ఖిల్లాఘనపురం: వరి పంటకోత దశలో ముసురు వానకు పాడైపోయిందనే బెంగతో ఓ రైతు గుండెపోటుకు గురై మృతిచెందాడు. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురానికి చెందిన చెరక పెద్దనర్సింహ (65)కు మూడెకరాల పొలం ఉంది. అందులో వరి సాగు చేశాడు. కాగా, సోమవారం కోత మిషన్ తో పంటను కోయిస్తుండగా ముసురువాన కురిసింది. దీంతో సగమే కోసి మిగతాది మొత్తం బురదగా ఉండటంతో, వాహనం దిగబడుతుందని మధ్యలోనే వదిలేసి వెళ్లారు.
దీంతో ఆ రైతు ఆందోళనకు గురయ్యాడు. ముందుగా కోసిన ధాన్యాన్ని కేజీబీవీ సమీపంలోని ప్రైవేట్ ప్లాట్లను చదును చేసుకుని రాశిగా పోసుకున్నాడు. రాత్రి అక్కడే నిద్రించాడు. అర్ధరాత్రి దాటాక పెద్దనర్సింహకు గుండెనొప్పి రావడంతో తోటి రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment