గ్రామాల్లో అక్టోబరు 2నుంచి మినరల్ వాటర్
విజయనగరం క్రైం: జిల్లా ప్రజలకు అక్టోబరు 2 నుంచి చౌకగా మినరల్ వాటర్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు గ్రామీణ నీటి సరఫరా విభాగం సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎన్.మెహర్ప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామీణ నీటి సరఫరా పర్యవేక్షక ఇంజినీరు, కాలుష్య నియంత్రణ మండలి, ఎన్విరాన్మెంట్ ఇంజినీరు, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్లు, పారిశ్రామికవేత్తలతో ఆయన గురువారం సమావేశమయ్యూరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబరు 2న సుజల స్రవంతి పథకాన్ని ప్రారంభించాలన్న ఆశయంతో పారిశ్రామికవేత్తలతో జరిపిన సమావేశంలో పలు సంస్థలు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొచ్చాయన్నారు. మెుదటి దశలో 200 గ్రామాల్లో నీటిశుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేసి మినరల్ వాటర్ అందించేందుకు సహకరించాలని కోరారు. అందులో అవసరమైన వాటర్ రిసోర్సు అందిస్తామని తెలిపారు.
నీటి బోరుతో పాటు షెడ్, విద్యుత్ సరఫరా కల్పిస్తామన్నారు. పాఠశాలలు, పంచాయతీ కార్యాలయ భవనాలు, ఇతర ప్రభుత్వ సంస్థల భవనాల్లో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు స్థలాలు గుర్తిస్తామన్నారు. ఈ సందర్భంగా పరిశ్రమల ప్రతినిధులు యూజమాన్యాలతో సంప్రదించి ప్లాంట్లు ఏర్పాటుకు సహకరిస్తామని చెప్పారు. మరి కొంత మంది ప్రతినిధులు ప్లాంట్ల ఏర్పాటుకు అంగీకారం తెలిపారన్నారు. త్వరలో ఏర్పాటు చేయనున్న సమావేశానికి పూర్తి స్థాయి హామీ, ప్రతిపాదనలతో హాజరు కావాలని పీసీబీ ఈఈ కోరారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎన్.మెహర్ప్రసాద్, పీసీబీ ఈఈ ఆర్.లక్ష్మీనారాయణ, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ కోటీశ్వరరావు, 21 పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.