కరీంనగర్: కరీంనగర్ జిల్లా ఓదెల మండలకేంద్రంలో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక లారీతోపాటు జేసీబీ కాలిపోయాయి. కొలనూర్ నుంచి లారీలో జేసీబీని తరలిస్తుండగా ఓదెల సమీపంలో కరెంటు తీగలు తగిలాయి. అది గమనించని లారీ డ్రైవర్ లారీని ముందుకు తీసుకెళ్లాడు. ఇంతలో కరెంట్ తీగలు ఒకదానికికోటి రాసుకుని ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
ఈ ప్రమాదంలో లారీ, జేసీబీ పూర్తిగా కాలిపోయాయి. రూ.70 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. కాగా, లారీ డ్రైవర్ మాత్రం ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
కరెంట్ తీగలు తగిలి లారీ, జేసీబీ దగ్ధం
Published Tue, Jun 14 2016 6:32 PM | Last Updated on Mon, Sep 4 2017 2:28 AM
Advertisement
Advertisement