సెప్టిక్ ట్యాంక్లో పడి బాలుడు మృతి | 6 Year Old boy Dies In Septic Tank at LB Nagar | Sakshi
Sakshi News home page

సెప్టిక్ ట్యాంక్లో పడి బాలుడు మృతి

Published Sat, Nov 9 2013 2:37 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

6 Year Old boy Dies In Septic Tank at LB Nagar

హైదరాబాద్ : హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో విషాదం జరిగింది. తెరిచివున్న సెఫ్టిక్‌ ట్యాంక్‌లో పడి ఓ బాలుడు శనివారం మృతి చెందాడు. హుడా కాంప్లెక్స్‌ ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేసిన సెప్టిక్‌ ట్యాంక్‌ ఎవరు వాడకపోవటంతో పాడుబడిపోయింది. ఆడుకుంటూ వెళ్లిన ప్రేమ్‌ అనే ఆరేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు.

బాలుడు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. సెప్టిక్‌ ట్యాంక్‌పై మూత ఏర్పాటు చేయాలని మున్సిపల్‌ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. వారి నిర్లక్ష్యం కారణంగానే ప్రేమ్‌ ప్రాణాలు కోల్పోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement