
నక్కపల్లి (విశాఖ జిల్లా): సెప్టిక్ ట్యాంకులో పడి నలుగురు వ్యక్తులు మృతిచెందిన సంఘటన విశాఖ జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలో చోటుచేసుకుంది. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన కాండ్రకోట అప్పారావు (55), కాండ్రకోట రాజశేఖర్ (28) (తండ్రీ కొడుకులు), కాండ్రకోట కృష్ణ (22), కాండ్రకోట నాగేశ్వరరావు (30) మృత్యువాత పడ్డారు. శనివారం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి..గ్రామానికి చెందిన కాండ్రకోట నూకరాజు, కాండ్రకోట మరిణియ్య, కాండ్రకోట అప్పారావు అన్నదమ్ములు. వీరంతా ఎస్సీ కాలనీలో ఉంటున్నారు.
అప్పారావు ఇంటి వద్ద నిర్మించిన సెప్టిక్ ట్యాంకు నిండిపోయింది. అందులోని వ్యర్ధాన్ని కొత్త ట్యాంకులోకి పంపించేందుకు అప్పారావు ట్యాంకులోకి దిగాడు.ఈ ప్రయత్నంలో అతను ఊపిరాడక కుప్పకూలిపోయాడు.అతన్ని కాపాడే యత్నం లో అతని కుమారుడు, వారిని కాపాడేందుకు ట్యాంకులో దిగిన మరో ఇద్దరూ మృత్యువాత పడ్డారు. వీరిలో కొన ఊపిరితో ఉన్న సత్తిబాబును హుటాహుటిన నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment