విద్యుదాఘాతంతో రొయ్యల రైతు మృతి | Aqua farmer electrocuted | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రొయ్యల రైతు మృతి

Published Wed, Aug 10 2016 11:24 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

Aqua farmer electrocuted

తోటపల్లిగూడూరు : విద్యుదాఘాతంతో ఓ రొయ్యల రైతు మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి మండలంలోని కోడూరు పంచాయతీ నెల్లిమిట్టకండ్రికలో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు... నెల్లిమిట్టకండ్రిగకు చెందిన వేట వెంకటశేషయ్య (40) కాటేపల్లిలో రొయ్యల చెరువు సాగు చేస్తున్నాడు. వెంకటశేషయ్య మంగళవారం అర్ధరాత్రి 1గంట సమీపంలో తన రొయ్యల చెరువుకు మోటారు వేసేందుకు వెళ్లాడు. మోటారుకు విద్యుత్‌ సరఫరా అవుతుండటంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం తోటి రైతులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కుటుంబ సభ్యులు వెంకటశేషయ్య మృతదేహం చూసి బోరున విలపించారు. మృతుడికి భార్య కళ్యాణి, ఇద్దరు పిల్లలున్నారు.  అర్ధరాత్రి సమయాల్లో విద్యుత్‌ సరఫరా ఇవ్వడం వల్లే వెంకటశేషయ్య మృతి చెందాడని తోటి రైతులు, కుటుంబ సభ్యులు ట్రాన్స్‌కో అధికారులపై మండిపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని స్థానిక పోలీసులు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement