nrega
-
బిల్లులు అప్రూవ్ చేయలేదని పెట్రోల్ దాడి : నిర్మల్
-
కట్టలు, కాల్వలకు పునరుజ్జీవం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన గ్రామీణ కూలీలకు పనుల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల్లోని కాల్వలు, కట్టల పునరుద్ధరణకు బృహత్ కార్యాచరణ సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఉపాధి హామీ పథకాన్ని నీటిపారుదల శాఖకు అనుసంధానించి రూ.1,200 కోట్ల మేర పనులు చేపట్టేందుకు ముందుకొచ్చింది. వర్షాలు, నీటి లభ్యత పుష్కలంగా ఉండనున్న దృష్ట్యా చెరువులు, ప్రాజెక్టుల పరిధిలోని కట్టలు, కాల్వలు, ఫీడర్ చానళ్ల అభివృద్ధి.. చెట్లు, పొదల తొలగింపును పకడ్బందీగా చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం జరిగిన సమీక్షలో జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ‘ఉపాధి’తో అభివృద్ధి.. లాక్డౌన్ పరిస్థితుల్లో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న వలస కూలీలంతా సొంత గ్రామాలకు తరలిపోయిన విషయం తెలిసిందే. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక కూలీలంతా కష్టంగా నెట్టుకొస్తున్న నేపథ్యంలో కూలీలకు పని కల్పన లక్ష్యంగా కేంద్రం ఎన్ఆర్ఈజీఎస్ పనుల కింద భారీగా నిధుల కేటాయింపులు జరిపి, గ్రామీణ స్థాయిలో 260 రకాల అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఇచ్చింది. ఈ పనుల్లో నీటి పారుదల రంగానికి సంబంధించిన పనులే 23దాకా ఉన్నాయి. ప్రధానంగా చెరువుల పూడికతీత, కాల్వలు, కట్టలు, ఫీడర్ చానళ్లలో పూడికతీత, చెట్లు, పొదల తొలగింపు, కాల్వలు, పిల్ల కాల్వల లైనింగ్ పనులు, ప్రధాన ప్రాజెక్టుల్లోనూ కాల్వల పునరుద్ధరణ పనులకు అనుమతించింది. ఇందులో భాగంగా కృష్ణా, గోదావరి బేసిన్‌లోని చెరో 15వేల చెరువులు కలిపి 30 వేల చెరువుల కింద కట్ట, కాల్వలు, ఫీడర్ చానళ్ల పునరుద్ధరణకు రూ.500 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించింది. ఈ పనులతో 30 వేల చెరువుల పరిధిలోని కాల్వల్లో కోటి క్యూబిక్ మీటర్ల పూడికతీత తీయనున్నారు. ఎస్సారెస్పీ, నిజాంసాగర్, నాగార్జునసాగర్, దేవాదుల, కల్వకుర్తి, బీమా, జూరాల వంటి భారీ ప్రాజెక్టులతో పాటు పోచారం, ఘణపురం, శనిగరం, సాత్నాల, వైరా, ర్యాలివాగు, గొల్లవాగు, పెద్దవాగు వంటి సాగునీటి ప్రాజెక్టుల పరిధిలోనూ ప్రధాన, బ్రాంచ్ కాల్వల మరమ్మతుల నులను రూ.700 కోట్లతో చేపట్టనున్నారు. -
ఊరూరా నర్సరీలు
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) నిధులను సంపూర్ణంగా వినియోగించుకొని గ్రామాల్లో తెలంగాణకు హరితహారం, వైకుంఠధామాలు (శ్మశాన వాటికలు) నిర్మించా లని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. నరేగా నిధులతోపాటు రాష్ట్ర బడ్జెట్ నిధులు, ఎంపీ, ఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృద్ధి నిధులను ఉపయోగించుకొని గ్రామాల్లో అభివృద్ధి చర్యలు చేపట్టాలని సూచించారు. నరేగా పథకం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎంత మొత్తంలో నిధులు ఇస్తుందో అంతే మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయిస్తుందని... ఈ నిధులను గ్రామాల అభివృద్ధికి వినియోగించా లన్నారు. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలోనే నరేగా పనులు జరగాలని, హరితహారం పనులకు మొదటి ప్రాధాన్యం, శ్మశాన వాటికల నిర్మాణానికి రెండో ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చెప్పారు. నరేగా నిధులు గ్రామాల్లో ప్రజలకు ఉపయోగపడే ఆస్తు లను సృష్టించడానికి ఉపయోగించాలని సూచిం చారు. అన్ని గ్రామ పంచాయతీలకు కచ్చితంగా బీటీ రోడ్డు ఉండేలా రహదారుల వ్యవస్థను నిర్మించాలన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, ఎంపీలు బి. వినోద్ కుమార్, బండ ప్రకాశ్, ఎమ్మెల్యేలు డి.ఎస్. రెడ్యానాయక్, ఈటల రాజేందర్, బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, అడిషనల్ పీసీసీఎఫ్ డోబ్రియాల్, సీఎంవో ప్రత్యేక కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్‌రెడ్డి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ పాల్గొన్నారు. మొక్కల సంరక్షణ గ్రామ పంచాయతీలదే... ‘తెలంగాణకు హరితహారంలో భాగంగా రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామ పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలి. ప్రతి గ్రామంలో మొక్కలు నాటి రక్షించాలి. వాటికి నరేగా నిధులను పూర్తిగా వినియోగించుకోవాలి. గుంతలు తవ్వడానికి, నీళ్లు పోయడానికి, ఇతరత్రా పనులకు ఈ నిధులను వాడాలి. అటవీశాఖ అధికారుల సలహాలు, సాంకేతిక సహకారంతో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నర్సరీలు ఏర్పాటు చేయాలి. మొక్కలు పెట్టడం, వాటిని సంరక్షించడం లాంటి బాధ్యతలను గ్రామ పంచాయతీలు చేపట్టాలి. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో కచ్చితంగా ఆరు నెలల్లో వైకుంఠధామాలు నిర్మించాలి. ప్రభుత్వ భూమి లేకుంటే గ్రామ పంచాయతీలు తమ నిధులతో స్థలాలు సమకూర్చాలి లేదా దాతల నుంచి స్వీకరించాలి. నరేగా నిధులతో వైకుంఠధామాలను నిర్మించాలి. మూడు వేలలోపు జనాభాగల 11,412 గ్రామాల్లో ఒకటి చొప్పున... మూడు వేలకుపైగా జనాభా కలిగిన 1,300 గ్రామాల్లో రెండు చొప్పున మొత్తం 14,012 గ్రామాల్లో వైకుంఠధామాలు నిర్మించాలి. గ్రామాలను పరిశుభ్రంగా నిలపడం గ్రామ పంచాయతీల బాధ్యత. శిథిలాలను తొలగించాలి. పాడుపడిన, వాడని బావులను పూడ్చేయాలి. కూలిన ఇళ్ల శిథిలాలు తొలగించాలి. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు కచ్చితంగా బీటీ రోడ్డు ఉండాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. కొత్తగా 859 గ్రామాలకు రహదారులను నిర్మించాలి. వీటికోసం వెంటనే ప్రతిపాదనలు తయారు చేసి పనులు ప్రారంభించాలి. నరేగాతోపాటు వివిధ పథకాల కింద సమకూరిన నిధులతో గ్రామాల్లో జరుగుతున్న పనులను అధికారులు తనిఖీ చేయాలి. నిధులు దుర్వినియోగం కావద్దు. ప్రతి పైసా సద్వినియోగం కావాలి. పనులు నామమాత్రంగా చేసి నిధులు కాజేసే పద్ధతి పోవాలి. ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న పనులను అధికారులు 20 బృందాలుగా విడిపోయి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి’అని సీఎం కేసీఆర్ ఆదేశించారు. పంచాయతీ పాలనపై నేడు శిక్షణ... కొత్త పంచాయతీరాజ్ చట్టం, గ్రామాల్లోని పాలన తీరుపై గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గాలకు శిక్షణ ఇచ్చే ముఖ్య శిక్షకులకు అవగాహన కార్యక్రమం బుధవారం జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్లో మొదలయ్యే ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని అన్ని జిల్లాల పంచాయతీ అధికారులను ఆదేశించారు. వారితోపాటు ప్రతి జిల్లా నుంచి 10 మంది ఎంపిక చేసిన అధికారులు పాల్గొననున్నారు. ఈవోపీఆర్డీలు, ఎంపీడీవోలు, గ్రామ కార్యదర్శులు, పలువురు కొత్త సర్పంచ్‌లు, తాజా మాజీ సర్పంచ్‌లను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు పంచాయతీరాజ్‌శాఖ వర్గాలు తెలిపాయి. -
చేతివాటం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జాతీయ గ్రామీణా ఉపాధి హామీ పథకం పేదలకు వరం లాంటిదని సమావేశాలు జరిగిన ప్రతీసారి అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పే మాట. కానీ ఈ పథకం వాస్తవానికి అధికారులకు మాత్రమే వరంగా మారింది. పేదల పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారు. పథకంలో జరిగిన అక్రమాలను నిగ్గుతేల్చి అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు ఆయుధంగా ఉన్న సామాజిక తనిఖీతో కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోంది. ప్రతీ ఏడాది ప్రభుత్వం రూ. లక్షలు ఖర్చుచేసి గ్రామాల్లో ప్రత్యేక తనిఖీ బృందాలను పంపడం.. వారు తనిఖీ చేసి నివేదికలు బహిరంగ పరచడం.. ఉన్నతాధికారులు డబ్బుల రికవరీకి ఆదేశాలివ్వడం.. అక్రమార్కులు వాటిని పెడచెవిన పెట్టడం.. షరా మామూలైంది. అక్రమాలు వెలికి తీయడానికి చేసే ఖర్చు కన్నా అక్రమాలు తక్కువగా చూపించడంతోపాటు ఉన్నతాధికారులు విస్తుపోతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 10 విడతలుగా 171 సామాజిక తనిఖీలు, ప్రజావేదికలు నిర్వహించారు. ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వారిపై రెవెన్యూ రీకవరి చట్టాన్ని ఉపయోగించేందుకు అధికారులు మీనవేశాలు లెక్కిస్తున్నారు. అందరి భాగస్వామ్యంతోనే అవినీతి.. ఈజీఎస్ పనుల్లో ఎంపీడీఓ, అడిషనల్ పీఓలు, ఏఈఈ, టీఏ, సీఓ, ఎఫ్ఏ, ఈసీ, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, వీఓలు ఇలా అన్ని స్థాయిలోని వ్యక్తులు అవినీతికి పాల్పడుతున్నట్లు సామాజిక తనిఖీల్లో వెల్లడవుతోంది. ఈ పథకం కింద గ్రామాల్లో చెరువుల పూడికతీత, పంట కాలువల పూడికతీత, గ్రామాల్లో అంతర్గత రోడ్డు నిర్మాణాలు, మరుగు దొడ్లు నిర్మాణాలు, హరితహారంలో భా గంగా నాటిని మొక్కలకు కంచెల ఏర్పా టు మొక్కల సంరక్షణలకు నీటిని పోయ డం వంటి పనులతో పాటు మరుగు కాలువల పూడికతీత, ముళ్ల పొదల తొలగింపు వంటి పనులు కూడా చేస్తున్నారు. వీటిలోనే ఎక్కువగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు నిర్ధారణ అయింది. కూలీల సంఖ్య ఎక్కువగా వేయడం, కూలీలు పనులకు హాజరు కాకున్న వారు హాజరైనట్లు వారి పేర వేతనాలు కాజేడం వంటి అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోనైతే పనుల చేపట్టకుండానే పూర్తి చేసినట్లు నిధులు కాజేసిన ఉదంతాలెన్నో వెలుగులోకి వచ్చాయి. 4,396 మందిపై అభియోగాలు జిల్లా వ్యాప్తంగా ఇప్పటిదాక 4,396 మంది అక్రమాలకు పాల్పడారని ఆరోపణలు వచ్చాయి. ఇందులో ఎంపీడీఓలు 6, అడిషనల్ పీఓలు 45, ఏఈఈలు 26, టీఏలు 480, ఎఫ్‌ఏలు 1124, ఈసీలు 63, పంచాయతీ కార్యదర్శులు 1, సర్పంచులు 39, వీఓలు 2, గ్రూప్‌లీడర్లు 22, మేట్లు 1200 మిగతా వారిపై 1,259 మందిపై అభియోగాలు వచ్చాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా ఈ పథకంలో రూ.7.40 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఉన్నతాధికారుల అంచనా. వీటిౖòపై నిజానిజాలు తేల్చేం దుకు సామాజిక తనిఖీ నిర్వహించారు. ఇందులో రూ.3.96 కోట్ల అక్రమాలు జరిగినట్లు తేలింది. రూ.1.18 కోట్లు రికవరి చేసి ఈ నిధులను రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఖాతాల్లో జమ చేశారు. ఇలా జమ చేసిన మొత్తంలో రూ.33.01 లక్షలను కూలీలకు చెల్లించారు. ఇంకా రూ.2.78 కోట్లకు చెందిన వివరాల నిగ్గు తేల్చాల్సి ఉంది. అవినీతికి పాల్పడిన వారిపై రెవెన్యూ రికవరి చట్టం (ఆర్ఆర్ యాక్ట్) ద్వారా నిధులను తిరిగి వసూలు చేయాలి. కానీ కేవలం ఈ చట్టం కాగితాలకే పరిమితమై పోయింది. అవినీతికి పాల్పడిన సిబ్బందిని తాత్కాలికంగా నిధులు నుంచి తొలగించినా క్షేత్రస్థాయిలో ఇంకా చక్రం తిప్పుతున్నారు. కేంద్రం ఆదేశించినా.. సామాజిక తనిఖీల్లోనూ అక్రమాలను వెలికితీయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని కేంద్ర ప్రభు త్వం సైతం గుర్తించింది. వీటిని పటిష్టంగా నిర్వహించాలని, అక్రమాలకు పాల్పడిన వారినుంచి రికవరీ చేయాలని కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఎన్ని సంస్కరణలు తీసుకువస్తున్నా అక్రమాలు ఏదో ఒక రూపంలో జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల సామాజిక తనిఖీల్లో మహిళా సంఘాలను భాగస్వాములను చేయాలని సూచించింది. దీంతో నైనా ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న తనిఖీలో మార్పులు వస్తాయో చూడాలి. ప్రజల సమక్షంలో తేలుస్తాం ఉపాధి హామీ పథకంలో పారదర్శకత కోసమే సామాజిక తనిఖీలు నిర్వహిస్తున్నాం. అక్రమాలు జరిగితే ప్రజల సమక్షంలోనే సామాజిక తనిఖీ చేస్తాం. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం. డబ్బులను రికవరీ చేస్తాం. – ఆనంద్‌కుమార్, డీఆర్డీఓ -
ఉపాధి.. హతవిధీ
► పేరుకుపోతున్న ఉపాధి బకాయిలు ► అల్లాడిపోతున్న కూలీలు ► చెల్లించేదే తక్కువ మొత్తం ► దెబ్బతింటున్న పథకం లక్ష్యం ► కుప్పంలో పరిస్థితి మరీ ఘోరం గ్రామీణ పేదలకు, దినసరి కూలీలకు వరప్రసాదం ఉపాధి హామీ. వలసలకు అడ్డుకట్టవేసి.. గ్రామీణ భారతాన్నిఆర్థికంగా శక్తిమంతం చేయడం దీని ఉద్దేశం. సొంత ఊళ్లలోనే పని అడిగిన ప్రతి ఒక్కరికీ సంవత్సరంలో కనీసం 100 రోజులు పని కల్పించాలి. పని అయితే కల్పిస్తున్నారు కానీ కూలి చెల్లించడంలో మాత్రం ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. పథక ఉద్దేశం దెబ్బతింటోంది. జనవరి 15 నుంచి ఉపాధి కూలీలకు వేతనాలు ఇవ్వడంలేదు. నిరుపేదలు ఆకలితో అలమటిస్తున్నారు. జిల్లాలో వలసలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కేంద్రం తన వాటాగా ఇచ్చిన నిధులను ప్రభుత్వ అవసరాలకు ఖర్చు చేయడంతో ఉపాధి కూలీలకు మూడు నెలలుగా వేతనాలు లేక అల్లాడుతున్నారు. చిత్తూరు,సాక్షి: జిల్లాలో ఉపాధి పథకంలో పని చేసే వారికి జనవరి 15 నుంచి కూలి నిలిచియిపోయింది. ఈ మూడునెలల్లో రూ.18 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను ఇతర అవసరాలకు వాడుకుంటుండటంతోనే ఉపాధి వేతనాలు నిలిచి పోయాయని తెలుస్తోంది. అయితే ఉపాధి హామీ పథకానికి మెటీరియల్ పనులు చేసే కాంట్రాక్టర్లకు మాత్రం ఎప్పటికప్పుడు సొమ్ములు చెల్లిస్తోంది. కూలీలకు మాత్రం మొండిచేయి చూపిస్తోంది. ఫిబ్రవరిలో కలెక్టర్ సిద్ధార్థజైన్ ఉపాధి పనులకోసం రూ.13 కోట్లు విడుదల చేశారు. ఈ మొత్తాన్ని కాంట్రాక్టర్ల చెల్లింపులకే కేటాయించారు. పెద్ద నోట్ల ప్రభావంతో చెల్లింపులు నిలిచిపోవడంతో కూలీలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం.. వేతనాలు చెల్లించాలని ఇండియన్ బ్యాంకును ఆదేశించింది.దీంతో ఆ బ్యాంకు రూ.6కోట్లు వేతనాలుచెల్లించింది. వీటిని కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు చెల్లించలేదు. పని కల్పన అంతంత మాత్రమే..: జిల్లా నుంచి పక్క రాష్ట్రాలకు వలసలు ఎక్కువగా ఉండటంతో ప్రతి రోజూ లక్ష మందికి ఉపాధి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యం నిర్ణయించుకుంది. కేవలం 30 వేల మందికి మాత్రమే పనులు కల్పిస్తున్నారు. ప్రతి కూలీకి రూ.194 కనీసవేతనం నిర్ణయించగా.. కేవలం రూ.168 లు మాత్రమే చెల్లిస్తున్నారు. గిట్టుబాటు ధర కల్పిండంలో కూడా ప్రభుత్వం విఫలమైంది. దీంతో ఉపాధి పనులపై కూలీలు ఆసక్తి చూపించడంలేదు. మొత్తం 6.58,914 మంది కూలీలుండగా 2016–17 ఏడాదికి గాను 2,27,206 మందికి మాత్రమే పని కల్పించారు. కుప్పంలో మరీ ఘోరం..: జిల్లాలోనే అధికంగా వలసలున్న ప్రాంతం కుప్పం. వలసల్ని కట్టడి చేయడంలో ప్రభుత్వ పూర్తిగా విఫలం అయింది. నియోజకవర్గంలో 18606 మందికి జాబ్‌కార్డులుండగా కేవలం 9226 మందికి మాత్రమే పని కల్పిస్తున్నారు. కూలి కూడా రూ.167లు మాత్రమే చెల్లించారు. ఈ ధర గిట్టుబాటు కాకపోవడంతో వలసలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. వలసలన్న చోట పని దినాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినా ఇక్కడ అమలు కావడం లేదు. బిల్లులు మంజూరు కాలేదు...: గత 6 నెలలుగా ఉపాధిహామి బిల్లులు మంజూరు కాలేదు. ఇంకుడు గుంతలు తవ్వ మన్నా రు. తవ్విన తరువాత బిల్లులు మంజూరు చేయలేదు. అంతే కాకుండా మామిడి చెట్ల బిల్లులు కూడా చాలావరకు మంజూరు కాలేదు. టీడీపీ ప్ర భుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉపాధి హామి బిల్లులు చాలావరకు సమయానికి రావడం లే దు. ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా ఉపాధిహామి బిల్లులు మంజూరు చేయాలని కోరుతున్నాం. ---పి.రాజారెడ్డి, లింగనపల్లి పస్తులు గడుపుతున్నాం: గ్రామీణ ఉపాధిహామీ పనులు చేసి రెండు నెలలు గడుస్తున్నా కూలీ డబ్బులను చెల్లించలేదు. దీంతో రెక్కాడితే కాని డొక్క నిండని బతుకులు గడుపుతు న్న మాకు చేతిలో చిల్లిగవ్వ లే కుండా పస్తులు గడుపుతున్నాము. దీనికితోడు ఉపాధిహామీ నిధులు సీసీ రోడ్లకు మళ్లించడంతో మాకు ఉపాధిహామీ పనులు సక్రమంగా కల్పించడం లేదు. దీంతో పొట్టకూటి కోసం పిల్లపాపలతో కలసి వలసలు వెళ్లాల్సిన పరిస్థితి మళ్లీ ఎదురవుతోంది. –పోలమ్మ, గురవరాజుపల్లి ఎస్టీ కాలనీ, రేణిగుంట -
‘ఉపాధి’తో గ్రామాలలో సిమెంట్ రోడ్లు
అధికారులకు మంత్రి జూపల్లి ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పథకం కింద గ్రామాలలో పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఆర్డీవోలతో ఉపాధి హామీ పనుల పురో గతిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీ క్షించారు. ఉపాధి హామీ, హరితహారం, మరుగుదొడ్ల నిర్మాణంపై జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఉపాధిహామీ కింద సిమెంట్ రోడ్ల నిర్మాణం కోసం 14 జిల్లాల నుంచి ప్రతిపాదనలు అందాయని, మిగతా ప్రజా ప్రతినిధులతో సంప్రదించి ప్రతిపాదనలు పంపాలని కోరారు. ఉపాధి పనులు జరిగిన గ్రామాలకు రోడ్ల నిర్మాణం లో ప్రాధాన్యమివ్వాలని సూచించారు. -
ఉపాధి పథకం సోషల్ ఆడిట్‌పై సమీక్ష
గుంటూరు వెస్ట్: ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్‌పై జెడ్పీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సోషల్ ఆడిట్ రాష్ట్ర డైరెక్టర్ సౌమ్య కిదాంబీ, ప్రోగ్రామ్ మేనేజర్ వరలక్ష్మి, 13 జిల్లాలకు చెందిన ప్రోగామ్ మేనేజర్లు, రాష్ట్ర, జిల్లా రిసోర్స్ పర్సన్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో జరిగిన ఉపాధి హామీ సోషల్ ఆడిట్‌పై ప్రధానంగా సమీక్షించారు. పంచాయతీరాజ్ కమిషనర్ బీ.రామాంజనేయులు సమావేశానికి హాజరయ్యారు. -
వరాల జల్లు
భివండీ, న్యూస్‌లైన్: రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం నగరానికి వచ్చిన రాహుల్ గాంధీ భివండీపై వరాల జల్లులు కురిపించారు. నగర మౌలిక సదుపాయాలతోపాటు మరమగ్గాల పరిశ్రమకి పెద్దపీట వేస్తానని హామీని ఇచ్చారు. సోనాలేలో గురువారం జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రతిపక్షాల వైఖరిని ఎండగడుతూనే కాంగ్రెస్ పార్టీని మళ్లీ గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్న భివండీలో పవర్ లూమ్ ఇండస్ట్రీకి పెద్దపీట వేస్తామన్నారు. ఠాణే జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేస్తామని హామీని ఇచ్చారు. ఠాణేను ముంబైతోపాటు కలుపుతాం... ఠాణే, భివండీతోపాటు ఇతర ప్రాంతాలను ముంబైతో అనుసంధానం చేస్తామని రాహుల్ పేర్కొన్నారు. ఇక్కడ ఏర్పాటుచేయాలనుకుంటున్న మెట్రో ప్రాజెక్టుపై ఇప్పటికే ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తో మాట్లాడామని చెప్పారు. మరోవైపు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా 5.5 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని వివరించారు. మెట్రో కారిడార్ ద్వారా 13 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తామని చెప్పారు. విరార్-అలీబాగ్లను కలిపే 126 కిలోమీటర్ల కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇలా అనేక పథకాల ద్వారా అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. మా పార్టీ పేదల పార్టీ... మా పార్టీ పేదల పార్టీ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దేశం అభివృద్ధి సాధించాలంటే పారిశ్రామికవేత్తలతోపాటు సామాన్యులను ఆదరించాల్సిన అవసరముందన్నారు. బడుగు బలహీనవర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. 1960, 1970లో అత్యధికంగా ఉన్న పేదరికం శాతం ఇప్పుడు తగ్గిందని, ఇది ఏ ఒక్కరి ద్వారా సాధ్యం కాలేదని, అందరి కృషి వల్లే సాధ్యమైందన్నారు. రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారీ అనేక విషయాలను తెలుసుకుంటున్నానని తెలిపారు. మహిళలకు ప్రాధాన్యమివ్వండి... అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని రాహుల్ సూచించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో కూడా మహిళలకు స్థానం కల్పించాలని ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రేకు సూచించారు. దేశ జనాభాలో 50 శాతం మంది మహిళలున్నారు. దీనికి తగ్గట్టుగా వారికి ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. అదేవిధంగా కోలి, కున్బీ, ఆదివాసులందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. అభివృద్ధి పనులే ప్రచార అంశాలు: సీఎం లోక్‌సభ ఎన్నికల్లో అభివృద్ధి పనులే తమ ప్రచార అంశాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పేర్కొన్నారు. భివండీ సభలో ఆయన మాట్లాడుతూ గత పదేళ్లుగా తాము చేసిన అభివృద్ధి పనులు, చేయబోనున్న అభివృద్ధి పనుల గురించి తెలిపి ప్రజలను ఓట్లు అడుగుతున్నామన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నేతృత్వంలో లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లను గెలుచుకుంటామన్న ధీమాను వ్యక్తం చేశారు. ఠాణేలో భిన్నమైన సమస్యలున్నాయి.... ఠాణేలో సమస్యలు మిగతా జిల్లాలకంటే భిన్నంగా ఉన్నాయని సీఎం చవాన్ పేర్కొన్నారు. దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఠాణే జిల్లాలో పట్టణ, ఆదివాసి, గిరిజన ప్రాంతాలున్నాయి. వీటిలో పట్టణ భాగం వేగంగా అభివృద్ధి చెందుతుండగా, ఆదివాసి ప్రాంతాలకు సరైన సదుపాయాలు అందడం లేదన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ జిల్లా కోసం ప్రత్యేక పథకాలు ప్రకటించామన్నారు. వీటిలో క్లస్టర్ డెవలప్మెంట్ యోజన, అటవీ హక్కు చట్టం తదితరాలున్నాయని తెలిపారు. భివండీలోని గోడౌన్లని క్రమబద్ధీకరించే విషయాన్ని పరిశీలిస్తున్నామని వివరించారు. బీజేపీకి విజన్ లేదు.. బీజేపీకి విజన్ లేదని సీఎం పృథ్వీరాజ్ చెప్పారు. తాము చేసిన అభివృద్ధి పనులతో ఎన్నికల్లోకి వెళుతున్నామని, బీజేపీ మాత్రం కేవలం ఆరోపణలు తప్ప విజన్ లేదని ఆరోపించారు. ఐక్యతతోపాటు దేశ అభివృద్ధి కోసం కాంగ్రెస్‌కు ఓటేయాలని ఆయన కోరారు. కాంగ్రెస్‌తోనే భవిష్యత్: మోహన్ ప్రకాష్ దేశ భవిష్యత్ కాంగ్రెస్‌తోనే ఉందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జీ మోహన్ ప్రకాష్ తెలిపారు. కేవలం ఆరోపణలు చేయడంకాదని, అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మా పార్టీ అందరికీ న్యాయం చేస్తుందన్నారు. దీంతోనే నేడు అందరూ హక్కుల కోసం పోరాడగలుగుతున్నారని తెలిపారు. ‘చాయ్ పే చర్చా..రూ 250 కోట్ల ఖర్చా...’ అని నరేంద్ర మోడీని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో రాహుల్ గాంధీ, మోహన్‌ప్రకాష్, పృథ్వీరాజ్ చవాన్, నారాయణ రాణేలతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మత్స్యకారుల సమస్యలను పరిష్కరిస్తా వర్సోవ, న్యూస్‌లైన్: మత్స్యకారులు ఎదుర్కొంటున్న పలు సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా గురువారం నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక గోమగలిలో వర్సొవ కోలి మచ్చిమార్ నక్స మండల్ ట్రావెలర్స్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సభలో రాహుల్... ముందుగా మత్స్యకారులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందుకు మత్స్యకారులు స్పందిస్తూ ‘మేము ఆదివాసులం. అత్యవసర సామగ్రి అందడం లేదు. అనేక తరాలుగా ఈ వృత్తిలోనే కొనసాగుతున్నాం. ఇందులో లాభం కంటే నష్టమే ఎక్కువ. మా పిల్లలకు ఉన్నత విద్య నేర్పించాం. అయినా ఏ ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం రాలేదు. దీంతో వారు కూడా ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు. తాత ముత్తాల నుంచి ఇదే వృత్తిలో బతుకులీడుస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం డీజిల్ ధరలను అనేక పర్యాయాలు పెంచింది. లాంచీల పన్ను పెంచింది. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన వసతులను ప్రభుత్వం కల్పించలేదు. మీరు వర్సొవ ప్రాంతాన్ని చూశారు కదా. ఇక్కడ రోడ్డు చాలా చిన్నదిగా ఉంది . మాకు పెద్ద రోడ్డు కావాలి. మా పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగావకాకాశాలు కల్పించాలి’ అని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఎంపీ గురుదాస్ కామత్, ఎమ్మెల్సీ బాలెధేవ్ కోసా తదితరులు పాల్గొన్నారు.