారా లక్షా 60 వేల లీటర్ల మానవ విసర్జితాలను సేకరించారు. దాని నుంచి 4వేల కిలోల ఎరు వు, 16 వేల లీటర్ల శుద్ధిచేసిన నీటిని తయారు చేశా రు. నీటిని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న హరితహారం మొక్కలకు వినియోగిస్తున్నారు. రూ.5కు కిలో చొప్పున.. సిద్దిపేట పట్టణంలో సెప్టిక్ ట్యాంక్‌ల నుంచి సేకరించిన విసర్జితాలను శుద్ధీకరణ చేసి 4 వేల కిలోల ఎరువు తయారు చేశాం. దాన్ని మున్సిపాలిటీకి రూ. 5కు కిలో చొప్పున విక్రయించే ఆలోచనలో ఉన్నాం. భవిష్యత్‌లో శుద్ధీకరణ లక్ష్యం మరింతగా పెంచుతాం. – రవికుమార్, యూనిట్ ఇన్చార్జ్ -
విషాదం: సెప్టిక్ ట్యాంక్‌లో పడి ఐదుగురు మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. సెప్టిక్ ట్యాంక్‌లో పడిన చిన్నారిని కాపడటం కోసం ప్రయత్నించిన మరో నలుగురు కూడా మరణించారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. వివరాలు.. ఆగ్రా ఫతేహాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతాపూర్ గ్రామానికి చెందిన పదేళ్ల చిన్నారి అనురాగ్ ఇంటి సమీపంలో ఆడుకుంటూ వెళ్లి సెప్టిక్ ట్యాంక్‌లో పడ్డాడు. బాలుడిని కాపాడటం కోసం వెళ్లిన మరో నలుగురు కూడా మరణించారు. సోము, రామ్ ఖిలాడి, హరిమోన్(16), అవినాశ్(12) చిన్నారి అనురాగ్‌ని కాపడటం కోసం ప్రయత్నించి మృత్యువాత పడ్డారు. వీరిలో అవినాశ్, అనురాగ్, హరిమోన్ ముగ్గురు సోదరులు. గ్రామస్తులు వీరిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే వీరంతా మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. మరణించిన వారికి రెండు లక్షల రూపాయల చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు. చదవండి: నాన్‌వెజ్ పిజ్జా ఇస్తావా? రూ.కోటి ఇవ్వాల్సిందే -
పట్టణాల్లో సెప్టేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో జల, వాయు కాలుష్య నివారణకు పురపాలక శాఖ ఉపక్రమిస్తోంది. పట్టణ స్థానిక సంస్థల్లో సెప్టేజ్ ట్రీట్మెంట్ (మరుగుదొడ్ల వ్యర్థాల నిర్వహణ) ప్లాంట్లు పెద్ద సంఖ్యలో నెలకొల్పాలని నిర్ణయించింది. ఈ వ్యర్థాల నిర్వహణ లోపభూయిష్టంగా ఉండటంతో దేశంలో జల, వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ్ భారత్ మిషన్ నివేదించింది. మరుగుదొడ్డి, సెప్టిక్ ట్యాంక్‌కు సమీపంలోని నీటి వనరుకు మధ్య కనీసం 20 అడుగుల దూరం ఉండాలి. అయితే ప్రస్తుతం సగటున 4 అడుగుల దూరం మాత్రమే ఉంటోందని నివేదిక పేర్కొంది. దాంతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని వెల్లడించింది. నిర్దేశిత సమయంలో సెప్టిక్ ట్యాంక్‌లను శుభ్రం చేయకపోవడం వల్ల కూడా జల, వాయు కాలుష్యాలు పెరుగుతూ ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. భవిష్యత్ అవసరాలు పరిగణనలోకి.. బహిరంగ మల విసర్జనను అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఏర్పాటు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. మరోవైపు మన రాష్ట్రంలో ‘అందరికీ ఇళ్లు’పథకం కింద ‘వైఎస్సార్ జగనన్న కాలనీలు’పేరిట 30 లక్షల ఇళ్లతో దాదాపు 17వేల ఊళ్లు కొత్తగా నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యుక్తమైంది. ఆయా కాలనీల్లో ప్రతి ఇంటికీ తప్పనిసరిగా మరుగుదొడ్డి నిర్మించేలా డిజైన్‌ను ఖరారు చేశారు. ఇంత పెద్ద సంఖ్యలో కొత్తగా మరుగుదొడ్లు నిర్మించనుండటంతో మరుగుదొడ్ల వ్యర్థాల నిర్వహణకు సరైన వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం మరింతగా పెరగనుంది. ఈ సమస్యకు పరిష్కారంగా సెప్టేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు పురపాలక శాఖ కార్యాచరణ రూపొందించింది. భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో స్వచ్ఛ్ ఏపీ కార్పొరేషన్ ద్వారా మూడు దశల్లో సెప్టేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నెలకొల్పాలని నిర్ణయించారు. మేలో తొలిదశ ప్రారంభం ► సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను నగర, పట్టణ శివారులోని సెప్టేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు తరలిస్తారు. అక్కడ వ్యర్థాలను తగిన రీతిలో నిర్వహించిన తరువాత ఎరువు తయారవుతుంది. వాటిని నర్సరీలు, పొలాలకు సరఫరా చేస్తారు. మిగిలిన వ్యర్థాలను కాలుష్య కారకం కాని రీతిలో డిస్పోజ్ చేస్తారు. ► మొదటి దశ సెప్టేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణాన్ని వచ్చే మేలో మొదలు పెట్టి వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని స్వచ్ఛ్ ఏపీ కార్పొరేషన్ భావిస్తోంది. ఆ తర్వాత రెండు, మూడు దశల పనులు చేపడతారు. తొలుత 32 పట్టణ స్థానిక సంస్థల్లో.. ► మొదటి దశలో అమృత్ పథకం అమలు అవుతున్న 32 పట్టణ స్థానిక సంస్థల్లో ఈ ప్లాంట్లను నెలకొల్పుతారు. రెండో దశలో లక్ష నుంచి 5 లక్షల జనాభా ఉన్న మున్సిపాలిటీలు, మూడో దశలో లక్షలోపు జనాభా ఉన్న మున్సిపాలిటీలలో వీటిని ఏర్పాటు చేస్తారు. ఆ విధంగా మొత్తం 110 పట్టణ స్థానిక సంస్థల్లో వీటిని నెలకొల్పుతారు. ► నగరం, పట్టణం శివారులో ఈ ప్లాంట్లను నెలకొల్పుతారు. అందుకు ఆయా మున్సిపాలిటీలు భూమిని కేటాయిస్తాయి. జనాభా ప్రాతిపదికన ప్లాంట్ల సామర్థ్యాన్ని నిర్ణయించి ఏర్పాటు చేస్తారు. ► ఒక్కో ట్రీట్మెంట్ ప్లాంట్‌కు రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు వ్యయం అవుతుందని భావిస్తున్నారు. వాటితోపాటు సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసే వాహనాలతో కూడిన యూనిట్లను కొనుగోలు చేస్తారు. ► మరుగుదొడ్ల అవుట్ లెట్లను ఎక్కడా వీధి కాలువలలోకి విడిచిపెట్టకుండా కచ్చితంగా నియంత్రిస్తారు. ► పట్టణాల్లో ప్రతి ఇంటి సెప్టిక్ ట్యాంక్ కనీసం మూడేళ్లకు ఓసారి శుభ్రం చేయాలన్నది లక్ష్యం. ► అందుకోసం ఒక్కో మున్సిపాలిటీకి 5 నుంచి 25 వరకు సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసే వాహనాలతో కూడిన యూనిట్లను సమకూరుస్తారు. -
సెప్టిక్ ట్యాంక్ స్థలాన్నీ వదల్లే
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరంలో పలు లే అవుట్లలో పార్కులు, క్రీడా స్థలాలు తదితరాల కోసం వదిలిన ఖాళీస్థలాల్లో వాటిని ఏర్పాటు చేయకుండా యథేచ్ఛగా భవన నిర్మాణాలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలతో ఖాళీ స్థలాలంటూ లేకుండా నగరంలో లంగ్‌స్పేస్ కరువవుతోంది. జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం రెండు నెలల క్రితం ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన అసెట్స్ ప్రొటెక్షన్ సెల్ (ఏపీసీ)కు అందుతున్న ఫిర్యాదులతో ఇలాంటి ఆక్రమణలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు పార్కుల కోసం వదిలిన స్థలాలు కబ్జాల పాలైన ఘటనలు వెలుగు చూడగా.. సెప్టిక్ ట్యాంక్ కోసం వదిలిన స్థలాన్ని కూడా ఆక్రమించి రెండు ఇళ్లు నిర్మించిన ఘటన బయటపడింది. ఏపీసికి అందిన ఫిర్యాదుతో సంబంధిత అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి క్షేత్రస్థాయి తనిఖీలు చేశారు. కూకట్పల్లి ఆల్విన్ కాలనీలోని హుడా లే అవుట్‌లోని సర్వే నంబర్ 336లో సెప్టిక్ ట్యాంక్ కోసం వదిలిన స్థలంలో రెండు ఇళ్లు నిర్మించినట్లు గుర్తించారు. 924 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించిన వీటికి సంబంధించి యాజమాన్య హక్కులు, ఇళ్ల నిర్మాణానికి పొందిన అనుమతి పత్రాలు చూపాల్సిందిగా కోరగా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో సెప్టిక్ ట్యాంకుకు వదిలిన స్థలంలోని ఇళ్లను ఈ నెల 10న కూల్చివేసినట్లు ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కాంపాటి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు సంబంధించి ఎవరైనా టోల్‌ఫ్రీ నంబర్ 1800–599–0099కు ఫోన్ చేయవచ్చని సూచించారు. -
అన్నాచెల్లెలి కుటుంబాల్లో విషాదం
మేడిపెల్లి(వేములవాడ): అప్పటివరకూ ఇంట్లో అల్లరి చేసిన చిన్నారులు విగతజీవులుగా మారి తల్లిదండ్రులకు కన్నీళ్లను మిగిల్చిన సంఘటన జగిత్యాల జిల్లా మేడిపెల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. మేడిపెల్లి మండలకేంద్రానికి చెందిన ఓల్పుల జలందర్–మానస దంపతులకు కొడుకు యశ్వంత్(5)తోపాటు కూతురు ఉంది. జలందర్ చెల్లెలు లావణ్యను పెగడపెల్లి మండలం ఆరేళ్లికి గ్రామానికి చెందిన దుబ్బెటి అజయ్‌కి ఇచ్చి వివాహం చేశారు. వీరికి రుతిక(8)తోపాటు రెండేళ్ల కూతురు ఉంది. రాఖీ పండుగకోసం మేడిపెల్లిలోని సోదరుడి ఇంటికి పిల్లలతోపాటు వచ్చింది. శుక్రవారం జలందర్ కొడుకు యశ్వంత్‌తోపాటు లావణ్య పిల్లలు రుతిక, చిన్నారి చెల్లెలు ఇంటి సమీపంలోని యాదవ సంఘంలో ఆడుకునేందుకు వెళ్లారు. సెప్టింక్‌ట్యాంకుకోసం తీసిన గుంతలో నీరు ఉండగా రుతిక, యశ్వంత్ అందులో పడిపోయారు. నీటిలో మునిగిపోతున్న వీరిని గమనించిన రుతిక చెల్లెలు ఇంట్లోకి వెళ్లి కేకలు వేస్తూ పెద్దలకు చెప్పడంతో గుంత వద్ద, సమీపంలోని బావి వద్ద వెతికారు. గుంతలో పడిపోయారని గుర్తించి బయటకు తీసి జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు. అన్నాచెల్లెల్లకు చెందిన ఇద్దరు పిల్లలు మృతిచెందడంతో రెండుకుటుంబాల్లో విషాదం అలుముకుంది. జలందర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. -
భార్యను ముక్కలు చేసి..సెప్టిక్ ట్యాంకులో
సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీ, రోహిణి జిల్లాలోని ప్రేమ్ నగర్లో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో భార్యను చంపి ముక్కలు ముక్కలుగా నరికి సెప్టింక్ ట్యాంక్‌లో పడవేసిన ఘటన కలకలం రేపింది. పోలీసు ఉన్నతాధికారి డిప్యూటీ పోలీస్ కమిషనర్ రోహిణి మిశ్రా అందించిన సమాచారం ప్రకారం.టీవీ మెకానిక్‌గా పనిచేస్తున్న అషు(37) వివాహేతర సంబంధం అనుమానంతో భార్య సీమ(30) ను దారుణంగా హత్యచేశాడు. గత ఆరు నెలల నుంచి భార్యతో తరుచూ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం మరోసారి భార్యతో ఘర్షణకు దిగాడు అషు. అనంతరం ఆమెను హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికి సెప్టింక్ ట్యాంకులో పడేశాడు. మొండెం, అవయవాలు, తలను వేరు చేసి వాటిని కనీసం ఆరు ముక్కలుగా కోసి, కొన్ని ముక్కలను ఇంటి వద్ద ఉన్న సెప్టిక్ ట్యాంకులో పడేశాడు. మొండెంను ఒక సంచిలో నింపి, రెండు కిలోమీటర్లకు పైగా దూరం తీసుకెళ్లి మరీ కాలువలో పడవేసాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడని డీసీపీ మిశ్రా తెలిపారు. నిందితుని సమాచారం ఆధారంగా మృతదేహం భాగాలను స్వాధీనం చేసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. అయితే తన కుమార్తెను అదనపు కట్నం కోసం హింసించేవాడని, ముగ్గురు ఆడపిల్లలు పుట్టడంతో, కొడుకు కోసం మరింత వేధించేవాడని మృతురాలి తల్లిదండ్రులు, సోదరుడు ఆరోపించారు. -
సెప్టిక్ ట్యాంక్ కాదు మృత్యు ట్యాంక్
పాట్నా : నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగి ఊపిరాడక ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన గురువారం సాయంత్రం బీహార్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... బీహార్‌లోని చంపారన్ జిల్లాలోని జీత్‌పుర్‌కు చెందిన మోహన్ మహతో కొత్తగా ఓ ఇంటిని నిర్మిస్తున్నాడు. గురువారం సాయంత్రం ఇంటి నిర్మాణ పనులు ఎలా సాగుతున్నాయో తెలుసుకోవటానికి వెళ్లాడు. ఒక్కొక్కటిగా అన్నీ చూసుకుంటూ సెప్టిక్ ట్యాంక్ ఎలా కడుతున్నారో తెలుసుకోవటానికి లోపలికి దిగాడు. ఎంతసేపటికి మోహన్ బయటకు రాకపోవటంతో అతని తండ్రి, తల్లి, తమ్ముడు కూడా లోపలికి దిగారు. వారు కూడా బయటకు రాకపోవటంతో మరో ఇద్దరు గ్రామస్తులు లోపలికి దిగారు. ఇలా మొత్తం ఆరు మంది లోపల ఊపిరాడక కోమాలోకి వెళ్లిపోయారు. ఆరుగురిని ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. కోమాలోకి వెళ్లిన వెంటనే వారు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసు అధికారి అలోక్ కుమార్ మాట్లాడుతూ.. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు తరలించామని తెలిపారు. వారి మృతికి సంబంధించిన సరైన కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కారణాలు తెలిసే అవకాశం ఉందన్నారు. -
సెప్టిక్ ట్యాంకులో పడి జీహెచ్ఎంసీ కార్మికుడి మృతి
హైదరాబాద్: వాడకంలో లేని పాత సెప్టిక్ ట్యాంకుపై మట్టి డంపింగ్ చేస్తున్న క్రమంలో స్లాబ్ కూలి ట్రాక్టర్ ట్రాలీతో సహా ఓ వ్యక్తి అందులో పడి దుర్మరణం చెందాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఈ దుర్ఘటన జరిగింది. వరంగల్ జిల్లా, రామన్నపేటకు చెందిన వెంకటేష్ (40) మియాపూర్ న్యూ కాలనీలో గత కొన్నేళ్లుగా ఉంటూ జీహెచ్ఎంసీలో కాంట్రాక్టు లేబర్‌గా పనిచేస్తున్నాడు. జీహెచ్ఎంసీ పారిశుధ్య విభాగంలో ట్రాక్టర్ పై లేబర్‌గా ఉన్న అతను ఇతరులతో కలసి హాఫీజ్పేట్ డివిజన్ జనప్రియ అపార్ట్‌మెంట్స్‌లో వ్యర్థాలు, మట్టిని తొలగించే పని శుక్రవారం చేపట్టాడు. ట్రాక్టర్ డ్రైవర్ కుమారస్వామి, మరో కార్మికుడు సారయ్య, వెంకటేష్‌లు వ్యర్థాలను తొలగించి అపార్ట్మెంట్స్ మధ్యలో ఉన్న సెప్టిక్ ట్యాంకుపై వేస్తున్నారు. మ«ధ్యాహ్నం వారు సెప్టిక్ ట్యాంకుపై ట్రాక్టర్‌ను నిలిపి మట్టిని తొలగిస్తుండగా అది కింద పడలేదు. దీంతో వెంకటేష్ వెళ్లి ట్రాక్టర్ వెనుక భాగంలోని ట్రాలీకి ఉన్న తలుపును తొలగించడంతో అది ఒక్కసారిగా సెప్టిక్ ట్యాంకుపై భాగంపై కూలింది. దీంతో వెంకటేష్ ప్రమాదవశాత్తూ ట్రాలీతో సహా సెప్టిక్‌ట్యాంకులో పడి కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. సాయంత్రం 6.30 గంటలకు వివిధ పంపింగ్ యంత్రాల ద్వారా ట్యాంకులోని వ్యర్థాలను సహాయక సిబ్బంది తొలగించి వెంకటేష్ మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గాం«ధీ ఆస్పత్రికి తరలించారు. వెంకటేష్‌కు భార్య ఉమతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
సెప్టిక్ ట్యాంక్‌లో ట్రాక్టర్ బోల్తా ; కార్మికుడి మృతి
సాక్షి, హైదరాబాద్ : హఫీజ్‌పేట్ డివిజన్లోని జనప్రియనగర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. సెప్టిక్ ట్యాంక్‌లో ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో.. జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికుడు ప్రాణాలు కొల్పోయాడు. మృతున్ని వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన వెంకటేశ్‌గా గుర్తించారు. శుక్రవారం జనప్రియ కాలనీలో ఉన్న సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయడంతో పాటు, పక్కనే ఉన్న మురికి కాలువలోని మట్టిని తొలగించడానికి జీహెచ్ఎంసీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ట్రాక్టర్ అదుపు తప్పి సెప్టిక్ ట్యాంక్‌పైకి రావడంతో ఒక్కసారిగా ట్యాంక్‌పైనున్న సిమెంట్ బిల్లలు పగిలిపోయాయి. దీంతో ట్రాక్టర్ అందులో పడిపోయింది. ట్రాక్టర్లో ఉన్న వెంకటేశ్ సెప్టిక్ ట్యాంక్‌లో పడి గల్లంతయ్యాడు. ఆ కాలనీ మొత్తానికి అదొక్కటే సెప్టిక్ ట్యాంక్ కావడం, 10మీటర్లకు పైగా లోతు ఉండటంతో వెంకటేశ్ ఆచూకీని గుర్తించడం కష్టంగా మారింది. ఘటన స్థలానికి చేరుకున్న జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. ట్యాంక్‌లోని నీటిని మోటర్ పంపుల ద్వారా బయటకు పంపించారు. మూడు గంటలపైగా శ్రమించిన అధికారులు వెంకటేశ్ మృతదేహాన్నిబయటకు తీసి బంధువులకు అప్పగించారు. -
సెప్టిక్ ట్యాంక్‌లో ట్రాక్టర్ బోల్తా
-
విత్తన పంపిణీలో అపశృతి
గంట్యాడ : ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో గురువారం జరిగిన విత్తనాల సరఫరాలో అపశృతి చోటుచేసుకుంది. బందోబస్తుకు వచ్చిన హెచ్‌సీ రామకృష్ణ అనుకోకుండా సెప్టిక్ ట్యాంక్‌లో పడిపోయారు. అయితే ఆ ట్యాంక్ వాడుకలోలేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. పడిపోయిన హెచ్సీని అక్కడే ఉన్న ఎస్సై పి. నారాయణరావు, తదితరులు పైకి లాగి, ప్రథమ చికిత్స కోసం గంట్యాడ పీహెచ్‌సీకి తరలించారు. -
సెప్టిక్ ట్యాంక్‌లో పడ్డ 13 గంటల తర్వాత
-
సెప్టిక్ ట్యాంక్‌లో పడ్డ 13 గంటలకు....
లాస్ ఏంజిల్స్ : అదృష్టం బావుండి సెప్టిక్ ట్యాంక్‌లో పడ్డ 13 గంటల తర్వాత ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. సమన్వయంతో వ్యవహరించిన అధికారులు ఓ మ్యాన్ హోల్ నుంచి అతన్ని సురక్షితంగా బయటకు తీశారు. లాస్ ఏంజిల్స్‌లో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈస్టర్ సందర్భంగా ఆదివారం సాయంత్రం జెస్సె హెర్నాండేజ్(13) కుటుంబం గ్రిఫ్ఫిత్ పార్క్‌లో విహారయాత్రకు వెళ్లారు. జెస్సె తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. అంతలో రిపేర్‌లో ఉన్న ఓ మ్యాన్ హోల్‌పై ఎక్కి ఆడుకుంటుండగా.. దానిపై ఉన్న చెక్క తలుపు విరిగి 25 అడుగుల లోతైన కాలువలో పడి కొట్టుకుపోయాడు. వెంటనే పిల్లలు అక్కడే ఉన్న తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా.. వారు 911 కు ఫోన్ కాల్ చేయటంతో సహయక సిబ్బంది రంగంలోకి దిగారు. ఆ కాలువ కాస్త దూరం వెళ్లాక పైప్ లైన్‌తో అనుసంధానం అయి.. దగ్గర్లోని నదిలో మురుగు నీరు కలిసే ఏర్పాటు ఉంది. దీంతో ఆలస్యం చేయకుండా నీటి గుండా కెమెరాలను పంపి పిల్లాడి కోసం సెర్చ్ఆపరేషన్ చేపట్టారు. సుమారు 12 గంటల తర్వాత పైప్ లైన్‌లోని ఓ చోట పైభాగంలో పిల్లాడి చేతి గుర్తులు కనిపించాయి. దీంతో ఆ గుర్తులు ఉన్న దగ్గర్లోని మ్యాన్ హోల్ వద్దకు మూత తొలగించారు. లోపలి నుంచి ‘సాయం చేయాలంటూ’ కేకలు వినిపించాయి. వెంటనే అధికారులు ఓ పైపును లోపలికి పంపి దాని అతన్ని బయటకు లాగారు. నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో పిల్లాడు సురక్షితంగా బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. ఒకవేళ మరి కొన్ని గంటలు అతను అలానే ఉండి ఉంటే ఆ విష పూరిత వాయువులకు జెస్సె ప్రాణాలు గాల్లో కలిసి ఉండేవని రక్షణ సిబ్బంది వెల్లడించారు. -
నలుగురిని మింగిన సెప్టిక్ ట్యాంకు
నక్కపల్లి (విశాఖ జిల్లా): సెప్టిక్ ట్యాంకులో పడి నలుగురు వ్యక్తులు మృతిచెందిన సంఘటన విశాఖ జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలో చోటుచేసుకుంది. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన కాండ్రకోట అప్పారావు (55), కాండ్రకోట రాజశేఖర్ (28) (తండ్రీ కొడుకులు), కాండ్రకోట కృష్ణ (22), కాండ్రకోట నాగేశ్వరరావు (30) మృత్యువాత పడ్డారు. శనివారం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి..గ్రామానికి చెందిన కాండ్రకోట నూకరాజు, కాండ్రకోట మరిణియ్య, కాండ్రకోట అప్పారావు అన్నదమ్ములు. వీరంతా ఎస్సీ కాలనీలో ఉంటున్నారు. అప్పారావు ఇంటి వద్ద నిర్మించిన సెప్టిక్ ట్యాంకు నిండిపోయింది. అందులోని వ్యర్ధాన్ని కొత్త ట్యాంకులోకి పంపించేందుకు అప్పారావు ట్యాంకులోకి దిగాడు.ఈ ప్రయత్నంలో అతను ఊపిరాడక కుప్పకూలిపోయాడు.అతన్ని కాపాడే యత్నం లో అతని కుమారుడు, వారిని కాపాడేందుకు ట్యాంకులో దిగిన మరో ఇద్దరూ మృత్యువాత పడ్డారు. వీరిలో కొన ఊపిరితో ఉన్న సత్తిబాబును హుటాహుటిన నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. -
మొరం విషాద ఘటనపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి, ఒంగోలు: చిత్తూరు జిల్లా మొరం విషాద ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాడ సానుభూతి తెలిపారు. పలమనేరు మండలం మొరంలో శ్రీ వెంకటేశ్వర హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ (వీహెచ్‌పీఎల్)కు చెందిన సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు వెలువడి ఎనిమిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. సమాచారం తెలుసుకున్న పూతలపట్టు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలకు నివాళులు అర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.20 లక్షలు పరిహారంతో పాటు కోళ్లఫామ్ యజమానిపై కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. కాగా సబ్ కలెక్టర్.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల తక్షణ సాయాన్ని ప్రకటించారు. -
సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ఎనిమిది మంది మృతి
-
చిత్తూరు జిల్లాలో విషాదం
సాక్షి, చిత్తూరు : చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మొరంలో విషాదం చోటుచేసుకుంది. సెఫ్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ అస్వస్థతకు గురైన ఎనిమిది మంది దుర్మరణం చెందారు. కాగా శుక్రవారం ఉదయం వెంకటేశ్వర హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ (వీహెచ్‌పీఎల్)కు చెందిన సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసేందుకు మొత్తం ఎనిమిది మంది వచ్చారు. కాగా ట్యాంక్ నుంచి ఒక్కసారిగా విష వాయువు వెలువడటంతో వీరంతా అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారిలో ఏడుగురు మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వీరంతా మొరం గ్రామ సమీపానికి చెందినవారు. మృతులు రెడ్డప్ప, రమేష్, రామచంద్ర, కేశవ, గోవిందస్వామి, బాబు, వెంకట్రాజు శివగా గుర్తించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. మరోవైపు సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ, ఏఎస్పీతో ఇతర అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తక్షణ సాయం కింద జిల్లా సబ్ కలెక్టర్ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ దుర్ఘటనపై ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
మిస్టరీ వీడింది..
తూర్పుగోదావరి , (పెద్దాపురం): నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన పెద్దాపురం మండలం గుడివాడ గ్రామ వడ్డీ వ్యాపారి పోతంశెట్టి విష్ణు ఈశ్వరులు అలియాస్ వాసుదేవ(50) హత్యకు గురయ్యాడు. గోకవరం మండలం తిరుమలాయపాలెం గ్రామంలో మాంసం వ్యాపారి షేక్ వల్లీకి చెందిన ఇంటి ఆవరణలో సెప్టిక్ ట్యాంక్ కోసం తవ్విన గోతిలో అతడి మృతదేహం లభ్యమైంది. ఈనెల 23న ఫైనాన్స్ సొమ్ము వసూలు నిమిత్తం తిరుమలాయపాలెం వచ్చిన విష్ణు ఈశ్వరులును షేక్ వల్లీ హత్య చేసినట్టు తెలిసింది. నగదు చెల్లిస్తానని చెప్పి ఇంటికి పిలిచిన వల్లీ కత్తితో విష్ణు ఈశ్వరులను తలపై నరికి చంపినట్టు పోలీసులు భావిస్తున్నారు. హత్య అనంతరం మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్ గోతిలో పూడ్చి ఎవరికీ అనుమానం రాకుండా మూత వేశాడు. హత్యకు ఉపయోగించిన కత్తిని నిందితుడి ఇంటి మిద్దెపై, మృతుడి ఫైనాన్స్‌కు సంబంధించిన పుస్తకాన్ని బాత్రూమ్పై పోలీసులు కనుగొన్నారు. మృతదేహాన్ని ఇంట్లోంచి గోతి వరకు ఈడ్చుకెళ్లిన రక్తపు మరకలు, గోడపై ఉన్న రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు. ఉదయం నుంచి ఇంటి ఆవరణలో ఉన్న సెప్టిక్ ట్యాంక్ గోతిలోంచి దుర్వాసన వెదజల్లడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్సై జి.ఉమామహేశ్వరరావు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అలాగే సమాచారం అందుకున్న పెద్దాపురం సీఐ వీరయ్యగౌడ్ సైతం సిబ్బందితో అక్కడకు చేరుకుని సెప్టిక్ ట్యాంక్‌లో ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం కోరుకొండ సీఐ రవికుమార్ సంఘటన స్థలానికి చేరుకుని ఎస్సైను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు, గుడివాడకు చెందిన అధిక సంఖ్యలో గ్రామస్తులు సైతం అక్కడికి చేరుకుని తీవ్రంగా విలపించారు. సంఘటన వార్త గ్రామంలో వ్యాపించడంతో భారీ ఎత్తున జనం అక్కడ గుమిగూడారు. ఇదిలా ఉండగా సంఘటనపై ఎవరు కేసు నమోదు చేయాలనే అంశంపై ఇటు గోకవరం, అటు పెద్దాపురం పోలీసుల తర్జనభర్జన పడ్డారు. దీంతో రాత్రయినా శవాన్ని బయటకు తీయలేకపోయారు. మృతదేహం బాగా కుళ్లిపోయి ఉండటం, రాత్రి సమయం కావడంతో బయటకు తీయడానికి గ్రామస్తులు వెనుకంజ వేశారు. దీంతో శనివారం ఉదయం మృతదేహాన్ని బయటకు తీసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. హత్యకు కేవలం నగదు లావాదేవీలేనా లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనపై స్థానికులు సైతం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతుడి బైక్ జగ్గంపేట మండలం రాజపూడి శివారున పుష్కర కాలువ గట్టు వద్ద లభించడంతో నిందితుడు షేక్ వల్లీ ఒక్కడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా? లేక ఇంకా ఎవరైనా ఉన్నారా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి అనుమానమే నిజమైంది విష్ణు ఈశ్వరులు అదృశ్యమైనప్పటి నుంచి కుటుంబ సభ్యులు తిరుమలాపాలెంలో ఓ వ్యక్తి మధ్య ఘర్షణ జరిగిందని, ఆ వ్యక్తే హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పలుమార్లు కుటుంబ సభ్యులు, ఆ గ్రామస్తులు తిరుమలాయపాలెం వచ్చి షేక్ వల్లీ ఇంటి చుట్టూ గాలించారు. శుక్రవారం ఇంటి ఆవరణ నుంచి దుర్వాసన వెలువడడంతో ఈ ఘాతుకం బయటపడింది. -
క్షణాల్లోనే ప్రాణాలు పోయాయి
బొమ్మనహళ్లి : మురికి నీటి ట్యాంక్ శుభ్రం చేయడానికి దిగిన ముగ్గురు వ్యక్తులు ఊపిరి అందక మృతి చెందిన సంఘటన బొమ్మనహళ్లి హెచ్ఎస్ఆర్ లేఔట్ సామసంద్ర పాళ్యలో ఉన్న ఎన్.డి. సెఫల్ అపార్టుమెంటులో ఆదివారం చో టు చేసుకుంది. మృతులు తుమకూరు జిల్లా గుబ్బి తాలూకా నాగసంద్ర గ్రా మానికి చెందిన మాదేగౌడ (45), కోలా రు జిల్లా శ్రీనివాసపుర తాలూకా యగువపాపిశెట్టిపల్లి గ్రామానికి చెందిన నారాయణ స్వామి (38), సామసంద్రపాళ్యకు చెందిన పేయింటర్ శ్రీనివాస్ (52)గా గుర్తించారు. వీరు ఇక్కడి సామసంద్రపాళ్యలో నివాసం ఉంటున్నారు. అసలు విషయానికి వస్తే వీరికి మురికి ట్యాంకులు శుభ్రం చేయడం తెలియదు. మాదేగౌడ గార్మెంట్స్‌లో ఉద్యోగి కాగా, నారాయణ స్వామి ఎలక్ట్రీషియన్, శ్రీనివాస్ పెయింటర్. ఆదివారం సెలవు కావడంతో ఇక్కడి ఎన్డీ సెఫల్ అపార్టుమెంట్లో మురికినీటి ట్యాంక్‌ను శుభ్రం చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. ఉదయం ముగ్గురు మురికి నీటి ట్యాంకులోకి దిగారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో వీరికి అనుభవం లేకపోవడంతో వీరు ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో అపార్టుమెంట్ నిర్వాహకులు విషయం గుర్తించి పోలీసులకు, అగ్నిమాపక దళానికి సమా చారం ఇచ్చారు. వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని వారిని సెయింట్‌జాన్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సతీష్‌రెడ్డి, కార్పొరేటర్లు గురుమూర్తి, శోభా స్థానిక నాయకులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. ఇదే సమయంలో మంత్రి జార్జ్‌తో పాటు మేయర్ సంపత్ రాజ్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతుల కుటుంబాలకు తలా రూ. 5 లక్షలు ఇస్తున్నట్లు మేయర్ ప్రకటించారు. పోలీస్ కమిషనర్ సునీల్ కుమార్ కూడా ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. ఇదిలా ఉంటే మార్చురీ వద్ద సామసంద్రపాళ్య గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. బాధ్యులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
భర్తను చంపి సెప్టిక్ ట్యాంక్‌లో దాచిన మహిళ