గుర్తుతెలియని వ్యక్తి మృతి
నెల్లూరు రూరల్: గుర్తుతెలియని వ్యక్తి(45) మృతి చెందిన ఘటన దేవరపాళెం పంచాయతీ పరిధిలోని భవానీ ముని ఆశ్రమ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది.
నెల్లూరు రూరల్: గుర్తుతెలియని వ్యక్తి(45) మృతి చెందిన ఘటన దేవరపాళెం పంచాయతీ పరిధిలోని భవానీ ముని ఆశ్రమ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. రూరల్ పోలీసుల కథనం మేరకు.. దొడ్ల డెయిరీ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని గమనించిన సర్పంచ్ నాగలూరి పెంచలయ్య పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ ఎస్సై రామ్మూర్తి ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం సమీపంలో ఐస్ బాక్సు, సైకిల్ పడి ఉంది. మృతుడు ఐస్ అమ్ముకునే వ్యక్తి అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కొంత దూరంలో ఖాళీ మద్యం బాటిళ్లు ఉన్నాయి. ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేశారు. మృతుడు నల్లప్యాంట్, గీతల చొక్కా ధరించి ఉన్నారు