
శభాష్ నరసింహా..
శనివారం అనంతపురం జిల్లా ధర్మవరంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్షకు చెన్నేకొత్తపల్లికి చెందిన వికలాంగ విద్యార్థి నరసింహా హాజరయ్యాడు. ఇతనికి పుట్టుకతోనే చేతులు లేవు. చదువు మీద శ్రద్ధతో కాలితో రాయడం నేర్చుకున్నాడు. ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్నాడు. చదువులో మంచి ప్రతిభ కనబరుస్తుండటంతో టీచర్లు అతన్ని నవోదయ ప్రవేశపరీక్ష రాయమని సలహా ఇచ్చారు. ఈ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చిన డీఈఓ కాలితో పరీక్ష రాస్తున్న నరసింహను చూసి అభినందించారు.
- న్యూస్‌లైన్, ధర్మవరం