మరిపెడ రూరల్: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. గ్రామమంతా షార్ట్‌సర్క్యూట్ వస్తుందని చెప్పినా వారు పట్టించుకోలేదు. వెరసి కుక్కర్‌లో అన్నం వండుతుండగా విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం స్జేజితండా పరిధిలోని బుడ్డతండా(మెగ్యాతండా)లో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. షార్ట్‌సర్క్యూట్ వల్ల కొద్ది రోజులుగా తండాలోని ఇళ్లలో గల గృహోపకరణాలకు విద్యుత్ సరఫరా అవుతోంది.
సమస్యను పరిష్కరించాలని అధికారులకు పలుమార్లు గ్రామస్తులు మొరపెట్టుకున్నారు. అయినా వారు పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే తండాకు చెందిన భూక్యా సునీత(25) ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో అన్నం వండుతుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. తన భార్య మృతికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని మృతురాలి భర్త భూక్యా సంతోష్ ఆరోపిస్తున్నారు. మృతురాలికి ఏడాదిన్నర పాప ఉంది. తల్లి కోసం రోదిస్తున్న చిన్నారిని చూసి పలువురు కన్నీటి పర్యాంతమైయ్యారు.
(చదవండి: అయ్యో భగవంతుడా.. మేం ఏ పాపం చేశాం.. ముగ్గురు కొడుకులు రోడ్డు ప్రమాదాల్లోనే..)
Comments
Please login to add a commentAdd a comment