గుంటూరు : ట్యాంకును శుభ్రం చేస్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ తగిలి మృతిచెందాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం వంకాయలపాడు గ్రామంలో గురువారం జరిగింది. వంకాయలపాడు గ్రామ సమీపంలోని విశ్వసౌభాగ్య పాల కేంద్రంలో పనిచేస్తున్న ఎడ్లపాడుకు చెందిన శ్రీనివాసరావు(40) నిల్వ ట్యాంకులను శుభ్రం చేస్తున్న సమయంలో ట్యాంకుకు విద్యుత్ తీగలు తాకడంతో షాక్ కొట్టి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
Published Thu, Jul 9 2015 3:39 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement
Advertisement