
సాక్షి, పెనగలూరు(కడప) : టేబుల్ ఫ్యాన్ ఆన్ చేసేందుకు స్విచ్‌పై చేయి పెట్టగానే విద్యుదాఘాతానికి గురై ఓ బాలుడు మృతి చెందాడు. పెనగలూరు మండలం నల్లపురెడ్డిపల్లె గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దవటం మండలం తురకపల్లె గ్రామానికి చెందిన పసుపులేటి బండయ్య (11) తన తల్లితో కలసి బంధువుల ఇంటికి నల్లపురెడ్డిపల్లెకు వచ్చాడు. మంగళవారం ఉదయం స్నానం చేసి మంచం మీద పడుకొని టేబుల్ ఫ్యాను వేసుకోవాలని తడిచేతులతో స్విచ్‌పై వేలుపెట్టాడు. వెంటనే విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. కొన ఊపిరితో ఉన్న బండయ్యను కుటుంబ సభ్యులు రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. చుట్టపు చూపుగా వచ్చి విద్యుదాఘాతంతో మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఏఎస్‌ఐ వెంగయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment