సోలార్ సిబ్బందిపై కేసు నమోదు
Published Tue, Dec 13 2016 12:20 AM | Last Updated on Mon, Oct 22 2018 8:25 PM
గడివేముల: గని సమీపంలో సోలార్ ప్రాజెక్టు పనులు చేస్తున్న హజురా కంపెనీ జేసీబీ డ్రైవర్లు శరత్‌కుమార్, శీనుపై సోమవారం సాయంత్రం కేసు నమోదు చేశామని గడివేముల పోలీస్ స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు తెలిపారు. 640 సర్వే నంబర్‌లో జేసీబీతో పనులు చేస్తుండగా నష్ట పరిహారం ఇవ్వలేదని గని గ్రామ రైతు చాంద్‌బాషా అడ్డుకున్నాడు. దీంతో జేసీబీ డ్రైవర్లు తనపై రాడ్లతో కొట్టారని బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సోమవారం కేసు నమోదు చేశామని హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు. బాధితుడు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Advertisement
Advertisement