అధికారులకు మంత్రి జూపల్లి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పథకం కింద గ్రామాలలో పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఆర్‌డీవోలతో ఉపాధి హామీ పనుల పురో గతిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీ క్షించారు. ఉపాధి హామీ, హరితహారం, మరుగుదొడ్ల నిర్మాణంపై జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఉపాధిహామీ కింద సిమెంట్ రోడ్ల నిర్మాణం కోసం 14 జిల్లాల నుంచి ప్రతిపాదనలు అందాయని, మిగతా ప్రజా ప్రతినిధులతో సంప్రదించి ప్రతిపాదనలు పంపాలని కోరారు. ఉపాధి పనులు జరిగిన గ్రామాలకు రోడ్ల నిర్మాణం లో ప్రాధాన్యమివ్వాలని సూచించారు.
‘ఉపాధి’తో గ్రామాలలో సిమెంట్ రోడ్లు
Published Sat, Feb 4 2017 2:49 AM | Last Updated on Tue, Sep 5 2017 2:49 AM
Advertisement
Advertisement