మామిడి కాయలు దొంగిలిస్తున్నారని యజమాని చెట్టుకు ఇనుప తీగ చుట్టి కరెంటు కనెక్షన్ ఇచ్చాడు.
సదాశివనగర్ : మామిడి కాయలు దొంగిలిస్తున్నారని యజమాని చెట్టుకు ఇనుప తీగ చుట్టి కరెంటు కనెక్షన్ ఇచ్చాడు. ఇది తెలియని ఓ చిన్నారి మామిడి చెట్టు ఎక్కి కాయలు కోయబోగా కరెంట్ షాక్ తగిలి అక్కడిక్కడే మృతిచెందింది. గురువారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలంలోని పోస్టాఫీసు కాలనీకి చెందిన జోగిని అక్షయ(10) అనే బాలిక.. అదే కాలనీకి చెందిన కుక్కల నారాయణ అనే వ్యక్తి ఇంట్లో మామిడి కాయల కోసం చెట్టు ఎక్కింది. అయితే చెట్టుకు ముందే అమర్చి ఉన్న ఇనుప తీగ ద్వారా కరెంట్ షాక్కు గురై మృతిచెందింది. కాగా ఇంటి యజమాని వచ్చేంతవరకు శవాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లమని బంధువులు భీష్మించి కూర్చున్నారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.