కోసిగి: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో రూ. 46.41కోట్లతో 714 అదనపు గదుల నిర్మాణం చేపట్టనున్నట్లుసర్వశిక్ష అభియాన్ పీడీ మురళీధర్‌రావు తెలిపారు.స్థానిక కస్తూర్బా పాఠశాలను గురువారం ఆయనతనిఖీ చేశారు. పాఠశాల విద్యార్థినులు బహిర్భూమికిబయటకు వెళ్లడంపై అసహనం వ్యక్తం చేశారు.గతంలో పాఠశాలకు చెందిన స్పెప్టిక్ ట్యాంక్‌నుకోసిగి గ్రామానికి చెందిన మల్లయ్య అనే వ్యక్తి స్థలంనాదంటూ ముందస్తు సమాచారం ఇవ్వకుండాధ్వంసం చేయడంపై ఆయన మండిపడ్డారు.
విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి మల్లయ్యపై క్రిమినల్‌కేసు నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే పాఠశాల నిర్మాణం కోసం పాలకుర్తితిక్కారెడ్డి ఇచ్చిన ఎకరా స్థలానికి హద్దులు వేసిచూపించాలని తహాశీల్దార్‌కు ఆదేశించారు. అలాగేజిల్లాలోని ఎనిమిది కస్తూర్బా పాఠశాలలకు సంబంధించి కాంపౌండ్‌వాల్ పెండింగ్‌లో ఉన్నాయన్నారు.విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని ప్రిన్సిపాల్ ఆంజనేయులును హెచ్చరించారు. ఆయనవెంట ఎస్‌ఎస్‌ఏ డీఈ గుప్తా, ప్లానింగ్ అధికారిమారుతి, తహాశీల్దార్ ఉమామహేశ్వరి, సీఆర్పీలుఉన్నారు.
రూ. 41.41కోట్లతో అదనపు గదుల నిర్మాణం
Published Fri, Aug 8 2014 12:40 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM
Advertisement
Advertisement