
సాక్షి, ఒంగోలు: చిత్తూరు జిల్లా మొరం విషాద ఘటనపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాడ సానుభూతి తెలిపారు. పలమనేరు మండలం మొరంలో శ్రీ వెంకటేశ్వర హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ (వీహెచ్‌పీఎల్)కు చెందిన సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు వెలువడి ఎనిమిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
సమాచారం తెలుసుకున్న పూతలపట్టు వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలకు నివాళులు అర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.20 లక్షలు పరిహారంతో పాటు కోళ్లఫామ్ యజమానిపై కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. కాగా సబ్ కలెక్టర్.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల తక్షణ సాయాన్ని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment