జైపూర్ : జీపు చెరువులో పడి నలుగురు మృతిచెందిన సంఘటన రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో జరిగింది. ఈ ఘోర ప్రమాదం తెల్లవారుజాము దాటిన తర్వాత జరిగింది. మధుర నుంచి అల్వార్‌కు తిరిగి వెళ్తుండగా డ్రైవర్ జీపుపై అదుపు కోల్పోవడంతో చెరువులోకి పడిపోయింది. ఈ సంఘటనలో ఇంద్ర జైన్(38), పవన్ జైన్(40), అతని భార్య మనీషా(38), వారి ఏడేళ్ల వయసున్న కుమార్తె ప్యారి చనిపోయారు. మరో ఐదుగురు గాయపడగా చికిత్స పొందుతున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబీకులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment