అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి | We need to increase the speed of development work | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

Published Sat, Dec 31 2016 10:38 PM | Last Updated on Tue, Sep 5 2017 12:03 AM

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

► నాణ్యత లోపిస్తే కాంట్రాక్టర్లపై చర్యలు
► మున్సిపల్‌ చైర్‌పర్సన్ సామల పావని


సిరిసిల్ల : పట్టణంలో అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్ సామల పావని అన్నారు. పట్టణంలోని శాంతినగర్‌ 4వ వార్డులో 14వ ఆర్థిక సంఘం నిధులతో సిమెంట్‌ రోడ్డు నిర్మాణ పనులను ఆమె శుక్రవారం ప్రారంభించారు. అనంతరం రూ.35 లక్షల ఎస్‌డీఎఫ్‌ ని ధులతో నిర్మిస్తున్న మురికి కాల్వ పనులను పరిశీలించారు. గడిచిన రెండేళ్లలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు సాగలేదని ఇప్పుడే అన్ని పనులు మొదలయ్యాయన్నారు. చేపట్టిన పనులను నాణ్యతతో వేగంగా చేయాలని, లోపాలుంటే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామ ని హెచ్చరించారు.  ఇప్పటికే సెప్టిక్‌ట్యాంకుల నిర్మాణాలపై దృష్టిసారించామన్నారు. విద్యానగర్‌లో సెప్టిక్‌ ట్యాంకుల నిర్మాణ పనులను పరిశీలించారు.  కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్‌ వెంగల లక్షి్మనర్సయ్య, మున్సిపల్‌ ఏఈ రవికుమార్, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఫ్లెక్సీలు, ప్లాస్టిక్‌ రహిత పట్టణంగా సిరిసిల్ల
పట్టణాన్ని ప్లాస్టిక్, ఫ్లెక్సీ రహిత పట్టణంగా ప్రకటిస్తున్నామని మున్సిపల్‌ కమిషనర్‌ బీ.సుమన్ రావు శుక్రవారం తెలిపారు. మున్సిపల్‌ ఆఫీస్‌లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణంలో అనుమతి లేకుండా ఫ్లెక్సీలు కట్టడం నేరమన్నారు. ప్లాస్టిక్‌ బ్యాగుల వినియోగంపై నిషేధం ఉందని కమిషనర్‌ తెలిపారు. ఎవరైనా పట్టణ కూడళ్లలో వ్యాపార ప్రకటనలు, రాజకీయ ప్ర చారం కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, భారీగా జరిమానాలు విధిస్తామన్నారు.పాలథీన్ కవర్లు వినియోగించినా, విక్రయించిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్లాస్టిక్, ఫ్లెక్సీ రహిత ప ట్టణంగా మార్చేందుకు తోడ్పాటునందించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement