![Mother and Son Died by Electrocution Mobile charging - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2023/08/9/electrim.gif.webp?itok=hZ-AeNLQ)
యూపీలోని సీతాపూర్‌లో మొబైల్ చార్జింగ్ అవుతున్న సమయంలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. విద్యుదాఘాతానికి గురైన తల్లీకుమారుడు మృతిచెందారు. వారిద్దిరూ ఒకే గదిలో ఉండగా, ఈ ఘటన చోటుచేసుకుంది.
కుటుంబ సభ్యులు ఆ గది తలుపులు తెరవగానే వారికి అక్కడ అచేతనంగా పడివున్న తల్లీకొడుకుల మృతదేహాలు కనిపించాయి. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. అయితే కుటుంబ సభ్యులు మృతులకు పోస్టుమార్టం చేసేందుకు నిరాకరించారు.
ఈ ఘటన భవానీపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. 15 ఏళ్ల రోహిత్ జైశ్వాల్ తమ ఇంటిలోని ఒక గదిలో పడుకున్నాడు. అదే గదిలో అతని తల్లి రామస్ హెలీ కూడా పడుకుంది. రాత్రి వేళ రోహిత్ మొబైల్ చార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. అతనిని కాపాడే ప్రయత్నంలో తల్లి కూడా విద్యుదాఘాతానికి గురయ్యింది. ఉదయం కుటుంబ సభ్యులు తల్లీకొడుకులు మృతి చెందిన విషయాన్ని గుర్తించారు. మృతులకు పోస్టుమార్టం చేయవద్దంటూ అభ్యర్ఙంచి, వారికి అంత్యక్రియలు నిర్వహించారు.
ఇది కూడా చదవండి: ఎయిర్‌క్రాఫ్ట్ నడుపుతూ 11 ఏళ్ల చిన్నారి.. పక్కనే మద్యం తాగుతూ తండ్రి.. మరుక్షణంలో..
Comments
Please login to add a commentAdd a comment