కోట (నెల్లూరు): విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి చెందిన సంఘటన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోట మండలంలోని కర్లపూడిలో శుక్రవారం జరిగింది. పొలంలో తెగిపడి ఉన్న 11కేవీ విద్యుత్ తీగ తగిలి పోతుగుంట మునెయ్య(48) ప్రాణాలొదిలాడు. పంటకు నీరు పెట్టేందుకు మునెయ్య రాత్రి పొలంలోనే నిద్రించారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో కరెంటు రావడంతో మోటారు వేసేందుకు వెళుతుండగా కరెంటు తీగలు తగిలి అక్కడికక్కడే చనిపోయాడు.
తెల్లవారిన తర్వాత సమీపాన ఉన్న మరో రైతు మునెయ్య మృతి చెంది ఉండటాన్ని గుర్తించి బంధువులకు సమాచారమిచ్చారు. మృతుడికి భార్య పోలమ్మ, ముగ్గురు పిల్లలున్నారు. విద్యుత్‌శాఖ ఏడీ విజయకుమార్‌రెడ్డి, ఏఈ వరప్రసాద్‌రెడ్డి, కోట ఎస్సై అజయ్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం మునెయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బాలిరెడ్డిపాళెం వైద్యశాలకు తరలించారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి
Published Fri, Jul 17 2015 7:48 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement