four Killed
-
అమెరికాలో కాల్పులు.. నలుగురు మృతి
ఫ్లోరెన్స్: అమెరికాలో కెంటకీ రాష్ట్రం ఫ్లోరెన్స్‌లోని ఓ ఇంట్లో బర్త్ డే పార్టీ సందర్భంగా జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు చనిపోగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం వేకువజామున ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పులకు కారకుడిగా భావిస్తున్న యువకుడిని పోలీసులు వెంటాడారు. ఛేజింగ్ సమయంలో అతడు కారు సహా లోయలో పడిపోయాడని పోలీసులు తెలిపారు. అతడు తనను తాను కాల్చుకున్నాడని, గాయాలతో ఆస్పత్రిలో మృతి చెందాడని చెప్పారు. ఘటనకు కారణాలు తెలియాల్సి ఉందన్నారు. -
అమెరికా బార్లో కాల్పులు
కాన్సస్: అమెరికాలోని కాన్సస్ పట్టణంలోని టెక్విలా కేసీ బార్లో కాల్పుల కలకలం చెలరేగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో అయిదుగురు గాయపడ్డారు. పాత కక్షలతోనే కాల్పులు జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాల్పులకు పాల్పడిన ఇద్దరు వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాల్పులకు ముందు నిందితులు ఇద్దరూ బార్లోనే ఉన్నారు. అయితే నిందితులకు, లోపల ఉన్న వారికి ఏవో భేదాభిప్రాయాలు రావడంతో ఈ ఇద్దరూ బయటకు వెళ్లి, రాత్రి 1.30 గంటలకు తుపాకులతో లోపలికి వచ్చారు. అనంతరం బార్లో ఉన్న వారిపై కాల్పులు జరపడం ప్రారంభించారని పోలీస్ అధికార ప్రతినిధి థామస్ తెలిపారు. కాల్పులు జరిగిన సమయంలో బార్లో 40 మంది వరకూ ఉన్నారని వెల్లడించారు. కాల్పులు ప్రారంభం కాగానే లోపల ఉన్నవారంతా వివిధ మార్గాల గుండా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారని తెలిపారు. కాల్పుల వెనుక జాత్యహంకార విద్వేషం ఉన్నట్లు తాము భావించడం లేదని పోలీసులు తెలిపారు. -
నలుగురిని మింగిన సెప్టిక్ ట్యాంకు
నక్కపల్లి (విశాఖ జిల్లా): సెప్టిక్ ట్యాంకులో పడి నలుగురు వ్యక్తులు మృతిచెందిన సంఘటన విశాఖ జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలో చోటుచేసుకుంది. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన కాండ్రకోట అప్పారావు (55), కాండ్రకోట రాజశేఖర్ (28) (తండ్రీ కొడుకులు), కాండ్రకోట కృష్ణ (22), కాండ్రకోట నాగేశ్వరరావు (30) మృత్యువాత పడ్డారు. శనివారం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి..గ్రామానికి చెందిన కాండ్రకోట నూకరాజు, కాండ్రకోట మరిణియ్య, కాండ్రకోట అప్పారావు అన్నదమ్ములు. వీరంతా ఎస్సీ కాలనీలో ఉంటున్నారు. అప్పారావు ఇంటి వద్ద నిర్మించిన సెప్టిక్ ట్యాంకు నిండిపోయింది. అందులోని వ్యర్ధాన్ని కొత్త ట్యాంకులోకి పంపించేందుకు అప్పారావు ట్యాంకులోకి దిగాడు.ఈ ప్రయత్నంలో అతను ఊపిరాడక కుప్పకూలిపోయాడు.అతన్ని కాపాడే యత్నం లో అతని కుమారుడు, వారిని కాపాడేందుకు ట్యాంకులో దిగిన మరో ఇద్దరూ మృత్యువాత పడ్డారు. వీరిలో కొన ఊపిరితో ఉన్న సత్తిబాబును హుటాహుటిన నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. -
లారీ-మినీ లారీ ఢీ: నలుగురు మృతి
శ్రీవిల్లిపుత్తూరు: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీవిల్లిపుత్తూరు సమీపంలో లారీ-మినీ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మరో ఇద్దరరు తీవ్రంగా గాయపడగా వారి పరిస్థితి విషమంగా ఉంది. -
తమిళనాడులో జల్లికట్టుకు నలుగురి బలి
సాక్షి ప్రతినిధి, చెన్నై/చంద్రగిరి: సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో నిర్వహించిన జల్లికట్టు కార్యక్రమంలో గత మూడు రోజుల్లో నలుగురు మరణించారు. 15వ తేదీ పాలమేడులో జల్లికట్టు సందర్భంగా ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చున్న యువకుడు ఎద్దు పొడవడంతో మృతిచెందాడు. తిరుచిరాపల్లి మనకోట్టైలో మంగళవారం జరిగిన జల్లికట్టులో ఎద్దు పొడవడంతో ఒక వ్యక్త చనిపోయాడు. శివగంగై జిల్లా శిరవయల్‌లో మంగళవారం మంజువిరాట్ పోటీల సందర్భంగా ఎద్దులను వదలగా అవి ప్రేక్షకుల్లోకి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా 50 మంది గాయపడ్డారు. కాగా,మదురై జిల్లా అలంగనల్లూరులో క్రీడా పోటీలను సీఎం పళనిస్వామి ప్రారంభించారు. విజేతలకు కారు, బంగారు నాణేలు తదితర రూ.కోటి విలువైన ఆకర్షణీయ బహుమతులు ప్రకటించారు. -
ఆటోను ఢీకొట్టిన లారీ... నలుగురి దుర్మరణం
సాక్షి, భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పండుగపూట ఘోరం జరిగింది. ఆదివారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. టేకులపల్లి మండలం బేతలపూడిలో ఆగివున్న ఆటోను వేగంగా వచ్చిన ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగినపుడు ఆటోలో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. ఆటో పైనుంచి లారీ దూసుకుపోవడంతో ఆటో నుజ్జునుజ్జు అయింది. ప్రమాదాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చెరువులోకి దూసుకెళ్లిన జీపు, నలుగురు మృతి
జైపూర్ : జీపు చెరువులో పడి నలుగురు మృతిచెందిన సంఘటన రాజస్థాన్‌లోని భరత్పూర్ జిల్లాలో జరిగింది. ఈ ఘోర ప్రమాదం తెల్లవారుజాము దాటిన తర్వాత జరిగింది. మధుర నుంచి అల్వార్‌కు తిరిగి వెళ్తుండగా డ్రైవర్ జీపుపై అదుపు కోల్పోవడంతో చెరువులోకి పడిపోయింది. ఈ సంఘటనలో ఇంద్ర జైన్(38), పవన్ జైన్(40), అతని భార్య మనీషా(38), వారి ఏడేళ్ల వయసున్న కుమార్తె ప్యారి చనిపోయారు. మరో ఐదుగురు గాయపడగా చికిత్స పొందుతున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబీకులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. -
పెళ్లింట చావుడప్పు
అల్గునూర్/రామగుండం/కోల్‌సిటీ: పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో ఓ ప్రమాదం చావు డప్పు మోగించింది.పెళ్లి సందడితో కళకళలాడాల్సిన ఆ ఇంట్లో రోదనలు మిన్నంటాయి. శుభలేఖలు పంచడానికి వెళ్లిన తల్లిదండ్రులు, పెళ్లి పనుల్లో సాయపడ్డానికి వారి వెంట వస్తున్న పెళ్లికొడుకు పెద్దనాన్న, పెద్దమ్మ శవాలై ఇంటికి రావడంతో పెళ్లింట ఆనందం ఆవిరైంది. సంతోషం... సంతాపంగా మారింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం కుందనపల్లి గ్రామంలోని రాజీవ్ స్వగృహ కాలనీలో విషాదం నింపింది. రామగుండం మండలం ఇంధన నిల్వల కేంద్రం సమీపంలోని రాజీవ్ స్వగృహలో నివాసముంటున్న కాంబ్లె సరితాబాయి(55)–రవీందర్రావు(58) దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సంతానం. చాలా ఏళ్ల క్రితమే వీరి కుటుంబం మహారాష్ట్రలోని లాతూర్ నుంచి రామగుండం వచ్చి స్థిరపడింది. రవీందర్రావు వెల్డింగ్ వర్క్‌షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పెద్ద కూతురు పెళ్లి చేశారు. ఇటీవలే పెద్దకుమారుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్ రితీష్ పెళ్లి నిశ్చయించారు. ఈనెల 29న ముహూర్తం పెట్టుకున్నారు. ఈమేరకు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త బట్టలు కొన్నారు. పెళ్లికార్డులు అచ్చువేయించారు. బంధువులను పెళ్లికి ఆహ్వానించేందుకు నాలుగు రోజుల క్రితం సరితాబాయి–రవీందర్రావు దంపతులు సొంత కారులో ఇటీవలే మహారాష్ట్రలోని లాతూర్ వెళ్లారు. అక్కడ బంధువులందరికీ పెళ్లి కార్డులు ఇచ్చి పెళ్లికి ఆహ్వానించారు. అక్కడే ఉంటున్న సరితాబాయి సోదరి మీరాబాయి(60), ఆమె భర్త రఘునాథ్(70)ను తీసుకుని తమ కులదైవమైన షోలాపూర్‌లోని తుల్జామాత ఆలయానికి వెళ్లారు. ఆక్కడ వీరి కుమారుడి పెళ్లి కార్డు ఉంచి పూజలు చేశారు. అనంతరం హైదరాబాద్‌కు వచ్చారు. అక్కడి బంధువులకు కూడా పెళ్లి కార్డు ఇచ్చి బేగంపేటలో కొడుకు రితేష్ నివాసముండే ఫ్లాట్‌కు వెళ్లారు. అక్కడ అందరూ కలిసి భోజనం చేశారు. మిగతా పెళ్లి ఏర్పాట్ల గురించి చర్చించుకున్నారు. రాత్రి 8:30 గంటలకు రామగుండం బయల్దేరారు. మృత్యువైన ఆగి ఉన్న లారీ.. కారులో ఉన్న సరితాబాయి, మీరాబాయి, రఘునాథ్ అప్పటికే నిద్రలోకి చారుకున్నారు. రవీందర్ కారు డ్రైవ్ చేస్తున్నాడు. తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్గేట్ దాటిన సుమారు 20 నిమిషాల్లో కారు అల్గునూర్ శివారులోని ఎస్సారెస్పీ కెనాల్ దాటింది. రవీందర్ కూడా మెల్లగా నిద్రమత్తులోకి జారుకోవడంతో రెండు నిమిషాల్లో (2:40 గంటలకు) కారు అదుపుతప్పి భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో నిలిపి ఉన్న కేరళ రాష్ట్రానికి చెందిన లారీని వేగంగా ఢీకొట్టింది. పెద్ద శబ్దం రావడంతో బంకు సిబ్బంది హుటాహుటిన అక్కడి చేరుకుని పరిశీలించగా ముగ్గురు రక్తపు మడుగులో విఘత జీవులుకాగా, రఘునాథ్ కొనఊపిరితో ఉన్నాడు. వెంటనేఎల్ఎండీ పోలీసులకు, 108కు సమాచారం అందించారు. హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై కృష్ణారెడ్డి స్థానికుల సహాయంతో కొన ఊపరితో ఉన్న రఘునాథ్‌ను బయటకు తీసి అప్పటికే సిద్ధంగా ఉన్న 108లో కరీంనగర్‌కు తరలించారు. ఆస్పత్రికి చేరుకునేసరికి రఘునాథ్ మృతిచెందాడు. రెండు గంటల్లో గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉండగా మృత్యుఒడిలోకి చేరుకున్నారు. పెద్దదిక్కును కోల్పోయారు... తిమ్మాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రవీందర్రావు–సరితాబాయి, రఘునాథ్–మీరాబాయి దంపతులు మరణించడంతో ఈ రెండు కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయాయి. మంగళవారం రాత్రి రామగుండం పంప్‌హౌస్ వద్ద రవీందర్రావు–సరితాబాయి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. రఘునాథ్, మీరాబాయి మృతదేహాలను ప్రత్యేక వాహనంలో లాతూర్కు తరలించారు. ఆ యువకుడు డ్రైవింగ్ చేస్తే బతికేవారేమో... రామగుండం రాజీవ్ స్వగృహలోనే నివాసముంటూ రవీందర్‌రావుకు పరిచయమైన రంజిత్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటలకు తన స్నేహితుడి కారులో సిద్దిపేట దాబాల వరకు వచ్చాడు. అక్కడి నుంచి తిరిగి బస్సులో రామగుండంకు వచ్చేందుకు చూస్తుండగా... రవీందర్రావు కారు కనిపించింది. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా అందరూ నిద్రపోతున్నారు. రంజిత్ రవీందర్రావును లేపి ‘అంకుల్ మీకు నిద్ర వస్తున్నట్టుగా ఉంది.. నేను డ్రైవింగ్ చేస్తాను..’ అని చెప్పాడు. రవీందర్రావు అందుకు ‘వద్దు, నేను చాలా కాలంగా కార్లు నడిపిస్తున్నాను, నేనే డ్రైవింగ్ చేస్తా’ అని చెప్పడంతో, రంజిత్ అక్కడి నుంచి బస్సులో వచ్చాడు. కొంతసేపటికే తిమ్మాపూర్ వద్ద జరిగిన ప్రమాదంలో రవీందర్రావు కుటుంబం మృత్యు ఒడిలోకి చేరింది. ఒకవేళ రంజిత్ ఆ కారును నడిపి ఉంటే నలుగురు బతికేవారేమోనని బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన రూరల్ ఏసీపీ, ఎమ్మెల్యే.. ప్రమాద సమాచారం అందుకున్న కరీంనగర్ రూరల్ ఏసీపీ ఉషారాణి, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఉదయం సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. తక్షణం స్పందించి సహాయ చర్యలు చేపట్టిన స్థానికులను, ఎల్ఎండీ ఎస్సై కృష్ణారెడ్డి, పోలీస్ సిబ్బందిని వారు అభినందించారు. మిన్నంటిన రోదనలు.. కారులోని పెళ్లికార్డులపై ఉన్న ఫోన్ నంబర్ల ఆధారంగా రితీష్‌కు పోలీసులు సమాచారం అందించడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నాడు. వద్దని వారించినా వినకుండా ఇంటికి బయల్దేరి తెల్లవారే సరికి విఘతజీవులైన తల్లిదండ్రులు, బంధువులను చూసి గుండెంలు బాదుకుంటూ రోదించాడు. వారం రోజుల్లో పెళ్లిపీటలెక్కాల్సిన రితీష్ రోదన చూసి స్థానికులు, బంధువులు కంటతడిపెట్టారు. కరీంనగర్ ప్రభుత్వాస్పత్రిలోనూ బంధువుల రోదనలు మిన్నంటాయి. లాతూర్‌లో రఘునాథరావు కుటుంబం... మహారాష్ట్ర లాతూర్‌లో రఘునాథరావు– మీరాబాయి దంపతులు ఉంటున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. పిల్లలకు పెళ్లి చేశారు. కుమారుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మీరాబాయి, సరితాబాయి నలుగురు అక్కాచెల్లెళ్లు. రోడ్డు ప్రమాదంలో మీరాబాయి, సరితాబాయి మృతిచెందగా మిగిలిన ఇద్దరు చెల్లెల్లు అక్కల మృతదేహాలపై రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. పరామర్శించిన మంత్రి ఈటల.. ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి ప్రమాదం జరిగిన తీరుపై పోలీసులను అడిగి తెలుసుకున్నారు. రితేష్, బంధువులను ఓదార్చారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. -
బిహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం
పాట్నా: బిహార్ లో విషాదం చోటు చేసుకుంది. మధుబని నుంచి సీతామండికి వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు ప్రమాదవశాత్తు చెరువులోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 12 మంది ఆచూకీ లభించలేదు. పాట్నాకు 50 కి.మీ దూరంలో ఉన్న మధుబని జిల్లా బానపట్టి బసాకా చౌక్ లో సోమవారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 65 మంది ప్రయాణికులు ఉన్నారని, గల్లంత అయిన వారికోసం ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఈ ఘటన పట్ల బిహార్ సీఎం నితీష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.