వేగంగా సెప్టిక్‌ ట్యాంకుల నిర్మాణాలు | septic tank structures are constructing fast | Sakshi
Sakshi News home page

వేగంగా సెప్టిక్‌ ట్యాంకుల నిర్మాణాలు

Published Tue, Jan 10 2017 11:01 PM | Last Updated on Tue, Sep 5 2017 12:55 AM

వేగంగా సెప్టిక్‌ ట్యాంకుల నిర్మాణాలు

వేగంగా సెప్టిక్‌ ట్యాంకుల నిర్మాణాలు

► జనవరి 25లోగా పూర్తి చేయాలి
►మున్సిపల్‌ చైర్‌పర్సన్  సామల పావని


సిరిసిల్ల : ఇంటింటికీ సెప్టిక్‌ ట్యాంకు నిర్మాణాలు వేగంగా నిర్మిస్తున్నారని, ఇదే స్ఫూర్తిని అందరూ కొనసాగించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్ సామ ల పావని అన్నారు. గాంధీనగర్‌లో సోమవారం ఇంటింటికీ పర్యటించారు. జనవరి 25వ తేదీ లోగా సెప్టిక్‌ ట్యాంకులను అందరూ నిర్మించుకొని, వంద శాతం నిర్మాణాలు పూర్తి చేసి ఆద ర్శ పట్టణంగా మార్చాలని కోరారు. సెప్టిక్‌ ట్యా ంకు కట్టుకున్న వారికి మున్సిపల్‌ ద్వారా రూ. ఏడు వేలు అందిస్తామని అన్నారు. మురుగుకాలువలకు టాయిలెట్‌ పైపులను కలుపడం మూ లంగా పారిశుధ్య సమస్యలు ఎదురవుతున్నాయని మున్సిపల్‌ కమిషనర్‌ సుమన్ రావు అన్నా రు.

అందరూ భాగస్వాములై సెప్టిక్‌ ట్యాంకులను కట్టుకోవాలని కమిషనర్‌ కోరారు. వారి వెంట మున్సిపల్‌ ఏఈ రవికుమార్, శానిటరీ ఇన్ స్పెక్టర్‌ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement