బిహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం
పాట్నా: బిహార్ లో విషాదం చోటు చేసుకుంది. మధుబని నుంచి సీతామండికి వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు ప్రమాదవశాత్తు చెరువులోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 12 మంది ఆచూకీ లభించలేదు. పాట్నాకు 50 కి.మీ దూరంలో ఉన్న మధుబని జిల్లా బానపట్టి బసాకా చౌక్ లో సోమవారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 65 మంది ప్రయాణికులు ఉన్నారని, గల్లంత అయిన వారికోసం ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఈ ఘటన పట్ల బిహార్ సీఎం నితీష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.