సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా విద్యుద్ఘాతానికి గురై ఒక యువకుడు మృతి చెందిన సంఘటన నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలో శనివారం చోటుచేసుకుంది.
పెద్దవూర (నల్లగొండ) : సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా విద్యుద్ఘాతానికి గురై ఒక యువకుడు మృతి చెందిన సంఘటన నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మండలంలోని శిర్సనగండ్ల గ్రామానికి చెందిన కంభంపాటి నరేష్(24) శుక్రవారం రాత్రి తన సెల్‌కు చార్జింగ్ పెట్టేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో చార్జర్ పిన్ సెల్‌కు పెట్టబోగా విద్యుత్ సరఫరా కావడంతో షాక్కు గురై పడిపోయి అక్కడికక్కడే చనిపోయాడు. నరేష్‌కు గత నెల 23వ తేదీన గుర్రంపోడు మండలం నడికుడ గ్రామానికి చెందిన చిట్టెమ్మతో వివాహం అయింది.