![Man chops wife body, dumps pieces in septic tank - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/23/Man%20chops%20wife.jpg.webp?itok=MJzqwzV6)
సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీ, రోహిణి జిల్లాలోని ప్రేమ్ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో భార్యను చంపి ముక్కలు ముక్కలుగా నరికి సెప్టింక్ ట్యాంక్‌లో పడవేసిన ఘటన కలకలం రేపింది.
పోలీసు ఉన్నతాధికారి డిప్యూటీ పోలీస్ కమిషనర్ రోహిణి మిశ్రా అందించిన సమాచారం ప్రకారం.టీవీ మెకానిక్‌గా పనిచేస్తున్న అషు(37) వివాహేతర సంబంధం అనుమానంతో భార్య సీమ(30) ను దారుణంగా హత‍్యచేశాడు. గత ఆరు నెలల నుంచి భార్యతో తరుచూ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం మరోసారి భార్యతో ఘర్షణకు దిగాడు అషు. అనంతరం ఆమెను హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికి సెప్టింక్ ట్యాంకులో పడేశాడు. మొండెం, అవయవాలు, తలను వేరు చేసి వాటిని కనీసం ఆరు ముక్కలుగా కోసి, కొన్ని ముక్కలను ఇంటి వద్ద ఉన్న సెప్టిక్ ట్యాంకులో పడేశాడు. మొండెంను ఒక సంచిలో నింపి, రెండు కిలోమీటర్లకు పైగా దూరం తీసుకెళ్లి మరీ కాలువలో పడవేసాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడని డీసీపీ మిశ్రా తెలిపారు. నిందితుని సమాచారం ఆధారంగా మృతదేహం భాగాలను స్వాధీనం చేసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
అయితే తన కుమార్తెను అదనపు కట్నం కోసం హింసించేవాడని, ముగ్గురు ఆడపిల్లలు పుట్టడంతో, కొడుకు కోసం మరింత వేధించేవాడని మృతురాలి తల్లిదండ్రులు, సోదరుడు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment