Suman Rao
-
బ్యూటిఫుల్ ఇండియా
నల్ల సౌందర్యానికి మళ్లీ కితాబు దక్కింది. శ్వేతవర్ణం వెనక్కు తగ్గింది. ‘మిస్ యూనివర్స్ 2019’ కిరీటం నల్లజాతి వనితకు దక్కిన కొద్ది రోజుల్లోనే ‘మిస్ వరల్డ్ 2019’ కిరీటం కూడా మరో నల్లవజ్రానికే దక్కింది. జమైకాకు చెందిన టోని ఆన్‌సింగ్ శనివారం లండన్‌లోని ఎక్సెల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన భారీ వేడుకలో మిస్ వరల్డ్ కిరీటాన్ని శిరస్సుపై ధరించి ఈ ఘనతను సాధించింది. 23 ఏళ్ల టోని ఆన్‌సింగ్ తండ్రి ఇండియన్ కరేబియన్. తల్లి ఆఫ్రికన్ కరేబియన్. కనుక ఆమె సౌందర్యంలో భారతీయ మూలాలు ఉన్నందుకు భారతీయ సౌందర్యప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో టాప్ 3లో నిలిచి సెకండ్ రన్నరప్‌గా మిస్ ఇండియా సుమన్ రావు స్థానం పొందడం కూడా భారతీయులకు సంతోషం కలిగిస్తోంది. 111 దేశాలు ఈ కిరీటం కోసం పోటీ పడగా టోని ఆన్‌సింగ్ మొదటి స్థానంలో, సుమన్ రావు మూడో స్థానంలో నిలిచి భారతీయ సౌందర్య కేతనాన్ని రెపరెపలాడించారు. నవంబర్ 20 నుంచి మొదలైన ఈ పోటీలు దాదాపు నాలుగు వారాలపాటు కొనసాగాయి. 70 దేశాల పార్టిసిపెంట్స్ రకరకాల దశల్లో వెనుకకు మరలగా టాప్ 40లో నిలిచిన అందగత్తెలు కిరీటం కోసం హోరాహోరి తలపడ్డారు. జమైకా బాలిక ‘ఈ విజయం ఆ జమైకా బాలికకు అంకితం’ అని కిరీటం దక్కించుకున్నాక టోని ఆన్‌సింగ్ వ్యాఖ్యానించింది. ఆ బాలిక ఎవరో కాదు తనే. ఈ విజయం తనూ తనలాంటి నల్లజాతి బాలికలకు సొంతమని టోని పేర్కొంది. ‘స్త్రీల సమానత్వం కోసం నేను చేయదగ్గ పనంతా చేస్తాను’ అని కూడా ఆమె అంది. టోని కుటుంబం ఆమెకు తొమ్మిదేళ్ల వయసు ఉండగా అమెరికాకు వలస వచ్చింది. ఫ్లోరిడా యూనివర్సిటీలోనే టోని విమెన్స్ స్టడీలో గ్రాడ్యుయేషన్ చేసింది. సెకండ్ రన్నరప్ సుమన్‌రావు రాజస్థాన్ అమ్మాయి రాజస్థాన్‌కు చెందిన సుమన్ రావు ‘మిస్ వరల్డ్ 2019’కు హాజరయ్యే ముందు ‘మిస్ రాజస్థాన్’, ‘మిస్ ఇండియా ఫెమినా’ టైటిల్స్ గెలుచుకుంది. ప్రస్తుతం ఆమె కుటుంబం నవీ ముంబైలో ఉంటోంది. చార్టర్డ్ అకౌంటెన్సీ పూర్తి చేసే పనిలో ఉన్న సుమన్ రావు ఇప్పటికే మోడలింగ్‌లో బిజీగా ఉంది. సినిమాలలో అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటోంది. కథక్ నృత్యకారిణి కావడం వల్ల మిస్ వరల్డ్ పోటీలలో ఆనవాయితీగా జరిగే డాన్స్ కాంపిటీషన్లో ‘పద్మావత్’ సినిమాలోని ‘ఝమర్’ పాటకు నృత్యం చేసి ఆహూతులను ఉర్రూతలూగించింది. ‘భారతదేశంలో స్త్రీలకు కట్టుబాట్లు ఎక్కువ. నా తల్లి అటువంటి కట్టుబాట్లు చాలా ఎదుర్కొంది. అయినప్పటికీ నన్ను నా కలల వెంట వెళ్లేలా చేసింది’ అని సుమన్ రావు చెప్పింది. మిస్ వరల్డ్ పోటీలో సుమన్ రావు మూడో స్థానంలో నిలిచిందని తెలియగానే ఆమె స్వగృహంలో వేడుకలు మొదలయిపోయాయి. ‘నా కూతురు అనుకున్నది సాధించింది’ అని తండ్రి రతన్ సింగ్ రావు పొంగిపోతూ చెప్పాడు. మొత్తం మీద ఈ శీతాకాలం భారతీయ సౌందర్యానికి మంచి సంతోషాన్ని తెచ్చిందని చెప్పుకోవాలి. ‘పద్మావత్’ సినిమాలోని పాటకు నృత్యం చేస్తున్న సుమన్ రావు -
మిస్ వరల్డ్‌గా జమైకా సుందరి
-
మిస్ వరల్డ్‌గా జమైకా సుందరి
లండన్: జమైకాకు చెందిన టోనీ–ఆన్ సింగ్ మిస్ వరల్డ్–2019 కిరీటం దక్కించుకున్నారు. లండన్‌లోని ఎక్సెల్ లండన్ కన్వెన్షన్ సెంటర్లో శనివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో ఆమెను ఈ కిరీటం వరించింది. గత ఏడాది మిస్ వరల్డ్‌గా నిలిచిన మెక్సికో సుందరి వనెస్సా పొన్స్.. టోనీ–ఆన్ సింగ్ తలపై మిస్ వరల్డ్ కిరీటాన్ని అలంకరించారు. ఈ పోటీలో ఫస్ట్ రన్నరప్‌గా ఫ్రాన్స్‌కు చెందిన ఒఫ్లి మెజినో, సెకండ్ రన్నరప్‌గా భారత్‌కు చెందిన సుమన్ రావ్ నిలిచారు. నవంబర్ 20వ తేదీ నుంచి మొదలైన 69వ మిస్ వరల్డ్–2019 పోటీలో 120 దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొన్నారు. పలు వడబోతల అనంతరం ఫైనల్స్ కోసం 10 మందిని ఎంపిక చేశారు. అంతిమంగా ఎంపికైన ఐదుగురికి ప్రముఖ వ్యాఖ్యాత పియర్స్ మోర్గాన్ నేతృత్వంలోని బృందం పలు ప్రశ్నలు సంధించింది. అందగత్తెల సమాధానాల ఆధారంగా విజేతలను ఎంపిక చేసింది. తన సొంతూరుతోపాటు ప్రపంచవ్యాప్తంగా లింగ సమానత్వం కోసం పోరాడతానని ఈ సందర్భంగా భారత్‌కు చెందిన రన్నరప్ సుమన్ రావ్ అన్నారు. జమైకా నుంచి మిస్ వరల్డ్ గెలుచుకున్న నాలుగో మహిళగా టోనీ–ఆన్ చరిత్ర సృష్టించారు. తొమ్మిదేళ్ల వయస్సులో ఆమె కుటుంబం అమెరికాకు వలస వెళ్లి, ఫ్లోరిడాలో స్థిరపడింది. సుమన్ రావ్ ► జననం: 1998 నవంబర్ 23 ► స్వస్థలం: రాజస్తాన్ రాష్ట్రం ఉదయ్‌పూర్ సమీపంలోని అయిదానా ► తల్లి: సుశీలా కున్వర్ రావ్, గృహిణి ► తండ్రి: రతన్ సింగ్, నగల వ్యాపారి ► విద్య: నవీముంబైలోని మహాత్మా స్కూల్ ఆఫ్ అకాడెమిక్స్ అండ్ స్పోర్ట్స్‌లో పాఠశాల విద్య పూర్తి చేశారు, ప్రస్తుతం ముంబై యూనివర్సిటీలో చార్టెర్డ్ అకౌంటెన్సీ చదువుతున్నారు. ► భాషలు: ఇంగ్లిష్, హిందీతోపాటు మాతృభాష మేవారీ ► వృత్తి: మోడల్, డ్యాన్సర్(కథక్) ► 2018లో మిస్ నవీముంబై పోటీలో పాల్గొని మొదటి రన్నరప్‌గా నిలిచారు. అనంతరం రాజస్తాన్ తరఫున పాల్గొని ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ –2019ను, ఆ పోటీల్లోనే మిస్ ర్యాంప్‌వాక్ అవార్డు గెలుచుకున్నారు. -
మిస్ ఇండియా.. ఓ సర్‘ప్రైజ్’
ఆమె తాజా భారతీయ సౌందర్యం. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పుట్టి ముంబయిలో పెరిగిన ఈ బ్యూటీ 2019కి గాను మిస్ ఇండియా కిరీటాన్ని స్వంతం చేసుకుంది. ఈ నేపధ్యంలో నగరానికి వచ్చిన సుమన్రావ్...సెంట్రోమాల్లో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే... సాక్షి, సిటీబ్యూరో:‘‘ఒక కాలేజీ విద్యార్ధిని (20)గా సుమన్ లండన్‌లో జరగబోతున్న మిస్ వరల్డ్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించబోతోంది’’అనేది ఇప్పటికీ నాకు ఆనందాశ్చర్యాలు కలిగిస్తూనే ఉంది. తొలుత మిస్ నవీ ముంబయి బ్యూటీ కాంటెస్ట్ సరదాగా, మిస్ రాజస్థాన్ గెలుపు కాస్త సీరియస్‌గా... మిస్ ఇండియా దగ్గరకు వచ్చేసరికి పూర్తి అంకిత భావంతో ఒక్కో అడుగు వేశాను. వీటన్నింటికి మించి ఇప్పుడు మిస్ వరల్డ్ వైపు ప్రయాణం చేస్తున్నాను. మహిళల స్థాయి పెరగాలి... మహిళల స్థితిగతులు మారాలి అనే సదుద్ధేశ్యంతో ఫ్యాషన్ రంగంలోకి వచ్చా. మహిళలు మరింత స్వతంత్రంగా మారాలని ఆర్ధిక స్వావలంబన సాధించి సమాజంలో సమాన స్థాయి రావాలని నేను పుట్టిన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని దుంగార్పూర్ జిల్లాలో ఒక ట్రైబల్ ప్రాంతాల్లో ప్రగతి అనే ప్రాజెక్ట్ చేస్తున్నాను. దీనికి స్ఫూర్తి ‘బ్యూటీ విత్ పర్పస్ అనే కాన్సెప్ట్’ దీనిని ు మిస్ వరల్డ్ నిర్వాహకులు చైర్ పర్సన్ జులియా మోర్లె ప్రారంభించారు. ప్రతి అందాల రాణి ఒక సముచిత సామాజిక బాధ్యతతో ఉండాలని ఆమె ఉద్దేశ్యం. పుట్టిన ప్రాంతం నుంచే మార్పు తేవాలనుకుంటున్నాను. తర్వాత దేశం, తర్వాత ప్రపంచం... అలా. సినిమా కష్టమే... కానీ ఇష్టమే సినిమా అవకాశాల విషయంలో చాలా మంది అమ్మాయిలు సమస్యలు ఎదుర్కుంటున్నట్టు గమనిస్తున్నాను. అయినప్పటికీ నేనునటించడానికి సిద్ధమే. ఈ భూమ్మీద అతి కష్టమైన పని ఏదైనా ఉందంటే అది గ్లామర్ వరల్డ్‌లో ముఖ్యంగా సినీ పరిశ్రమలో రాణించడమే. ఎందుకంటే దీనికి చాలాటాలెంట్ కావాలి. ఒకవేళ అలాంటి అవకాశమే గనుక వస్తే దాన్ని అన్ని విధాలుగాశ్రమించి సద్వినియోగం చేసుకుంటాను. లైట్‌గా తింటే..బ్రైట్‌గా ఉంటాం... నేను జంక్ ఫుడ్ తినను. వీలైనంత వరకూ హోమ్ ఫుడ్ మాత్రమే తింటాను. ఇటీవలే జిమ్‌కి వెళుతున్నా. పిలాటెస్ చేస్తున్నా. వీలైనంతగా నీళ్లు తాగడం, మంచి నిద్ర కూడా ఫిట్‌నెస్‌కు మేలు చేస్తుంది. మన శరీరానికి నప్పే ఆహారాన్ని పరిశీలించి ఎంచుకోవాలి. అలాగే అమితాహారం వద్దు. మనకు పొట్ట ఫుల్ అనిపించగానే తినడం ఆపాలి. కలలు సాకారం చేసిన కథక్... చిన్నప్పటి నుంచీ నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. సంప్రదాయ నృత్యం సాధన చేస్తున్నా. గత నాలుగేళ్లుగా కథక్ నేర్చుకుంటున్నా. దీని వల్ల కామ్‌నెస్, మరింత క్రమశిక్షణ వస్తాయి. సానుకూల దృక్పధం కూడా అలవడింది. మిస్ ఇండియా పోటీల్లో ఈ తత్వం నాకు చాలా ఉపకరించింది. ప్రపంచస్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి కూడా నా డ్యాన్స్ తోడ్పడుతుందనుకుంటున్నా. మిస్ వరల్డ్ పోటీల్లో డ్యాన్స్ రౌండ్ కూడా ఉంది. హైదరాబాద్మళ్లీ మళ్లీ వస్తా... ఈ సిటీ గురించి చాలా విన్నాను. మరిన్ని సార్లు వచ్చి సిటీ మొత్తం తిరగాలని చూస్తా. పుట్టిన ఉదయ్‌పూర్, పెరిగిన ముంబయి రెండూ నాకు ఇష్టమే. అలాగే నేను మిస్ ఇండియాగా తిరిగే ప్రతి నగరం నా జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. నవతరం అమ్మాయిలకు చెప్పేది ఒకటే... ఒక లక్ష్యం కోసం మనం మనసా వాచా సిద్ధమైతే, శరీరంలోని ప్రతి నరం, కణం అదే దిశగా ప్రయాణం చేస్తుంది. -
మిస్ ఇండియాగా సుమన్ రావ్
ముంబై: రాజస్తాన్‌కు చెందిన సీఏ విద్యార్థిని మిస్ ఇండియా–2019 విజేతగా నిలిచారు. ముంబైలోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో శనివారం ఈ కార్యక్రమం జరిగింది. మిస్ ఇండియా టైటిల్ గెలుచుకోవడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. పరిస్థితులు ఎప్పటికీ చేజారవని, తనలాగే కలలు కంటున్న ఇతర మహిళలు భయపడకుండా కలలను సాకారం చేసుకోవచ్చన్న నమ్మకం ఈ టైటిల్ అందుకోవడం ద్వారా కలిగిందన్నారు. తన కుటుంబం, మిత్రులతో సంబరాలు జరుపుకోవడానికి వేచి ఉండలేకపోతున్నానని అన్నారు. డిసెంబర్లో బ్యాంకాక్‌లో జరుగనున్న మిస్ వరల్డ్ పోటీల్లో కూడా పాల్గొననున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఇంజినీర్ శివాని జాదవ్ మిస్ గ్రాండ్ ఇండియాగా నిలిచారు. బిహార్‌కు చెందిన మేనేజ్మెంట్ విద్యార్థిని శ్రేయా శంకర్ మిస్ ఇండియా యునైటెడ్ కాంటినెంట్స్‌గా నిలిచారు. తెలంగాణకు చెందిన సంజనా విజ్ మిస్ ఇండియా రన్నరప్‌గా నిలిచారు. ప్రముఖ డిజైనర్ ద్వయం ఫాల్గుని షేన్ పీకాక్, మిస్ వరల్డ్ 2018 వెనెస్సా పొన్కా డి లియోన్, నటులు హుమా ఖురేషి, చిత్రాంగ సింగ్, ఆయుష్ శర్మ, కొరియోగ్రాఫర్, చిత్రనిర్మాత రెమో డి సౌజా, స్ప్రింటర్ ద్యుతి చంద్, ఫుట్‌బాల్ టీం కెప్టెన్ సునీల్ ఛెత్రితో కూడిన బృందం విజేతలను ఎంపిక చేసింది. ఎంటెక్ చదువుతున్న సంజన... తెలంగాణకు చెందిన సంజనా విజ్ మిస్ ఇండియా రన్నరప్‌గా నిలిచారు. దీనితోపాటు మిస్ తెలంగాణ 2019 టైటిల్‌ను అందుకున్నారు. ఈమె యూపీలోని అమితీ యూనివర్సిటీలో బయో టెక్నాలజీలో ఎం.టెక్ చదువుతున్నారు. -
మిస్ ఇండియా 2019గా సుమన్ రావు
సాక్షి, ముంబయి : ఈ ఏడాది మిస్ ఇండియా కిరీటాన్ని రాజస్థాన్‌కు చెందిన సుమన్ రావు (20) కిరీటాన్ని కైవసం చేసుకుంది. దీంతో 2019లో థాయిలాండ్‌లో జరిగే మిస్ వరల్డ్ పోటీలకు భారతదేశం తరపున మిస్ ఇండియా సుమన్‌రావు ప్రాతినిథ్యం వహించనుంది. అలాగే రన్నరప్‌గా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన శివానీ జాదవ్, సెకండ్ రన్నరప్‌గా తెలంగాణకు చెందిన సంజనా విజ్ నిలిచారు. ఇక మిస్ ఇండియా యునైటడ్ కాంటినెంట్స్ కిరీటాన్ని బీహార్‌కి చెందిన శ్రేయా శంకర్ గెలుచుకున్నారు. ముంబైలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో గత ఏడాది సెకండ్ రన్నరప్‌గా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌కి చెందిన శ్రేయా రావు కామవరపు... ఈ ఏడాది తన కిరీటాన్ని సంజనా విజ్‌కి బహుకరించింది. ఈ సందర్భంగా కిరీటం సొంతం చేసుకున్న సుమన్ రావు మాట్లాడుతూ ‘జీవితంలో ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే , దాన్ని సాధించడానికి శరీరంలోని అణువణువూ మనకు సహకరిస్తూ విజయం వైపు అడుగులు వేయడానికి దోహదపడుతుందని’ తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా, నటీ నటులు హిమాఖురేషీ, చిత్రాంగధసింగ్, ఫ్యాషన్ నిపుణుడు ఫాల్గుణి పికోకా, భారత ఫుట్‌బాల్ ఆటగాడు సునీల్ ఛెత్రీ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు కరణ్‌జోహర్, నటుడు మనీష్‌పాల్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా, బాలీవుడ్ నటీనటులు కత్రినాకైఫ్, విక్కీకౌషల్, మౌనీరాయ్ తమ నృత్యాలతో ప్రేక్షకులను అలరించారు. -
స్వచ్ఛతలో మున్సిపాలిటీ ఆదర్శం
చైర్పర్సన్ పావని సిరిసిల్ల : స్వచ్ఛతలో సిరిసిల్ల మున్సిపాలిటీ రాష్ట్రానికే ఆదర్శంగా ఉంటుందని చైర్పర్సన్ సామల పావని అన్నారు. స్థానిక విద్యానగర్‌లో కమిషనర్ సుమన్ రావుతో కలిసి సెప్టిక్‌ట్యాంకులను పరిశీలించారు. పట్టణంలోని ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉందని, మురుగుకాలువకు పైపులను తొలగించి సెప్టిక్‌ట్యాంకులను నిర్మించేందుకు నెలరోజులుగా శ్రమించామని పేర్కొన్నారు. పందులను తొలగించేక్రమంలో మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్ల సహకారంతో లక్ష్యాన్ని చేరామన్నారు. ఆమె వెంట కౌన్సిలర్ వెల్ముల స్వరూపరెడ్డి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. -
వేగంగా సెప్టిక్ ట్యాంకుల నిర్మాణాలు
► జనవరి 25లోగా పూర్తి చేయాలి ►మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని సిరిసిల్ల : ఇంటింటికీ సెప్టిక్ ట్యాంకు నిర్మాణాలు వేగంగా నిర్మిస్తున్నారని, ఇదే స్ఫూర్తిని అందరూ కొనసాగించాలని మున్సిపల్ చైర్పర్సన్ సామ ల పావని అన్నారు. గాంధీనగర్‌లో సోమవారం ఇంటింటికీ పర్యటించారు. జనవరి 25వ తేదీ లోగా సెప్టిక్ ట్యాంకులను అందరూ నిర్మించుకొని, వంద శాతం నిర్మాణాలు పూర్తి చేసి ఆద ర్శ పట్టణంగా మార్చాలని కోరారు. సెప్టిక్ ట్యా ంకు కట్టుకున్న వారికి మున్సిపల్ ద్వారా రూ. ఏడు వేలు అందిస్తామని అన్నారు. మురుగుకాలువలకు టాయిలెట్ పైపులను కలుపడం మూ లంగా పారిశుధ్య సమస్యలు ఎదురవుతున్నాయని మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు అన్నా రు. అందరూ భాగస్వాములై సెప్టిక్ ట్యాంకులను కట్టుకోవాలని కమిషనర్ కోరారు. వారి వెంట మున్సిపల్ ఏఈ రవికుమార్, శానిటరీ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
► నాణ్యత లోపిస్తే కాంట్రాక్టర్లపై చర్యలు ► మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని సిరిసిల్ల : పట్టణంలో అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని అన్నారు. పట్టణంలోని శాంతినగర్ 4వ వార్డులో 14వ ఆర్థిక సంఘం నిధులతో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను ఆమె శుక్రవారం ప్రారంభించారు. అనంతరం రూ.35 లక్షల ఎస్డీఎఫ్ ని ధులతో నిర్మిస్తున్న మురికి కాల్వ పనులను పరిశీలించారు. గడిచిన రెండేళ్లలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు సాగలేదని ఇప్పుడే అన్ని పనులు మొదలయ్యాయన్నారు. చేపట్టిన పనులను నాణ్యతతో వేగంగా చేయాలని, లోపాలుంటే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామ ని హెచ్చరించారు. ఇప్పటికే సెప్టిక్‌ట్యాంకుల నిర్మాణాలపై దృష్టిసారించామన్నారు. విద్యానగర్‌లో సెప్టిక్ ట్యాంకుల నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ వెంగల లక్షి్మనర్సయ్య, మున్సిపల్ ఏఈ రవికుమార్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఫ్లెక్సీలు, ప్లాస్టిక్ రహిత పట్టణంగా సిరిసిల్ల పట్టణాన్ని ప్లాస్టిక్, ఫ్లెక్సీ రహిత పట్టణంగా ప్రకటిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ బీ.సుమన్ రావు శుక్రవారం తెలిపారు. మున్సిపల్ ఆఫీస్‌లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణంలో అనుమతి లేకుండా ఫ్లెక్సీలు కట్టడం నేరమన్నారు. ప్లాస్టిక్ బ్యాగుల వినియోగంపై నిషేధం ఉందని కమిషనర్ తెలిపారు. ఎవరైనా పట్టణ కూడళ్లలో వ్యాపార ప్రకటనలు, రాజకీయ ప్ర చారం కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, భారీగా జరిమానాలు విధిస్తామన్నారు.పాలథీన్ కవర్లు వినియోగించినా, విక్రయించిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్లాస్టిక్, ఫ్లెక్సీ రహిత ప ట్టణంగా మార్చేందుకు తోడ్పాటునందించాలని కోరారు.