సెప్టిక్ ట్యాంక్ గుంత తవ్వుతూ.. | 2 killed due to septic tank works in east godavari | Sakshi
Sakshi News home page

సెప్టిక్ ట్యాంక్ గుంత తవ్వుతూ..

Published Sat, Jun 18 2016 2:24 PM | Last Updated on Tue, Oct 30 2018 7:30 PM

2 killed due to septic tank works in east godavari

కడియం: సెప్టిక్‌ట్యాంకు తవ్వేందుకు దిగిన ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం మేకలదిబ్బ గ్రామంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఓ ఇంట్లో సెప్టిక్ ట్యాంకు తవ్వకం చేపట్టారు. రౌతు సూరిబాబు(35), వెల్లంకి పోలినాయుడు(30)అనే ఇద్దరు లోపలికి దిగి తవ్వుతుండగా, మరో నలుగురు ఒడ్డున ఉండి మట్టిని పైకి తీస్తున్నారు. మధ్యాహ్నం లోపలున్న ఇద్దరు వ్యక్తులు బయటకు వచ్చేందుకు తాడు ద్వారా ప్రయత్నించగా, ఒక్కసారిగా మట్టిపెళ్లలు విరిగి పడ్డాయి. స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మట్టిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement