cement road
-
స్థల వివాదంలో కుటుంబ బహిష్కరణ!
సాక్షి,పెదపూడి: మండలంలోని పైన గ్రామంలో ఓ కుటుంబంపై సాంఘిక బహిష్కరణ చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలో ఉలిసే సుబ్బారావు, అతని కొడుకు సాయిరామ్, కుమార్తె, భార్య నివసిస్తున్నారు. బాధితుడు సుబ్బారావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో రామాలయం సమీపంలో తమ నివాస గృహం ఎదురుగా ఈ ఏడాది ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ పెద్దలు సిమెంటు రోడ్డు నిర్మించారు. అ రోడ్డు నిర్మాణ విషయంలో సుబ్బారావు కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.అయినా సరే స్థానిక పంచాయతీ పెద్దలు కొంత మంది రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. ఈ విషయంపై బాధిత కుటుంబం కోర్టును ఆశ్రయించింది. దీంతో ఆగ్రహించిన గ్రామంలో కొంతమంది పెద్దలు బహిష్కరణ వేటు వేశారు. గ్రామ మాజీ సర్పంచి మట్టపర్తి వీరభద్రరావు, తదితరులు తమపై కావాలనే ఇలా బహిష్కరణ చేసినట్లు ఆ కుటుంబ సభ్యులు ఆరోపించారు. గ్రామంలో ఏ వస్తువు కొనాలని వెళ్లినా, తమకు సహకరించడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయడానికి వెళితే ‘మీకు అమ్మకాలు జరపబోమని’ విక్రయదారులు చెబుతున్నారని ఆయన వివరించారు. ఒకవేళ పంచాయతీ పెద్దలను కాదని వస్తువులను అమ్మితే రూ.6 వేలు జరిమానా విధిస్తారని పెద్దలు విక్రయదారులకు హెచ్చరించారంటూ బాధితుడు వివరించారు. ఈ బహిష్కరణ విషయమై గతంలో పెదపూడి పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర దర్యాప్తు చేపట్టి తగిన చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు. బహిష్కరించలేదు ఉలిసే సుబ్బారావు కుటుంబాన్ని బహిష్కరించలేదు. రామాలయం వద్ద దేవుని కార్యక్రమాలు చేయడానికి ఆ ప్రాంతంలో గ్రామ పెద్దల అందరి సమక్షంలో సీసీరోడ్డు నిబంధనల ప్రకారం చేపట్టాం. ఎలాంటి ఆక్రమణాలు చేయలేదు. – మట్టపర్తి వీరభద్రం ,మాజీ సర్పంచి -
దారి దోపిడీ
పైచిత్రంలోని రోడ్డు ద్వారకాతిరుమల మండలంలోని రామసింగవరంలో వేసిన సిమెంటు రోడ్డు. గ్రామంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి పాకిరం వెంకటరత్నం ఇంటి వరకు దాదాపు 50 మీటర్ల దూరం సీసీ రోడ్డును ఐదు నెలల కిత్రం నిర్మించారు. ఇలా గ్రామంలో రూ.50లక్షల వ్యయంతో పలు చోట్ల రోడ్లు వేశారు. 20ఏళ్లకుపైగా ఉండాల్సిన రోడ్లు నాణ్యత లేక కుంగిపోతున్నాయి. ప్రజాప్రతినిధులు బినామీ పేర్లతో కాంట్రాక్టు తీసుకుని వీటిని వేశారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే వేసిన ఐదు నెలలకే ఛిద్రమయ్యాయి. దేవరపల్లి/ద్వారకాతిరుమల/గోపాలపురం: జాతీయ ఉపాధి హామీ పథకం, పంచా యతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ నిధులతో గ్రామాల్లో నిర్మించిన రోడ్లకు అవినీతి తూట్లు పడుతున్నాయి. టీడీపీ ప్రజాప్రతినిధులు బినామీ కాంట్రాక్టర్లుగా చెలామణి అవుతూ రోడ్ల నిర్మాణంలో దోపిడీకి పాల్పడుతున్నారు. నిర్మాణ పనులను పర్యవేక్షించాల్సిన అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. ఐదునెలలు తిరగకుండానే.. గోపాలపురం నియోజకవర్గంలో అత్యధికంగా సిమెంట్ రోడ్ల నిర్మాణం జరిగింది. నిబంధనల ప్రకారం సిమెంట్ రోడ్డు సుమారు 20 ఏళ్ల నుంచి 25ఏళ్లు ఉండాలి. అయితే ప్రస్తుతం వేస్తున్న రోడ్లు ఐదునెలలు కాకుండానే పగుళ్లు తీసి శి«థిలమవుతున్నాయి. గోపాలపురం పంచాయతీరాజ్ సబ్‌డివిజనల్ పరిధిలోని దేవరపల్లి, గోపాలపురం, నల్లజర్ల, ద్వారకాతిరులమ మండలాల్లో 2017–18 సంవత్సరానికి సిమెంట్ రోడ్ల నిర్మాణానికి రూ.250 కోట్ల ఉపాధి హామీ, పంచాయతీ నిధులు మంజూరు చేశారు. వీటితో 87,151 మీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఇప్పటి వరకు సుమారురూ.150 కోట్లతో 29,099 మీటర్ల పొడవున రోడ్లు నిర్మించారు. అయితే వేసిన రోడ్లు పలు గ్రామాల్లో బీటలు తీశాయి. దీంతో సిమెంట్ రోడ్ల కంటే మట్టిదారులు నయమని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇవిగో నిదర్శనాలు - దేవరపల్లిలో ఆరు సిమెంట్ రోడ్ల నిర్మాణం అసంపూర్తిగా ఉంది. బాలదుర్గమ్మ ఆలయ ప్రాంతంలో గత ఏడాది సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. దీనికి కాలువ ఇసుక వాడుతున్నారని, స్థానికులు పనులను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన కాంట్రాక్టరు మిగిలిన రోడ్లను ఆపేశారు. - దేవరపల్లి మండలం చిన్నాయగూడెం, సంగాయగూడెంలో గత ఆర్థిక సంవత్సరంలో మంజూరైన సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులు చేయకుండానే గత ఏడాది మార్చిలో అధికారపార్టీ నేతల అండతో బిల్లులు చేయించుకుని జేబులు నింపుకున్నారు. సుమారు రూ. 10 లక్షలు స్వాహా చేసినట్టు తెలుస్తోంది. గ్రామస్తుల ఫిర్యాదుతో అధికారులు ఆగమేఘాలపై రోడ్లు నిర్మాణం పూర్తి చేశారు. - ద్వారకాతిరుమల మండలం రామసింగవరంలో 5 నెలల క్రితం నిర్మించిన అంబేడ్కర్ సెంటర్ రోడ్డు అప్పుడే ధ్వంసమైంది. ఎంపీపీ పాఠశాల వెనుక రోడ్డూ దెబ్బతింది. ప్రజాప్రతినిధులే కాంట్రాక్టర్లు కావడం వల్లే ఈ దుస్థితి నెలకొంది. - మద్దులగూడెంలో ఇటీవల సర్పంచ్ కట్టూరి స్వర్ణలత భర్త చంటిబాబు 7వ వార్డులో సీసీ రోడ్డు నిర్మిస్తుండగా, ఒక వార్డు సభ్యురాలు భర్త దానంపూడి భుజంగరావు నిర్మాణ పనుల్లో నాణ్యత లేదని గొడవకు దిగారు. ఇద్దరి మధ్య కొట్లాట జరిగింది. ఇద్దరూ అధికార పార్టీ వారే కావడం విశేషం. - దేవినేనివారిగూడెంలో రోడ్లు నిర్మించిన కొద్దిరోజులకే బీటలు వారాయి. - గోపాలపురం మండలం గోపవరంలో టీడీపీ నాయకుడు చేపట్టిన రోడ్లు నిర్మించిన రెండు నెలలకే గోతులు పడ్డాయి. - వాదాలకుంట, జగన్నాథపురం, భీమోలు, చిట్యాల, గోపాలపురంలలో టీడీపీకి చెందిన జన్మభూమి కమిటీ సభ్యులు మాత్రమే సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. అవకతవకలపై విచారణ చేపట్టాలి గ్రామంలో వేసిన సిమెంట్ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. రోడ్డు వేసిన రెండు నెలలకే పాడయ్యాయి. కాంట్రాక్టర్లను అడిగితే కమీషన్లే ఇవ్వాలా రోడ్డు నాణ్యతే పాటించాలా అని అంటున్నారు. సిమెంట్ రోడ్ల కన్నా గ్రావెల్‌రోడ్లు నయంగా ఉన్నాయి. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అధికారపార్టీ నాయకులే కాంట్రాక్టర్లవుతున్నారు. – కాకులపాటి వెంకట్రావు, భీమోలు రోడ్లను పరిశీలించి చర్యలు తీసుకుంటా ఇటీవలే డివిజినల్ ఇంజినీరింగ్ అధికారిగా బదిలీపై వచ్చా. నాణ్యత లేకపోవడం వల్ల శిథిలమైన రోడ్లను పరిశీలించి సంబంధిత కాంట్రాక్టరుపై చర్యలు తీసుకుంటా. రోడ్డు వేసిన కాంట్రక్టర్తో మళ్లీ మరమ్మతులు చేయిస్తా. నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతాం. – కె. భద్రానాయక్, డీఈఈ, పంచాయతీరాజ్ -
‘ఉపాధి’తో గ్రామాలలో సిమెంట్ రోడ్లు
అధికారులకు మంత్రి జూపల్లి ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పథకం కింద గ్రామాలలో పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఆర్డీవోలతో ఉపాధి హామీ పనుల పురో గతిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీ క్షించారు. ఉపాధి హామీ, హరితహారం, మరుగుదొడ్ల నిర్మాణంపై జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఉపాధిహామీ కింద సిమెంట్ రోడ్ల నిర్మాణం కోసం 14 జిల్లాల నుంచి ప్రతిపాదనలు అందాయని, మిగతా ప్రజా ప్రతినిధులతో సంప్రదించి ప్రతిపాదనలు పంపాలని కోరారు. ఉపాధి పనులు జరిగిన గ్రామాలకు రోడ్ల నిర్మాణం లో ప్రాధాన్యమివ్వాలని సూచించారు. -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
► నాణ్యత లోపిస్తే కాంట్రాక్టర్లపై చర్యలు ► మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని సిరిసిల్ల : పట్టణంలో అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని అన్నారు. పట్టణంలోని శాంతినగర్ 4వ వార్డులో 14వ ఆర్థిక సంఘం నిధులతో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను ఆమె శుక్రవారం ప్రారంభించారు. అనంతరం రూ.35 లక్షల ఎస్డీఎఫ్ ని ధులతో నిర్మిస్తున్న మురికి కాల్వ పనులను పరిశీలించారు. గడిచిన రెండేళ్లలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు సాగలేదని ఇప్పుడే అన్ని పనులు మొదలయ్యాయన్నారు. చేపట్టిన పనులను నాణ్యతతో వేగంగా చేయాలని, లోపాలుంటే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామ ని హెచ్చరించారు. ఇప్పటికే సెప్టిక్‌ట్యాంకుల నిర్మాణాలపై దృష్టిసారించామన్నారు. విద్యానగర్‌లో సెప్టిక్ ట్యాంకుల నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ వెంగల లక్షి్మనర్సయ్య, మున్సిపల్ ఏఈ రవికుమార్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఫ్లెక్సీలు, ప్లాస్టిక్ రహిత పట్టణంగా సిరిసిల్ల పట్టణాన్ని ప్లాస్టిక్, ఫ్లెక్సీ రహిత పట్టణంగా ప్రకటిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ బీ.సుమన్ రావు శుక్రవారం తెలిపారు. మున్సిపల్ ఆఫీస్‌లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణంలో అనుమతి లేకుండా ఫ్లెక్సీలు కట్టడం నేరమన్నారు. ప్లాస్టిక్ బ్యాగుల వినియోగంపై నిషేధం ఉందని కమిషనర్ తెలిపారు. ఎవరైనా పట్టణ కూడళ్లలో వ్యాపార ప్రకటనలు, రాజకీయ ప్ర చారం కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, భారీగా జరిమానాలు విధిస్తామన్నారు.పాలథీన్ కవర్లు వినియోగించినా, విక్రయించిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్లాస్టిక్, ఫ్లెక్సీ రహిత ప ట్టణంగా మార్చేందుకు తోడ్పాటునందించాలని కోరారు. -
ఆర్అండ్బీ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
ఒంగోలు కలెక్టరేట్ : ‘పీసీపల్లి మండలం అలవలపాడు వద్ద సిమెంట్ రోడ్డుకు అప్రోచ్ వేయమని మూడు నెలల క్రితం చెప్పా. ఇంతవరకూ వేయలేదు. అక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు జరిగి జనాలు చనిపోయిన తర్వాత అప్రోచ్ వేస్తారా? మీకు సొంత జ్ఞానం ఉండదా? ఇంజినీరింగ్ చదివే వచ్చారా’ అని ఆర్అండ్బీ ఇంజినీరింగ్ అధికారులపై కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం గురువారం స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో జరిగింది. జిల్లాలో రోజురోజుకూ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల పట్ల కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాల సంఖ్యను సాధ్యమైనంత మేరకు తగ్గించేందుకు సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలని సూచించారు. జాతీయ రహదారితో పాటు రాష్ట్ర రహదారులన్నింటిపైనా ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రమాదాలన్నీ ఎక్కువ శాతం తెల్లవారు జామున రెండు నుంచి నాలుగు గంటల మధ్యలో జరుగుతున్నాయని, ఆ సమయాల్లో వాహనాలు తిరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని వల్లూరు, మార్టూరు ప్రాంతాల్లో పార్కింగ్ ప్రదేశాలను అభివృద్ధి చేసి దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల డ్రైవర్లు అక్కడ విశ్రాంతి తీసుకునేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని జాతీయ రహదారి అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారితో కలిపే ప్రాంతాల్లో అన్ని రహదారులపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి వాహనాలు వేగంగా రోడ్డుపైకి రాకుండా నివారించాలని కలెక్టర్ చెప్పారు. వంద మీటర్ల పరిధిలో మద్యం దుకాణాలు ఉండొద్దు జాతీయ రహదారికి ఇరువైపులా వంద మీటర్ల పరిధిలో మద్యం దుకాణాలు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ, రాష్ట్రీయ రహదారులన్నింటిపై ఆక్రమణలు తొలగించాలన్నారు. రోడ్లపై వాహనాలు పార్కు చేయకుండా చర్యలు చేపట్టాలన్నారు. రోడ్లపై అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించాలని సూచించారు. ఒంగోలు నగరంలోని ఫ్లయిఓవర్ బ్రిడ్జి కింద ఆక్రమణలు తొలగించి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి గ్రీనరీ పెంచాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ విజయకుమార్ సూచించారు. కార్పొరేషన్ కమిషనర్‌కు చార్జి మెమో: ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్ విజయలక్ష్మికి కలెక్టర్ విజయకుమార్ చార్జి మెమో జారీ చేశారు. నగరంలోని తొమ్మిది ప్రాంతాల్లో సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేయాలని గతేడాది మే 23వ తేదీన నిర్ణయం తీసుకున్నా ఇంతవరకు అమలు చేయకపోవడంతో ఆమెపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర పాలక సంస్థ పరిధిలో అప్రోచ్ రోడ్ల వివరాలు అడిగినా సకాలంలో స్పందించకపోవడంతో కమిషనర్‌పై కలెక్టర్ మండిపడ్డారు. -
రోడ్డు వేస్తారా..చావమంటారా..!
గూడూరు టౌన్, న్యూస్‌లైన్ : వీధి మొత్తం సిమెంట్ రోడ్డు వేస్తారా..లేదంటే కిరసనాయిల్ పోసుకుని చా వమంటారా.. అని బెదిరిస్తూ గూ డూరులో ఓ మహిళ అధికారులకు ముచ్చెమటలు పట్టించింది. మాళవ్యానగర్‌లోని వివేకానంద స్కూ లుకు వెళ్లే మార్గంలో సిమెంట్ రో డ్డు నిర్మాణానికి రూ.3 లక్షలు మం జూరైంది. శనివారం ఆ వీధిలో రో డ్డు పనులను అధికారులు ప్రారంభించారు. వీధి మొదటి నుంచి కా కుండా, మధ్యలో నుంచి రోడ్డు వే స్తుండటంపై స్థానికులు సౌజన్య మ్మ, జయరామిరెడ్డి అభ్యంతరం తెలిపారు. నిధులు వచ్చిన మేరకే రోడ్డు వేస్తున్నామని అధికారులు స ర్దిచెప్పబోయారు. ఆగ్రహంతో ఊ గిపోయిన సౌజన్యమ్మ ఒంటిపై కి రోసిన్ పోసుకుని రోడ్డుపై బైఠాయించారు. వీధిలో మొత్తం సిమెం ట్‌రోడ్డు వేయాల్సిందేనని పట్టుబ ట్టారు. మున్సిపల్ కమిషనర్ సుశీ లమ్మ వివేకానంద స్కూలు వీధికి చేరుకున్నారు. సౌజన్యమ్మకు సర్దిచెప్పేం దుకు ప్రయత్నించినా ఫలి తం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రం గంలోకి దిగి సౌజన్యమ్మను అక్కడ నుంచి పంపించేశారు. -
‘దారి’ మళ్లుతున్న ‘ఉపాధి’ నిధులు
వెంకటగిరి, న్యూస్‌లైన్: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందంగా అధికార పార్టీ నేతలు ముందుకు సాగుతున్నారు. మరికొద్ది నెలల్లో ప్రభుత్వ పదవీకాలం ముగియనుండటంతో నాలుగు కాసులు సంపాదించుకునేందుకు ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరవుతున్న నిధులు వారికి వరంగా మారాయి. అవసరం ఉన్నా లేకున్నా నాసిరకంగా రోడ్లు నిర్మించేసి ప్రజల సొత్తును జేబులో వేసుకుంటున్నారు. ప్రజాధనాన్ని సద్వినియోగం చేయాల్సిన అధికారులు వారికి వంతపాడుతుండటం విమర్శలకు తావి స్తోంది. అదే సమయంలో సమస్యలకు నిలయంగా మారిన దళిత, గిరిజన కాలనీ లను విస్మరిస్తున్నారు. వెంకటగిరి నియోజవర్గంలో నెలకొన్న పరిస్థితి ఇది. డక్కిలి మండలం దగ్గవోలు పంచాయతీలోని శ్రీరాంపల్లి ఎస్టీకాలనీ, రేగడపల్లి ఎస్సీకాలనీల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వం రూ.13 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధుల్లోని రూ.3 లక్షలతో శ్రీరాంపల్లి ఎస్టీ కాలనీలో సిమెంట్ రోడ్లు వేశారు. ఒక వీధిలో 8 ఇళ్లు, మరోవీధిలో ఒకే ఇల్లు ఉన్నా నిధులను ఎలాగైనా వినియోగంచాలనే ఉద్దేశంతో హడావుడిగా సిమెంట్ రోడ్డు నిర్మించారు. మరో రూ.10 లక్షలతో రేగడిపల్లి దళితకాలనీలో సీసీ రోడ్ల నిర్మాణం జరిగింది. ఇక్కడ మూడు వీధుల్లో రోడ్లు నిర్మించగా ఒక వీధిలో ఇళ్లే లేకపోవడం గమనార్హం. వీటి నిర్మాణ సమయంలో అధికారుల పర్యవేక్షణ కరువవడంతో అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్లు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా మారింది. నాసిరకమైన కంకరను వినియోగించి రోడ్లను నిర్మించడంతో అవి అప్పుడే నెర్రెలు బారుతున్నాయి. రేగడిపల్లిలో ప్రస్తుతం జరుగుతున్న డ్రైన్ల నిర్మాణం కూడా నాసిరకంగా సాగుతోంది. పదికాలాల పాటు ఉండాల్సిన రోడ్లు ముణ్నాళ్ల ముచ్చటగా మారుతుండటంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్ల నిర్మాణం జరుగుతున్న తీరును పంచాయతీ రాజ్ అధికారుల వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా తాము సమ్మెలో ఉన్నామని సమాధానం ఇచ్చారు.