విద్యుదాఘాతంతో విద్యార్థులకు గాయాలు | Five students injured due to electrocution | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో విద్యార్థులకు గాయాలు

Published Fri, Sep 11 2015 3:42 PM | Last Updated on Sun, Sep 3 2017 9:12 AM

Five students injured due to electrocution

మెహదీపట్నం (హైదరాబాద్) : నగరంలోని అశిఫ్‌ నగర్ ప్రాంతంలోని ఓ మసీదులో ప్రార్థనల సమయంలో ఐదుగురు విద్యార్థులు విద్యుదాఘాతానికి గురయ్యారు. ప్రాథమిక సమాచారం మేరకు... అజ్రా స్కూల్ ముగిసిన తర్వాత కొందరు విద్యార్థులు సమీపంలోనే ఉన్న మసీదులో ప్రార్థనలకు వెళ్లారు.

అయితే అక్కడ ఉన్న ఓ జీఐ వైరును పట్టుకున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై సాద్‌అలీ భక్షి (16), అమర్‌బిన్ రహీమ్(15), ఉదీన్ (14), సయ్యద్ మహమ్మద్ ఉసేన్ (11), అహ్మద్ అలి ఖాజా ఒమర్ (15) లు గాయపడ్డారు. వెంటనే వీరిని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా అందరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement