Viral Video: Pregnant Woman Taken On JCB Machine At Madhya Pradesh - Sakshi
Sakshi News home page

Pregnant Woman Video Viral: అంబులెన్స్‌ రాలేదు.. జేసీబీతో గర్భిణి ఆస్పత్రికి తరలింపు: వీడియో వైరల్‌

Published Thu, Aug 25 2022 11:35 AM | Last Updated on Thu, Aug 25 2022 12:49 PM

Viral Video: Pregnant Woman Taken On JCB Machine At Madhya Pradesh - Sakshi

భోపాల్‌: గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు మధ్యప్రదేశ్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. దీంతో పలు ప్రాంతాలు, రహదారులు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఐతే మధ్యప్రదేశ్‌లోని నీమాచ్‌ జిల్లాలో ఒక గర్భిణిని ఆస్పత్రిని తీసుకెవెళ్లేందుకు అంబులెన్స్‌కి కాల్‌ చేశారు. కానీ  వరదల ఉధృతి కారణంగా అంబులెన్స్‌ ఆ గర్భిణి నివాసానికి చేరుకోవడం సాధ్యం కాలేదు.

దీంతో స్థానిక అధికారులు, ఎమ్మెల్యే, పోలీసులు సదరు గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు జేసీబీ మెషిన్‌ని ఏర్పాటు చేశారు. ఈఘటన నీమాచ్‌ జిల్లాలోని రావత్‌పూర్‌లో చోటు చేసుకుంది. వాస్తవానికి ఈ వరదలు కారణంగా మధ్యప్రదేశ్‌లోని 39 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది ప్రభుత్వం. ఐతే ప్రభుత్వం జారీ చేసిన ప్రమాద హెచ్చరికల్లో ఆ గర్భిణి నివాసిత జిల్లా కూడా ఉంది.

దీంతో అదికారులు ఆమెను సకాలంలో ఆస్పత్రికి తరలిం‍చేందుకు ఈ ఏర్పాటు చేశారు. అంతేకాదు భోపాల్‌తో సహా మధ్యప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్ర రాజధాని తోపాటు ఇతర ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: ప్రయాణికుడికి అస్వస్థత.. ఎయిరిండియా విమానం అత్యవసర ల్యాండింగ్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement