చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మొరంలో విషాదం చోటుచేసుకుంది. సెఫ్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ అస్వస్థతకు గురైన ఎనిమిది మంది దుర్మరణం చెందారు. కాగా శుక్రవారం ఉదయం ఓ శ్రీ వెంకటేశ్వర హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ (వీహెచ్‌పీఎల్)కు చెందిన సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసేందుకు మొత్తం ఎనిమిది మంది వచ్చారు. కాగా ట్యాంక్ నుంచి ఒక్కసారిగా విష వాయువు వెలువడటంతో ఎనిమిదిమంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.