సాక్షి, భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పండుగపూట ఘోరం జరిగింది. ఆదివారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. టేకులపల్లి మండలం బేతలపూడిలో ఆగివున్న ఆటోను వేగంగా వచ్చిన ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగినపుడు ఆటోలో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. ఆటో పైనుంచి లారీ దూసుకుపోవడంతో ఆటో నుజ్జునుజ్జు అయింది.
ప్రమాదాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment