త్వరలో బయో టాయిలెట్లు!
త్వరలో బయో టాయిలెట్లు!
Published Wed, Jun 25 2014 2:28 AM | Last Updated on Sat, Sep 2 2017 9:20 AM
విజయనగరం క్రైం: గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో జిల్లాలో బయో టాయిలెట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. జిల్లాలో ప్రస్తుతం 1,68,000 వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్నప్పటికి చాలావరకు వినియోగానికి నోచుకోవడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేమి, స్థలాభావం తదితర కారణాలతో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించడం లేదు. ఈ నేపథ్యంలో తక్కువ నీటి అవసరం ఉండే బయో టాయిలెట్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు రైల్వేస్టేషన్‌లో ఈ మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. వీటిని గ్రామాల్లో కూడా వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం యోచిస్తోందని గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్‌ఈ ఎన్.మెహర్‌ప్రసాద్ తెలిపారు. బయో టాయిలెట్ ఏర్పాటుకు కనీసం పదివేల రూపాయల అవసరం ఉంటుంది. సెప్టిక్ ట్యాంకుల అవసరం లేకుండానే బయో టాయిలెట్‌ను ఏర్పాటు చేస్తారు. స్థలం కూడా కొద్దిగా ఉంటే సరిపోతుంది. నీటి అవసరం ఎక్కువగా ఉండదు. బ్యాక్టీరియా ప్రభావంతో మరుగు ఎక్కువ సేపు ఉండదు. దీంతో నీటి వినియోగమూ తక్కువగా ఉంటుంది.
Advertisement