విశాఖపట్నంలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ క్లబ్‌లో మంగళవారం ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్ తగిలి ఇద్దరు మహిళలు మృతి చెందారు.
విశాఖపట్నం : విశాఖపట్నంలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ క్లబ్‌లో మంగళవారం ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్ తగిలి ఇద్దరు మహిళలు మృతి చెందారు. కరెంట్ షాక్ తగిలిన వెంటనే వారిని గాజువాక ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రికి మహిళలను తరలించగా.. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే వారిద్దరూ మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతిచెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.