
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
విద్యుదాఘాతంతో ఇండ్ల నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు.
నెల్లూరు : విద్యుదాఘాతంతో ఇండ్ల నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం నెల్లూరు నగరంలోని జెండావీధి రోడ్డులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... నగరానికి చెందిన వజీద్ ఇండ్ల నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం జెండావీధిలో నూతనంగా నిర్మిస్తున్న గృహం వద్ద పని చేసేందుకు వెళ్లాడు.
అయితే అక్కడ ప్రమాదవశాత్తు విద్యుత్ వైరు తెగి అతనిపై పడటంతో షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.